జైలర్ 2, రణబాలి సహా దసరా పండక్కి బాక్సాఫీస్ దండయాత్ర చేస్తోన్న సినిమాలు..
Dasara Box Office Movies: ఈ సారి దసరా పండక్కి బడా సినిమాలతో పాటు చోటా మూటా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నాయి. ఇందులో అందరి చూపు రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన ‘రణబాలి’ సినిమాలపైనే ఉంది. వీటితో పాటు క్రేజీ కళ్యాణం, గరివిడి లక్ష్మి సినిమాలు లైన్లో ఉన్నాయి.
This Week Box Office Movies: సంక్రాంతి, సమ్మర్ తర్వాత తెలుగు బాక్సాఫీస్ దగ్గర దసరా సీజన్ అత్యంత కీలకమైనది. ఈ సీజన్లో సినిమాలు రిలీజ్ చేస్తే పిల్లల హాలీడేస్ లాంటివి సినిమాలకు పెద్ద అడ్వాంటేజ్. పాజిటివ్ వచ్చిందంటే సినిమాకు బీభత్సమైన వసూల్లు గ్యారంటీ. ఒకవేళ పెద్దగా టాక్ లేకపోయినా.. హాలీడేస్ సీజన్ కలిసొచ్చే అవకాశాలున్నాయి. అందుకే చాలా మంది బడా స్టార్ హీరోలు ఈ సీజన్లో సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. ఈ సారి విజయదశమికి ముందుగా బాక్సాఫీస్ బరిలో జైలర్ 2 రాబోతుంది. ఆ తర్వాత రణబాలి, గరివిడి లక్ష్మి, క్రేజీ కళ్యాణం సినిమాలు లైన్లో ఉన్నాయి.
జైలర్ 2..
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’ పేరు డబ్బింగ్ చిత్రమైన స్ట్రెయిట్ చిత్రాల మాదిరి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ‘జైలర్’ మూవీకి సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ట్రైలర్ విడుదల తర్వాత అనుకున్నంత బజ్ ఈ సినిమాపై ఏర్పడలేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత వచ్చే టాక్‌ను బట్టి ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.
రణబాలి ..
విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా హిట్ కోసం ముఖం వాచిపోయాడు. పైగా పెళ్లి తర్వాత తన భార్య రష్మిక జోడిగా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా బుకింగ్స్‌లో మెల్లగా జోరు చూపిస్తుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో .. గత పేట్రియాట్రిక్ మూవీలతో పోలీక రావడం సహజం. మరి గతంలో వచ్చిన స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలకు భిన్నంగా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.
గరివిడి లక్ష్మి..
గరివిడి లక్ష్మి.. గౌరీ నాయుడు జమ్ము డైరెక్ట్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఆనంది ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసింది.ఈ సినిమా జానపద కళాకారిణి పాత్ర జీవితంపై తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కాబోతుంది.
క్రేజీ కళ్యాణం..
అనుపమ పరమేశ్వరన్, నరేష్, ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఏర్పడ్డాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఈ సినిమా గట్టేక్కడం ఖాయం. ఈ సినిమా అక్టోబర్ 17న శనివారం రోజున విడుదల కాబోతుంది.