• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Junior NTR: కుటుంబం కాదు.. ఎన్టీఆర్‌కు ఎప్పుడూ అండగా నిలిచిన వ్యక్తి ఎవరో తెలుసా..?

Junior NTR: కుటుంబం కాదు.. ఎన్టీఆర్‌కు ఎప్పుడూ అండగా నిలిచిన వ్యక్తి ఎవరో తెలుసా..?

Junior NTR: జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కుటుంబం మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ బంధం ఎంత ప్రత్యేకమైనదో మరోసారి చూపించాయి. ముఖ్యంగా రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ గురించి ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఎమోషనల్ చేస్తున్నాయి.

Written ByVishnu Priya
Published: Sep 30, 2026, 09:55 AM IST|Updated: Sep 30, 2026, 10:03 AM IST
joinshare
Junior NTR: కుటుంబం కాదు.. ఎన్టీఆర్‌కు ఎప్పుడూ అండగా నిలిచిన వ్యక్తి ఎవరో తెలుసా..?

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Junior NTR: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ సినిమాను శశాంక్ ఏలేటి తెరకెక్కించారు. ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన సినీ ప్రయాణంలోని తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు. తన మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ ఓపెనింగ్ సమయంలో తాను ఒంటరిగా వెళ్లిన విషయాన్ని చెప్పారు.

"నేను ఒక్కడినే భయపడుతూ వెళ్లాను. ఆ రోజు చాలా బాధపడ్డాను. నా చేయి పట్టుకుని ధైర్యం చెప్పే కుటుంబ సభ్యులు నా పక్కన లేరని బాధ కలిగింది" అని ఎన్టీఆర్ చెప్పారు.

తర్వాత తన జీవితంలో అభిమానులు, రాజమౌళి కుటుంబం ఎలా భాగమయ్యారో ఎన్టీఆర్ వివరించారు.

"నా బాధను దేవుడు విన్నాడేమో. అభిమానుల రూపంలో నాకు కుటుంబాన్ని ఇచ్చాడు. నా ఫ్యామిలీ సరిపోదనుకున్నాడేమో.. రాజమౌళి ఫ్యామిలీని కూడా నా ఫ్యామిలీ చేశాడు" అని అన్నారు.

ముఖ్యంగా కార్తికేయ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ అయ్యారు.

"కీరవాణి గారు, వల్లి గారు, రాజమౌళి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులయ్యారు. వీరందరితో పాటు కార్తికేయను కూడా నాకు తోడుగా ఇచ్చాడు" అని చెప్పారు.

‘స్టూడెంట్ నంబర్ 1’ సమయంలో తనకు 17 ఏళ్లు, కార్తికేయకు 8 ఏళ్లు అని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు.

"ఆర్‌ఆర్‌ఆర్‌ అయినా, బాహుబలి అయినా.. ఎన్నో విషయాలు జరగడం వెనుక కార్తికేయ ఉన్నాడు. నా ప్రతి చిరునవ్వు వెనుక కూడా అతని సపోర్ట్ ఉంది" అని ఎన్టీఆర్ అన్నారు.

అంతేకాదు, తన తల్లిని చిన్నప్పుడు "నన్ను మాత్రమే ఎందుకు కనావు?" అని అడిగేవాడినని చెప్పారు.

"నాకు సొంత తమ్ముడు ఉండి ఉంటే.. అతను కూడా కార్తికేయలాగే ఉండేవాడేమో అనిపిస్తుంది" అని ఎన్టీఆర్ చెప్పడం అందరినీ కదిలించింది.
కుటుంబంలో పుట్టకపోయినా.. జీవితంలో కుటుంబ సభ్యుడిగా మారిన కార్తికేయ గురించి ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాపై బ్యాన్.. అసలు కారణం ఇదే!

Also Read: NTR Trivikram Movie: ఎన్టీఆర్ కోసం అన్నీ కొత్తగా..గాడ్ ఆఫ్ వార్ లో ఊహించని ట్విస్ట్!

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Tollywood
Telugu Movie