Love And War Vicky Kaushal Look: రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ఫస్ట్ టైమ్ కలిసి యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. అంటే ప్రేమ గురించి యుద్ధం అన్న మాట. భారతీయ సినీ పరిశ్రమలో ఈ చిత్రాన్ని సెపరేట్ ప్రేమ కథా చిత్రంగా రాబోతుంది. సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పోస్టర్‌లో విక్కీ కౌశల్ సిగరెట్, లైటర్‌తో కనిపిస్తూ ఎంతో ఇంటెన్స్‌గా చూస్తున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు చూడని విభిన్నమైన లుక్‌లో విక్కీ కనిపించడం విశేషమనే చెప్పాలి. ఆయన లుక్‌లో స్టైల్, చార్మ్‌తో పాటు పాత్రలోని తీవ్రత కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
భన్సాలీ సినిమాల్లో కథానాయకల పాత్రలకు ప్రత్యేకత ఉంటుంది. సరికొత్త స్టైల్‌ను అందిస్తుంటారు. అదే తరహాలో విక్కీ కౌశల్ లుక్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకిత్తించింది. రణ్‌బీర్, అలియా తర్వాత ఇప్పుడు విక్కీ ఫస్ట్ లుక్ కూడా ‘లవ్ అండ్ వార్’ పై అంచనాలను మరింత పెంచాయి. ముగ్గురు నటుల ఫస్ట్ లుక్ పోస్టర్లు మూడు విభిన్నమైన పాత్రలను, మూడు ప్రత్యేకమైన ప్రపంచాలను పరిచయం చేస్తున్నట్టున్నాయి. విక్కీ పోస్టర్ మాత్రం సినిమాకు మరింత ఇంటెన్స్ టచ్‌ను తీసుకొచ్చింది.
సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ లీడ్ పాత్రల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కాబోతుంది.