SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

‘జయహో రామానుజ’.. జెన్‌జీ తప్పక చూడాల్సిన సినిమా..

Jayaho Ramanuja Review Rating: ‘ఓం నమో నారాయణాయ:’ అంటూ అష్ఠాక్షరి మంత్రాన్ని ప్రపంచానికి ఉపదేశించిన త్రిమాత చార్యుల్లో ఒకరైన శ్రీ వైష్ణవ మత స్థాపకుడు శ్రీ రామానుజ చార్యుల లైఫ్ హిస్టరీ ఆ తరం నుంచి ఈ తరం వరకు అందరికీ ఆదర్శం. సుమారు వెయ్యేళ్ల క్రితమే సమసమాజ స్టాపనను చేతుల్లో చేసి చూపించిన మహనీయుడు. దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఆలయ ప్రవేశం కల్పించిన లోక జనోద్ధారకుడు. అంతేకాదు ముని వాహన సేవతో మనుషులంతా ఒక్కటే అని చెప్పిన మహా గురువు . తాజాగా ఈయన జీవితంపై వచ్చిన ‘జయహో రామానుజా’ ఈ రోజు విడుదలైంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 24, 2026, 04:03 PM IST | Updated: Oct 24, 2026, 10:14 PM IST
Image Credit: Jayaho Ramanuja Review (X/Source)
Join

Jayaho Ramanuja Movie Review: లయన్ డాక్టర్ సాయి వెంకట్ యాక్ట్ చేస్తూ మెగాఫోన్ పట్టుకొని తెరకెక్కించిన చిత్రం  ‘జయహో రామానుజ’. సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక ఈ  చిత్రాన్ని  నిర్మించారు. అమెరికాకు చెందిన నటి జో శర్మ ఇందులో కథానాయికగా యాక్ట్ చేశారు.  సీనియర్ హీరో  సుమన్ ఢిల్లీ సుల్తాన్‌గా నటించారు.  ప్రవళ్లిక, గురురాజ్ ఇతర కీలక పాత్రల్ యాక్ట్ చేశారు. ఈ సమాజంలో కుల మతబేధాలు లేకుండా మనుషులంతా ఒక్కటే అని లోకానికి చాటిచెప్పిన  శ్రీ రామానుజాచార్యుల వారి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘జయహో రామానుజ’ ఈ శనివారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మన రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే..

11వ శతాబ్దంలో మనుష్య లోకంలో ప్రజలందరూ కుల మతబేధాలతో  కొట్టుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ నిత్యం కలహించుకుంటూ ఉంటారు. దీంతో దుష్ట శిక్షణ.. శిష్ణ రక్షణార్దం  శ్రీమహావిష్ణువు... మానవులంతా ఒక్కటే... వీరి మధ్య ఎలాంటి  బేధాభావాలు  లేకుండా చేసి... వారిని ఎల్లపుడు  సుఖంగా ఉంచాలనే తలంపుతో... సాంప్రదాయ శ్రీ వైష్ణవ కుటుంబంలో శ్రీరామానుజాచార్యులు జన్మించేలా చేస్తారు. పువ్వు పుట్టగానే పరిమిళిస్తున్నట్టు పుత్ర కామేష్టి యాగం కారణంగా శ్రీ పెరంబదూర్‌లో పుట్టిన శ్రీ రామానుజాచార్యులు తండ్రి సంరక్షణలో చిన్నపుడే అన్ని సకల విద్యా పారంగతడవుతాడు.  ఆ తరువాత కంచికి యాదవ ప్రకాశుల వద్ద వేద విద్యలో మరింత నిష్ణాతుడవుతాడు.వేదం,  తర్కం, మీమాంసం, జ్యోతిష్యం   సహా అన్నింటిలో రాణిస్తాడు.   ఈ క్రమంలో శ్రీమద్ రామానుజాచార్యుల జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది. మనుషులంతా ఒక్కటే.. దేవుడు ముందు అందరు సమానమే అని చెప్పడానికి ఏం చేశారు. ఆయన అనుకున్నది ఎలా సాధించారు. శ్రీ మహా విష్ణువు మహా భక్తులైన ఆళ్వారుల్లో అగ్రస్థానం ఎలా పొందారనేది తెలియాలంటే ఈ చారిత్రక నేపథ్యమున్న సినిమాను వీక్షించి తరాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

త్రిమతాల్లో ఒకటైన ద్వైత మత స్థాపకుడు (శ్రీ వైష్ణవ)  ఇక   శ్రీమద్ భగవద్ రామానుజాచార్యుల వారి జీవితం గురించి ఈ తరంలో కొద్ది మందికి మాత్రమే తెలుసని చెప్పాలి. కానీ జెన్‌జీ తరంలో కొంత మందికి మాత్రమే కి ఆయన జీవితం తెరిచిన పుస్తకం. అలాంటి మహానుభావుడి జీవితకథను తెరమీద ఆవిష్కరించడం అంటే ఆషామాషీ కాదు. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌లో  నటించిన  లయన్ సాయి వెంకట్ తనే శ్రీమద్ రామానుజాచార్యుల జీవితాన్ని కాచి వడపోసి జీయర్ స్వాముల మార్గదర్శకత్వంలో  రామానుజా చార్యుల వారి జీవితాన్ని తెరమీద ఎంతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వెండితెరపై ఆవిష్కరించిన విధానం బాగుంది. ఆయన జీవితాన్ని నేటి యువతకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో  ఎంతో శ్రమించి శ్రీరామానుజా చార్యుల వారి జీవితంలో కొన్ని  ముఖ్యఘట్టాలను సినిమాలో చూపించారు.  

ముఖ్యంగా కంచి రాజుకుమార్తే ఓ దుష్టశక్తి వల్ల పీడించబడుతుంటే... ఆ దుష్టశక్తి నుంచి ఆమెను కాపాడే ఘట్టం ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మలిచిన విధానం బాగుంది. అలాగే శ్రీమహా విష్ణువు దశావతారాలను చూపించిన విధానం బాగుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ లో చంద్రగిరి మహారాజు సమక్షంలో కలియుగదైవం అయిన శ్రీవేంకటేశ్వరుడు ఏ వర్గానికి చెందిన వారని శ్రీ వైష్ణవులకు, శివ భక్తులైన శైవులకు మధ్య  మధ్య జరిగే వాదనను వేదవ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ... చివరకు శ్రీ వేంకటేశ్వరుడు ఏ వర్గానికి చెందిన వారనేదాన్ని చాలా బాగా చంద్రగిరి మహారాజు చేత చెప్పించిన విధానం ఆకట్టుకుంటుంది. బ్రహ్మోత్సవ ఘట్టం.  ఇలా చరిత్రలో జరిగిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించే విషయంలో కొంచెం లిబర్టీ తీసుకున్నట్టు కనపబడింది.  మొత్తంగా ముని వాహన సేవ గొప్పదనం,అష్ఠాక్షరీ మంత్రాన్ని అన్ని వర్గాలకు వినపడేలా గుడి గోపురం నుంచి పిలుపు నిచ్చే సీన్స్ బాగున్నాయి.

ఈ చిత్రానికి  హీరోగా, దర్శకుడిగా, ఆయన కుటుంబ సభ్యులే నిర్మాత కావడంతో సినిమాను ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండేది.  శ్రీరామానుజాచార్యుల వారి జీవిత చరిత్రను ఏదైతే వెండితెరపై చూపించాలనుకున్నారో... దాన్నే చక్కగా... ఆధ్యాత్మికతను జోడించి మెప్పించారు. ప్రేక్షకులు ఎక్కడా బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాలను బేస్ చేసుకుని తెరమీద చూపించిన విధానం బాగుంది. ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ ఎపిసోడ్..  ఆయన మహత్యాలు అన్ని బాగున్నాయి. ఇక ఈ సినిమాకు  నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండేది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు.  శ్రీరామానుజాచార్యుల వారి జీవితాన్ని ఈతరానికి పరచయం చేయడానికి చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. ఈచిత్రానికి ‘అవతార్ రామానుజ2’ పేరుతో సీక్వెల్ కూడా ఉన్నట్టు చివర్లో చెప్పుకొచ్చారు. ఈ వారం విడుదలైన ఈ చారిత్రక నేపథ్య చిత్రాన్ని ఇప్పటి జెన్ జీ తరం చూసి నేర్చుకోవాల్సిందే.

నటీనటుల విషయానికొస్తే.. 
లయన్ సాయి వెంకట్ ప్రధాన పాత్రలో ఒద్దికగా నటించారు.  అలాగే శ్రీమహావిష్ణువు పాత్రలో నటించిన విధానం బాగుంది. అలాగే దశావతారాలను పోషించి ఆయన పలికిన డైలాగ్స్  బాగున్నాయి. ఆయనతో పాటు నటించిన జోశర్మ కూడా తన పాత్ర పరిధి మేరకు మెప్పించింది. నటి ప్రవల్లిక కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లో ఒదిగిపోయారు.  ఢిల్లీ సుల్తాన్ పాత్రలో సీనియర్ నటుడు  సుమన్‌ను పర్ఫెక్ట్ ఛాయిస్. నిర్మాత గురురాజ్ కూడా సమాజంకోసం తిరు మంత్రోపదేశం ఉపదేశించే రామానుజా చార్యుల వారి గురువు పాత్రలో మెప్పించరు. . మిగతా పాత్రల్లో నటించిన వారంతా తమతమ పాత్రల పరిధి మేరకు యాక్ట్ చేశారు.


బ్యాటమ్ లైన్.. యువ తరానికి సందేశాన్ని ఇచ్చే... ‘జయహో రామానుజ’..


రేటింగ్: 3/5

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES