Heroins Strong Reply: ఓ పిల్లాడు పుట్టాక తన బాడీ షేప్‌పై వచ్చిన ట్రోల్స్‌కు లండన్ ఈవెంట్‌లో కత్రినా కైఫ్ గట్టిగానే ఇచ్చి పడేసింది ఆన్‌లైన్ ట్రోల్స్‌కు భయపడితే లైఫ్‌లో ముందుకు సాగలేమని చెప్పుకొచ్చింది. ఎవరేమన్నా మన కాన్ఫిడెన్స్ కోల్పోకూడదని ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్‌తో పాటు కౌంట్ ఇచ్చింది కత్రినా. అటు కియారా అద్వానీ సైతం తల్లైనపుడు తన బాడీ షేమింగ్ పై వచ్చిన నెగెటివ్ కామెంట్స్‌ను బోల్డ్‌గా తిప్పికొట్టి కొంత మంది కావాలని చేస్తోన్న దుష్ప్రచారానికి బోల్డ్ ఆన్సర్ ఇచ్చి వాళ్లు నోళ్లు మూయించింది.
శృతి హాసన్..
ఏ విషయమైనా సూటిగా మాట్లాడే శృతి హాసన్.. తాజాగా మరో సెన్సేషనల్ ఇష్యూపై ఓపెన్ అయ్యారు. అడల్ట్ టాయ్స్ వాడకమనేది పూర్తిగా మహిళల సెల్ఫ్ కేర్‌కు సంబంధించిన విషయమన్నారు. దీనికోసం ఎవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదని చాలా ఘాటుగానే ఓపెన్ అయింది. తన పర్సనల్ లైఫ్, హెల్త్ ఇష్యూస్‌పై ఎప్పుడూ దాచుకోని శృతి.. మహిళల పర్సనల్ ఫ్రీడమ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మృణాల్ ఠాకూర్..
గతంలో తన బాడీ షేప్ చూసి కొన్ని పాత్రలకు పనికిరావని ఓ డైరెక్టర్ కామెంట్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ మృణాళ్ ఠాకూర్ బోల్డ్‌గా రియాక్ట్ అవ్వడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ నెగెటివిటీ దాటుకుని వచ్చిన ఈ భామ.. మహిళలు తమ బాడీ కొలతలను గర్వంగా సెలబ్రేట్ చేసుకోవాలని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇవ్వడాన్ని అందరు ముక్కున వేలేసుకునేలా చేసింది. వీళ్లే కాదు చాలా మంది హీరోయిన్లు ఏ విషయాన్ని దాచుకోకుండా ఓపెన్ అవుతున్నారు.