• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /సింగీతం శ్రీనివాస రావు సినీ కెరీర్‌‌‌‌లో టాప్ చిత్రాలు ఇవే..

సింగీతం శ్రీనివాస రావు సినీ కెరీర్‌‌‌‌లో టాప్ చిత్రాలు ఇవే..

Singeetham Top 10 Movies: సింగీతం.. భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని జానర్స్‌ను టచ్ చేసిన ఏకైక దర్శకుడు. తన తుది శ్వాస వరకు సినిమానే జీవితంగా బతికిన సినీ మనిషి. తెలుగు సహా భారతీయ భాషలన్నింటిలోను సినిమాలను తెరకెక్కించినదిగ్దదర్శకుడు. కాసేపటి క్రితమే వయసు రీత్యా అనారోగ్యంతో కన్నుమూసారు. ఇక ఈయన సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ చిత్రాల విషయానికొస్తే..

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 04, 2026, 12:05 AM IST|Updated: Oct 04, 2026, 12:08 AM IST
joinshare
సింగీతం శ్రీనివాస రావు సినీ కెరీర్‌‌‌‌లో టాప్  చిత్రాలు ఇవే..
Image Credit: singeetham top movies list (File Pics/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
సింగీతం శ్రీనివాస రావు సినీ కెరీర్‌‌‌‌లో టాప్  చిత్రాలు ఇవే..

సింగీతం శ్రీనివాస రావు సినీ కెరీర్‌‌‌‌లో టాప్ చిత్రాలు ఇవే..

2

‘సింగీతం’ సినీ ప్రస్థానంలో కీలక మలుపులు ఇవే..

3

చిత్ర సీమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు ‘సింగీతం శ్రీనివాసరావు’ కన్నుమూత..

4

D-Mart Vendor: డీమార్ట్‌తో వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా? చిన్న వ్యాపారమైనా రూ.లక్షల్లో రాబడి!

5

Smit Machchhar 1 Crore: ఫ్లైదుబాయ్ విమానం కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు జాక్‌పాట్..ధైర్యసాహసాలకు మెచ్చి రూ.కోటి నజరానా!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

1.ఆదిత్య 369 - బ్లాక్ బస్టర్, సింగీతం శ్రీనివాస రావు  సినీ జైత్రయాత్రలో మరో మజీలీ ‘ఆదిత్య 369’. బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయలుగా.. కృష్ణకుమార్‌గా రెండు విభిన్న పాత్రల్లో టైంమిషన్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి కల్ట్ క్లాసిక్‌ స్టేటస్ అందుకుంది. ఈ సినిమాకు ఇళయారాజా అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్.

2.భైరవ ద్వీపం - బ్లాక్ బస్టర్ ..జానపదాలకు ఆదరణ లేని సమయంలో జానపద కథాంశంతో ‘భైరవద్వీపం’ సినిమా తీసి బంపర్ హిట్ కొట్టారు సింగీతం.  బాలయ్య తన సినీ కెరీర్‌లో చేసిన ఏకైక జానపద చిత్రం ఇది. ఎన్టీఆర్ నటించని ‘గులేబకావళి కథ’, జగదేకవీరుని కథ, పాతాళ భైరవి, రాజపుత్ర రహస్యం సినిమాలనే అటు ఇటుగా మార్చి ఈ సినిమాను తెరకెక్కించారు.  ఈ సినిమాలో కాసేపు కురూపిగా కనిపించి అలరించారు. ఈ సినిమా మ్యూజికల్‌గా బ్లాక్ బస్టర్‌గా నిలిచిది.

3.సొమ్మొకడిది సోకొకడిది..బ్లాక్ బస్టర్ .. కమల్ హాసన్ కవల సోదరులుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌దగ్గ మంచి విజయం సాధించింది.  

4. బృందావనం..బ్లాక్ బస్టర్.. రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది.  

5.పంతులమ్మ - సూపర్ హిట్..  రంగనాథ్ హీరోగా లక్ష్మి టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘పంతులమ్మ’. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.    

6.మయూరి - బ్లాక్ బస్టర్.. ప్రముఖ నర్తకి సుధాచంద్రన్ జీవితంపై ఆమె కథానాయికగా నటించిన ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. అంతేకాదు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

7. విచిత్ర సోదరులు -  బ్లాక్ బస్టర్  .. కమల్ హాసన్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది.    

8. పుష్ఫక విమానం - బ్లాక్ బస్టర్ .. టాకీలు రాజ్యమేలుతున్న కాలంలో పూర్తిగా మూకీగా తెరకెక్కించిన ఈ సినిమా యూనివర్సల్ విజయం సాధించింది.  

9.మైఖేల్ మదన కామరాజు - సూపర్ హిట్ .. కమల్ హాసన్ నాలుగు ప్రధాన పాత్రలో టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది.  

10.అమెరికా అమ్మాయి - సింగీతం సినీ కెరీర్‌లో తొలి హిట్ ఈ సినిమాతోనే అందుకున్నాడు. ఈ సినిమా విజయంతో సింగీతం దర్శకుడిగా వెనుదిరిగి చూసుకోలేదు.  

11. అమెరికా అబ్బాయి.. అమెరికా అమ్మాయి తర్వాత చాలా యేళ్లకు డాక్టర్ రాజశేఖర్ హీరోగా రాధిక, చరణ్  మరో ముఖ్యపాత్రలో ఓ బాలుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మ్యూజికల్‌గా మంచి విజయాన్నే నమోదు చేసింది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie
Trending News