SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Jayanth and the Jingo: చిల్డ్రన్స్ డే స్పెషల్‌.. థియేటర్లలోకి ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ మూవీ..!

Jayanth and the Jingo: చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా నవంబర్ 14న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది జయంత్ అండ్ ది జింగో పెన్ మూవీ. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.

Written By Ashok Krindinti
Published: Nov 11, 2026, 07:27 PM IST | Updated: Nov 11, 2026, 07:29 PM IST
Image Credit: Jayanth and the Jingo
Join

Jayanth and the Jingo: పిల్లల ప్రతిభ, భావోద్వేగాలు, మంచి సందేశంతో రూపొందిన మూవీ ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ సినిమా నవంబర్ 14న చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించిన ఈ మూవీ జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వం వహించారు. మాస్టర్ జయంత్ బొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించగా, ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు తనికెళ్ల భరణి, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సహా పలువురు అతిథులు సినిమా విజయంపై ఆశాభావం వ్యక్తం చేశారు.

తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. పిల్లలు కుటుంబమంతా కలిసి చూసే మంచి కథా చిత్రాలు ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా వస్తున్నాయన్నారు. పిల్లలకు ఉపయోగపడే సందేశంతో ఈ సినిమాను రూపొందించారని, మాస్టర్ జయంత్ నటనలో మంచి భవిష్యత్తు కనిపిస్తోందని ప్రశంసించారు. సినిమా తప్పకుండా విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు.

ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పిల్లల కోసం ఇలాంటి సందేశాత్మక సినిమాను నిర్మించడం అభినందనీయమన్నారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రత్యేక టాలెంట్‌ను గుర్తించి.. ఆ ప్రతిభకు తగ్గినట్లుగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయని.. ప్రతి ఒక్కరూ సినిమాను చూడాలని కోరారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు. కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. పిల్లలతో చేసే మంచి సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయన్నారు. ఇలాంటి మంచి సినిమాలను అందరూ ఆదరించాలని కోరారు.

నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమా స్టోరీ ఎమోషనల్‌గా ఉంటుందని.. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న విడుదల చేస్తున్న తమ చిత్రానికి ప్రేక్షకుల మద్దతు కావాలని కోరారు. ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమాకు ట్యూన్స్, డైలాగ్స్, పాటలు రాసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. మలయాళం నుంచి రీమేక్ హక్కులు తీసుకుని.. ఈ మూవీని ఇక్కడి వరకు తీసుకువచ్చేందుకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పారు.  

దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. జయంత్ నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా.. సింగిల్ టేక్‌లో చెప్పగల టాలెంట్ అతడిలో ఉందని ప్రశంసించారు. సంగీతం, మాటలు, కథను తెరపైకి తీసుకురావడంలో చిత్ర బృందం ఎంతో కష్టపడిందని చెప్పారు. ఇలాంటి సినిమాలను పోత్సహించడం మన అందరి సామాజిక బాధ్యత అని అన్నారు.

నటుడు ఆశిష్ గాంధీ ఈ సినిమాను హిందీ చిత్రం ‘తారే జమీన్ పర్’తో పోలుస్తూ.. తెలుగులోనూ పిల్లలు, తల్లిదండ్రులు కలిసి చూసే మంచి చిత్రంగా నిలుస్తుందని అన్నారు. సత్యం రాజేష్ సైతం చిత్రీకరణ అనుభవాలను గుర్తు చేసుకుంటూ జయంత్ నటనను ప్రశంసించారు. నటుడు కాశీ విశ్వనాథ్, అశోక్ కుమార్ సహా పలువురు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మాస్టర్ జయంత్ కూడా తనకు ఈ అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులు, దర్శకుడు, చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు చెబుతూ.. సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని, కుటుంబ సమేతంగా సినిమాను చూడాలని కోరారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES