• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్! అక్టోబర్ 27 నుంచి కౌంటర్ టికెట్ల నిబంధనల్లో మార్పులు.. ఇవి తెలుసుకోకపోతే కష్టమే!

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్! అక్టోబర్ 27 నుంచి కౌంటర్ టికెట్ల నిబంధనల్లో మార్పులు.. ఇవి తెలుసుకోకపోతే కష్టమే!

భారతీయ రైల్వే ప్రయాణికులకు సుప్రీంకోర్టు నుంచి ఒక శుభవార్త అందింది. గతంలో కేవలం ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే బీమా సౌకర్యం అందుబాటులో ఉండేది. అయితే, అక్టోబర్ 27, 2026 నుండి ఆఫ్ లైన్ రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కూడా ఈ ఇన్సూరెన్స్ కవరేజీని అందుబాటులోకి తీసుకురావాలని కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 15, 2026, 01:24 PM IST|Updated: Oct 15, 2026, 01:28 PM IST
joinshare
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్! అక్టోబర్ 27 నుంచి కౌంటర్ టికెట్ల నిబంధనల్లో మార్పులు.. ఇవి తెలుసుకోకపోతే కష్టమే!
Image Credit: Indian Railways New Rule:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Gymnastics Coach Sentenced: కోచింగ్‌కి వచ్చిన యువతుల అశ్లీల దృశ్యాలు రికార్డు..జిమ్నాస్టిక్స్ కోచ్‌కు 90 ఏళ్ల జైలుశిక్ష!

Gymnastics Coach Sentenced: కోచింగ్‌కి వచ్చిన యువతుల అశ్లీల దృశ్యాలు రికార్డు..జిమ్నాస్టిక్స్ కోచ్‌కు 90 ఏళ్ల జైలుశిక్ష!

2

Vijayawada: ప్రియుడికి కోసం డ్రగ్స్ పెడ్లర్ గా మారిన యువతి.. అసలు విషయం తెలిస్తే షాక్ ..

3

బ్రిటన్ టీనేజర్ల సరికొత్త ఆలోచన.. రంగులు మారే కండోమ్ వెనుక అసలు కథ ఇదే!

4

నథింగ్ ఫోన్ 4aపై రూ.7,700 వరకు డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్!

5

Pakistan: పాకిస్తాన్ లో కుప్పకూలీన స్కూల్ పైకప్పు.. 30 మంది విద్యార్థుల దుర్మరణం, 40 మందికిపై తీవ్ర గాయాలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Indian Railways New Rule: రైలు ప్రయాణికులకు ఇది ఒక గొప్ప వార్త. ప్రయాణానికి ముందుగా రిజర్వేషన్ చేసుకోవడం అలవాటు. ఇది ఆన్‌లైన్, ఆఫ్ లైన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ ద్వారా 60 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకోవచ్చు, అలాగే తత్కాల్ టికెట్లు కూడా లభిస్తాయి. ఆఫ్లైన్‌లో కూడా రిజర్వేషన్ కేంద్రాలకు వెళ్లి సీట్ల లభ్యతను బట్టి బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు కేవలం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసే వారికి మాత్రమే బీమా కవరేజీ ఎంచుకునే అవకాశం ఉండేది. కానీ, సుప్రీంకోర్టు ఇప్పుడు కీలక ఆదేశాలు జారీ చేస్తూ, భారతీయ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద టికెట్లు విక్రయించేటప్పుడే ఇన్సూరెన్స్ స్కీమ్‌ను కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అక్టోబర్ 27, 2026 నుండి ఇది తప్పనిసరి కానుంది. దీనివల్ల ఆన్‌లైన్‌లోనే కాకుండా, ఆఫ్ లైన్‌లో కూడా రైలు ప్రయాణికులకు బీమా సౌకర్యం లభిస్తుంది.

అహ్సనుద్దీన్ అమనుల్లా  బెంచ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే భద్రతకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఆర్ మహదేవన్, అమనుల్లా ఈ ఆదేశాలను జారీ చేశారు. ప్రస్తుతం నామమాత్రపు రుసుము చెల్లిస్తే ఆన్‌లైన్ ప్రయాణికులకు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం లభిస్తోంది. దీన్ని ఆఫ్‌లైన్‌కు కూడా వర్తించాలని పేర్కొంది.

సుప్రీంకోర్టు ఆదేశాలు..
సుప్రీంకోర్టు జారీ చేసిన ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. నిబంధనలు పాటించకపోతే భారతీయ రైల్వేయే దానికి బాధ్యత వహించాలని పేర్కొంది. రైలు ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేసే సమయంలోనే రిజర్వేషన్ కౌంటర్లలో ఇన్సూరెన్స్ రక్షణను అందించడం తప్పనిసరి అని తెలిపింది. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 27, 2026 నుండి అమల్లోకి వస్తుంది. గతంలో కూడా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు రైల్వేకు సూచించింది. ముఖ్యంగా భారతీయ రైల్వేలో ప్రయాణించే అట్టడుగు వర్గాల వారికి, మధ్యతరగతి, పేద ప్రజలకు కూడా ఈ ప్రయోజనం అందాలని, వారికి తగినంత సమయం ఇస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

Read ALso: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చర్లపల్లికి స్పెషల్ ట్రైన్! కానీ ఆ రూట్లలో పలు రైళ్లు రద్దు!

గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఎటువంటి వృద్ధి కనిపించలేదని, కాబట్టి ఇన్సూరెన్స్ కవరేజీని కౌంటర్లలో కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
అయితే, కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే కాకుండా, ఇతర క్షేత్రస్థాయి అంశాలలో కూడా సరైన మెరుగుదల లేదని సుప్రీంకోర్టు బెంచ్ ఆందోళనలో పడింది. మెరుగైన సేవలు , రైల్వే భద్రతపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హామీలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో మార్పులు కనిపించడం లేదని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ నవంబర్ 16న జరగనుంది. ఈ విచారణకు రైల్వే బోర్డు చైర్మన్, ఇతర సభ్యులు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిట్ జనరల్ విక్రమ్ బెనర్జీ హాజరై, లక్ష్యాలను చేరుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు, తగినంత సమయం కావాలని కోరుతూ అభ్యర్థనలు సమర్పించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Indian Railways