SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Sitara Ghattamaneni: సితార మాటల్లో పక్కా తెలంగాణ స్లాంగ్.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు కొత్త ట్రీట్!

Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన డ్యాన్స్ వీడియోలు, ఫ్యామిలీ ఫొటోలు, వెకేషన్ మూమెంట్స్‌తో సితార ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ ప్రమోషనల్ వీడియో మాత్రం మరో కారణంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో సితార మాట్లాడిన తెలంగాణ యాస నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Written By Vishnu Priya
Published: Oct 02, 2026, 10:37 PM IST | Updated: Oct 02, 2026, 10:42 PM IST
Join

Sitara Ghattamaneni: ఫహాద్ ఫాజిల్ నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సితార ఓ వీడియోలో కనిపించింది. ఈ వీడియోలో సారా పాలేకర్‌తో కలిసి ఆమె సందడి చేసింది. సారా కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ చేస్తుండగా, సితార వాటిని చూస్తూ ఇచ్చిన రియాక్షన్స్ చాలా సహజంగా ఉన్నాయి.
సాధారణంగా సితార సోషల్ మీడియా వీడియోల్లో ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడటం మనం చూస్తుంటాం. తెలుగు మాట్లాడినా చాలా సందర్భాల్లో సాధారణ తెలుగు లేదా ఇంగ్లీష్ కలిపి మాట్లాడుతుంది. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం, అంతర్జాతీయ వాతావరణంలో పెరగడం దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

కానీ ఈసారి మాత్రం సితార పూర్తిగా భిన్నమైన స్టైల్‌లో కనిపించింది. హైదరాబాద్‌లో సాధారణంగా వినిపించే తెలంగాణ యాసలో ఆమె చాలా క్యాజువల్‌గా మాట్లాడింది. “ఆగు.. ఇటు రా”, “ఇట్లనా”, “అట్లనా” వంటి మాటలను ఆమె చెప్పిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. దీంతో సితార మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సారా పాలేకర్‌తో సరదాగా మాట్లాడుతున్న సమయంలో సితార ఇచ్చిన సమాధానాలు కూడా నవ్వు తెప్పిస్తున్నాయి. తర్వాత ఎక్కడికి ట్రిప్‌కు వెళ్దామని అడిగితే.. ముందు మూన్‌కు, ఆ తర్వాత మార్స్‌కు వెళ్దామని ఆమె చెప్పింది. ఆమె చెప్పిన విధానం చూసి అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు.


మహేష్ బాబు, ఆయన కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌తో బలమైన అనుబంధం ఉంది. మహేష్ బాబు తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన సితార తెలంగాణ యాసలో ఇంత సహజంగా మాట్లాడటం కొందరికి కొత్తగా అనిపిస్తోంది.

అయితే చాలామంది మాత్రం సితార స్థానిక యాసను ఇంత చక్కగా ఉపయోగించడాన్ని ఆనందంగా చూస్తున్నారు. భాష, యాస ఏ ప్రాంతానికి చెందినదైనా దాన్ని సహజంగా మాట్లాడటం మంచి విషయమే అని అభిమానులు అంటున్నారు.

సితార భవిష్యత్తులో సినిమాల్లోకి వస్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఈ వీడియో మాత్రం ఆమెకు మరో కొత్త ఇమేజ్‌ను తీసుకొచ్చిందనే చెప్పాలి.


Also Read: టాలీవుడ్‌లో ట్రేడ్ సర్కిల్స్‌లో రామాయణ, జైలర్ 2 సినిమాల బిజినెస్ డీల్స్..

Also Read: అనిరుథ్‌ను భయపెడుతున్న సాయి అభ్యంకర్..
 

 

Add Zee News as a Preferred Source

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES