SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చిత్ర సీమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు ‘సింగీతం శ్రీనివాసరావు’ కన్నుమూత..

Singeetham Srinivas Rao Death News: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సహా దక్షిణాదితో పాటు హిందీ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగీతం శ్రీనివాస రావు వయో భారం కారణంగా కాసేపటి క్రితమే చెన్నైలో కన్నుమూసారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 03, 2026, 11:21 PM IST | Updated: Oct 03, 2026, 11:32 PM IST
Image Credit: Singeetham no More (File/Source)
Join

Legendery Director Singeetham Srinivas Rao Passed Away: సింగీతం శ్రీనివాస రావు విషయానికొస్తే.. తెలుగు ప్రేక్షకులకు  భవిష్యత్తును చూపించి  దార్శనిక దర్శకుడు. కృష్ణదేవరాయల వైభవాన్ని కళ్లకు కట్టిన సినీ మ్యూజియన్. టాకీలతో విసుగెత్తిన జనాలకు మూకీ సినిమాలోని మజా చూపించిన దిట్ట. కంప్యూటర్ యుగంలో జాపపదాన్ని సినిమాగా తీసి..మెప్పించిన ఘనాపాఠి.  సైంటిఫిక్...ఫిక్షన్...సాంఘికం.. పౌరాణికం..చారిత్రాత్మకం...కథ ఏదైనా సింగీతం చేతిలో పడితే అందమైన దృశ్య కావ్యంగా మారిపోవాల్సిందే. సిల్వర్ స్క్రీనే ఆయనకో ప్రయోగశాల అని చెప్పాలి. తన తుది శ్వాస వరకు సినిమానే శ్వాసగా, ధ్యాసగా గడిపిన ఈయన  కాసేటి క్రితం చెన్నైలో కావేరి హాస్పిటల్లో వయోభారంతో అంతిమ శ్వాస విడిచారు.

చివరగా సింగీతం సినిమాతో పలకరించిన లెజండరీ దర్శకుడు.. 

చివరిగా ఆయన నాగ్ అశ్విన్ నిర్మాణంలో తన పేరు ధ్వనించేలా ‘సింగ్ గీతం’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. 94 ఏళ్ళ వయసులో కూడా దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసల సైతం అందుకున్నారు. ఈ వయసులో సినిమా తెరకెక్కించిన దర్శకుడు బహుశా ప్రపంచ సినీ చరిత్రలో ఎవరు లేరు. ఆయన మరణంపై సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

ముఖ్యంగా కమల్ హాసన్, బాలకృష్ణలతో ఆయన అనుబంధం ప్రత్యేకమనే చెప్పాలి. ఈ యేడాది  తెలంగాణ ప్రభుత్వం సింగీతం శ్రీనవాసర రావును బి.ఎన్.రెడ్డి అవార్డుతో గౌరవించింది. 

బాలయ్య, కమల్‌లతో ప్రత్యేక అనుబంధం.. 

ముఖ్యంగా కమల్ హాసన్‌తో‘విచిత్రసోదరులు’,  పుష్పక విమానం,సోమ్మెకడిది సోకెకడిది చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఇక బాలకృష్ణతో ‘ఆదిత్య 369’ ‘భైరవ ద్వీపం’ సినిమాలు తెలుగులో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయాయి. చివరగా వీళ్ల కలయికలో వచ్చిన ‘శ్రీ కృష్ణార్జున విజయం’సినిమా టెక్నికల్‌గా బాగున్నా.. ఎందుకో ప్రేక్షకుల మెప్పు పొందలేదు. మొత్తంగా బాలయ్యతో షైన్స్ ఫిక్సన్, జానపదం, పౌరాణిక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా నిలిచిపోయారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES