Jason Sanjay: ప్రస్తుతం అందరి దృష్టి విజయ్ కొడుకు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం సిగ్మా పైన ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో యాంకర్ జాసన్‌ను ఆయన తండ్రి విజయ్ చేసే ‘డాడ్‌లాంటి’ పనుల గురించి సరదాగా ప్రశ్నించారు. ముఖ్యంగా విజయ్‌కు కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చెప్పాలని అడిగారు. దీనికి జాసన్ తన తండ్రి, తల్లి వ్యక్తిత్వాలను పోలుస్తూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు.
జాసన్ చెప్పిన వివరాల ప్రకారం, విజయ్ వ్యక్తిగత జీవితంలో చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటారట. సాధారణంగా ఆయనకు తొందరగా కోపం రాదని, ఎక్కువగా కూల్‌గా ఉంటారని జాసన్ తెలిపారు. అయితే విజయ్‌కు నిజంగా కోపం వస్తే మాత్రం పరిస్థితి చాలా సీరియస్‌గా మారుతుందని సరదాగా చెప్పారు. “అప్పాకు కోవం వందా అవ్లోదాన్” అంటూ తన తండ్రి కోపం గురించి ఆసక్తికరంగా వివరించారు. అంటే విజయ్‌కు కోపం వస్తే ఇక విషయం అక్కడితో ముగిసినట్లేనని ఆయన భావం.
అదే సమయంలో తన తల్లి సంగీత గురించి కూడా జాసన్ మాట్లాడారు. విజయ్‌తో పోలిస్తే సంగీత కొంచెం ఎక్కువగా కోప్పడతారని, తప్పు చేస్తే వెంటనే గుర్తిస్తారని చెప్పారు. తాను ఏం తప్పు చేస్తున్నానో చాలా త్వరగా కనిపెట్టే విషయంలో ఆమెకు ‘స్పై’ లాంటి లక్షణం ఉందని సరదాగా చెప్పారు. జాసన్ వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఇక ‘సిగ్మా’ విషయానికి వస్తే.. ఈ సినిమాలో సందీప్ కిషన్ గురు అనే పాత్రలో నటించారు. అతను రేడియో హోస్ట్‌గా, ట్రెజర్ హంటర్‌గా కనిపిస్తాడు. ఫారియా అబ్దుల్లా, సంపత్ రాజ్, శివ పండిట్ కీలక పాత్రల్లో నటించారు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. రూ.500 కోట్ల డ్రగ్స్, గ్యాంబ్లింగ్ సిండికేట్‌ను నడిపించే కోట్లపాటి వీరయ్య రెడ్డిపై గురు భారీ దోపిడీకి ప్లాన్ చేయడం చుట్టూ కథ సాగుతుంది. విజయ్ కుమారుడిగా వచ్చిన గుర్తింపుతో పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని జాసన్ ప్రయత్నిస్తున్నారు. ‘సిగ్మా’తో దర్శకుడిగా ఆయన తొలి అడుగు వేశారు.
Also Read: టాలీవుడ్‌లో ట్రేడ్ సర్కిల్స్‌లో రామాయణ, జైలర్ 2 సినిమాల బిజినెస్ డీల్స్..
Also Read: అనిరుథ్‌ను భయపెడుతున్న సాయి అభ్యంకర్..