Kona Venkat Comments: కోన వెంకట్ టాలీవుడ్ టాప్ దర్శకులను, హీరోలను పట్టుకొని టెర్రరిస్టు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ప్లానింగ్ లేని ఇలాంటి దర్శకులను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడంతో పాటు వాళ్లను క్రిమినల్స్‌గా చూడాలని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. స్టార్ హీరోలు కూడా ప్యాన్ ఇండియా మోజులో పడకుండా, ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు.
కోన వెంకట్ కామెంట్స్ పై దుమారం..
కోన వెంటకే చేసిన కామెంట్స్‌పై ఇండస్ట్రీ నుంచి, హీరోల ఫ్యాన్స్ నుంచి కౌంటర్లు గట్టిగానే వస్తున్నాయి. నిజంగా ఆయనకు అంత తోపు అయితే గతంలోలా ఇప్పుడు కూడా ఆ స్టార్ హీరోల దగ్గరకు వెళ్లి వాళ్లను మెప్పించే స్టోరీలు రాయవచ్చుగా అనే కామెంట్స్ చేస్తున్నారు. మార్కెట్ పెరిగిన తర్వాత ఇంకా పాత చింతకాయ పచ్చడి లాంటి కన్ఫ్యూజింగ్ కామెడీ కథల చుట్టూ హీరోలు తిరగలేరనే లాజిక్ కోన మిస్ అయ్యారని ఫ్యాన్స్ ఆయనకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.
కోనకు బాగానే ఇచ్చిపడేసిన అభిమానులు..
డైరెక్టర్స్‌పై ఇంతలా విరుచుపడుతున్న కోన వెంకట్.. పక్కా ప్లానింగ్‌తో ఆయన నిర్మించిన సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయని ఎదురు ప్రశ్నిస్తున్నారు. టాప్ డైరెక్టర్స్ ను క్రిమినల్స్ అంటూ అంత పెద్ద పదం వాడటం కోన వెంకట్ నోరు అదుపులో లేదనే విషయం స్పష్టమైంది. అటెన్షన్ గ్రాబింగ్ కోసమే ఆయన కావాలని ఈ ఇష్యూను క్రియేట్ చేశారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.