• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /రామాయణ, రాకా చిత్రాలపై హాలీవుడ్ ఎఫెక్ట్.. ? ట్రోలింగ్‌తో మేకర్స్‌కు కొత్త టెన్షన్.. !!

రామాయణ, రాకా చిత్రాలపై హాలీవుడ్ ఎఫెక్ట్.. ? ట్రోలింగ్‌తో మేకర్స్‌కు కొత్త టెన్షన్.. !!

Indian Movies Compared Hollywood: భారతీయ సినిమాలను హాలీవుడ్ చిత్రాలతో పోల్చడం అవసరం లేదు. వారి బడ్జెట్.. వారి స్టైల్ ఆఫ్ మేకింగ్ అన్ని ప్రత్యేకమే. తాజాగా మన భారతీయ చిత్రాలను హాలీవుడ్‌తో పోల్చి అనవసరంగా ట్రోల్‌కు గురవుతున్నారు. అవును మన మేకర్స్ కూడా విజువల్ వండర్స్ అంటూ అంచనాలు పెంచేసి చివరికి అనవసరమైన ట్రోలింగ్ బారిన పడుతున్నారు. ఇప్పుడేమో ‘రాకా’ మూవీని ఏకంగా అవతార్‌ను బీట్ చేసి చూపిస్తామంటూ మరో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. నిజంగా ఈ కంపారిజన్స్‌తో పనేంటి..? కంటెంట్ ఉంటే సరిపోతుంది. మరి మేకర్స్ అత్యుత్సాహామా..?

Written ByTA Kiran Kumar Sharma
Published: Sep 24, 2026, 03:51 PM IST|Updated: Sep 24, 2026, 03:55 PM IST
joinshare
రామాయణ, రాకా చిత్రాలపై  హాలీవుడ్ ఎఫెక్ట్.. ? ట్రోలింగ్‌తో  మేకర్స్‌కు కొత్త టెన్షన్.. !!
Image Credit: Hollywood movies Comparison

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

VFX Trolling: సాధారణంగా VFX గ్రాఫిక్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాల బజ్ పెంచడానికి మేకర్స్ ఏకంగా హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో పోలుస్తూ ఒక్కొసారి పప్పులో కాలేస్తున్నారు. గతంలో ‘దేవర’ ప్రమోషన్స్‌లో కళ్యాణ్ రామ్ ఏకంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ పేరు వాడేసి విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. తీరా థియేటర్లలో ఆ రేంజ్ గ్రాండియర్ లేకపోవడంతో అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ ఒకింత నిరాశకు గురయ్యారు. ఓ రకంగా దేవర సినిమాకు ట్రోల్‌కు కారణమైంది.

రామాయణం..  

పౌరాణిక  ప్రాజెక్ట్ రామాయణ విషయంలోనూ సరిగ్గా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. మేకర్స్ తమ సినిమా బడ్జెట్ రూ. 4 వేల కోట్లు అంటున్నారు.. కానీ అందులో విజువల్స్ మాత్రం ఆ స్టాండర్డ్స్‌లో లేవనేవి కామన్ ఆడియన్స్ చెప్పుకుంటున్న మాట.  హాలీవుడ్ లెవెల్ అంటూ ముందే ఊదరగొట్టడం వల్లే ఆ గ్రాఫిక్స్‌పై సోషల్ మీడియాలో ఈ రేంజ్ ట్రోలింగ్ నడుస్తుంది. ఆ గొప్పలకు పోయినపుడే ఈ తిప్పలు వస్తున్నాయి.

రాకా..

తాజాగా రాకాను సేమ్ డేంజర్ జోన్‌లోకి నెట్టేస్తున్నారు. ఈ సినిమా విజువల్స్ అవతార్‌ను మించిపోతాయని దర్శకుడు సిబి చక్రవర్తి చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.  ఇలాంటి భారీ స్టేట్‌మెంట్స్ ఇచ్చినపుడు ఆ రేంజ్ ఔట్‌పుట్  ఉండాలి. ఏమాత్రం తేడా కొట్టినా నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ నిజంగా హాలీవుడ్‌ను మించేలా ఉంటే.. అది విడుదలయ్యాక ఆడియన్సే సోషల్ మీడియా వేదిగా చెబుతారు.  
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News