• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Imran Khan Protest: ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు..అక్టోబరు 28లోగా దేశం విడిచి వెళ్లాల్సిందే!

Imran Khan Protest: ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు..అక్టోబరు 28లోగా దేశం విడిచి వెళ్లాల్సిందే!

Imran Khan CJP Protest: ముంబై వేదికగా ఇటీవలే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు పోలీసులు నోటిసులు ఇచ్చారు. అక్టోబరు 28 లోగా భారతదేశాన్ని విడిచి వెళ్లాలంటూ ముంబై పోలీసు అల్టిమేట్టం జారీ చేశారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ కాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్.. నోటీసులు జారీ చేయడం వెనుక అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByHarish Darla
Published: Oct 15, 2026, 12:03 PM IST|Updated: Oct 15, 2026, 12:05 PM IST
joinshare
Imran Khan Protest: ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు..అక్టోబరు 28లోగా దేశం విడిచి వెళ్లాల్సిందే!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Pakistan: పాకిస్తాన్ లో కుప్పకూలీన స్కూల్ పైకప్పు.. 30 మంది విద్యార్థుల దుర్మరణం, 40 మందికిపై తీవ్ర గాయాలు..

Pakistan: పాకిస్తాన్ లో కుప్పకూలీన స్కూల్ పైకప్పు.. 30 మంది విద్యార్థుల దుర్మరణం, 40 మందికిపై తీవ్ర గాయాలు..

2

Pakistan School Roof Collapse: ఘోర ప్రమాదం.. స్కూల్ పైకప్పు కూలి 20 మంది చిన్నారులు మృతి!

3

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధం..మీ ఓటు ఉందా? లేదా? ఎలా చెక్ చేయాలంటే?

4

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్! అక్టోబర్ 27 నుంచి కౌంటర్ టికెట్ల నిబంధనల్లో మార్పులు.. ఇవి తెలుసుకోకపోతే కష్టమే!

5

Puneeth Rajkumar Death: పునీత్ రాజ్‌కుమార్ మరణానికి ముందు చివరి గంటన్నరలో ఏం జరిగింది?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Imran Khan CJP Protest: ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్‌లో ఇటీవలే జరిగిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది.జ్ఞానేష్ కుమార్‌ తన పదవికి  రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత శనివారం ముంబైలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమలో బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ మేనల్లుడు అయిన ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నాడు.

సీఈసీకి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో నటుడు ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆయన భార్య, నటి లేఖా వాషింగ్టన్, అతని కజిన్ సిస్టర్ జైన్ మేరీ ఖాన్ (అడివిశేష్ చిత్రం 'డెకాయిట్'లో నటి) కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కారణంగా ముంబై పోలీసులు ఈ ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.

దేశం విడిచి వెళ్లాలని నోటీసు..
సీఈసీకి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో నటుడు ఇమ్రాన్ ఖాన్, లేఖా వాషింగ్టన్, జైన్ మేరీ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నా..తాజాగా మరోసారి నటుడు ఇమ్రాన్ ఖాన్ ఓ కీలక నోటీసు జారీ చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ అక్టోబర్ 28వ తేదీ లోగా భారత్‌ను విడిచి వెళ్లాలని ముంబై పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

పౌరసత్వ వివాదం, ఇమ్మిగ్రేషన్ చర్యలు..
నటుడు ఇమ్రాన్ ఖాన్ భారత పౌరుడు కానప్పటికీ.. ఆయన అమెరికాలో జన్మించి అక్కడి పౌరసత్వం ఉన్నా.. భారతదేశంలో జరుగుతోన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలకు పాల్పడ్డారు. విదేశీ పౌరుడై ఉండి భారత్‌ నిరసనలో పాల్గొన్నందున, ఇమ్మిగ్రేషన్ చట్టంలోని సంబంధిత నిబంధనల కింద ఆయనపై ముంబై పోలీసులు దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

అయితే, నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు భారత పౌరసత్వం లేదనే వార్తలకు సంబంధించి స్వతంత్రంగా ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఏది ఏమైనా ముంబై పోలీసులు జారీ చేసిన నోటీసుల ప్రకారం.. నటుడు ఇమ్రాన్ ఖాన్ అక్టోబర్ 28 లోగా దేశం విడిచి వెళ్లాల్సి ఉంది.

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News