• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /టాలీవుడ్‌కు మమిత దూరం.. అసలు కారణం అదేనా..!!

టాలీవుడ్‌కు మమిత దూరం.. అసలు కారణం అదేనా..!!

Mamitha Baiju మమితా బైజు పేరు ఇప్పుడు తెలుగు ఆడియన్స్‌కు కొత్త పరిచయాలు అక్కర్లేదు. ముఖ్యంగా ‘ప్రేమలు’ మలయాళ డబ్బింగ్ మూవీతో ఈ కేరళ కుట్టీ తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది. తన సహజసిద్దమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌కు దగ్గరైంది. తాజాగా ఈమె తెలుగు సినిమాల విషయంలో ఓ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Sep 26, 2026, 11:42 AM IST|Updated: Sep 26, 2026, 11:45 AM IST
joinshare
టాలీవుడ్‌కు మమిత దూరం.. అసలు కారణం అదేనా..!!
Image Credit: Mamitha Baiju(ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mamitha Baiju:  మమితాకు ఈ యేడాది బాగానే కలిసొచ్చింది.  ‘జననాయగన్’ పెంపుడు కూతురు పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఈమె నటనకు నెగిటివ్ మార్కులు పడ్డాయి. శ్రీలీల రేంజ్‌లో నటించలేదనే కామెంట్స్ వినపడ్డాయి. కానీ ఆ తర్వాత సూర్య హీరోగా నటించిన ‘విశ్వనాథం అండ్ సన్స్’తో మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇక మలయాళంలో ‘బెత్లెహం కుటుంబ యూనిట్’ సినిమాతో మలయాళంలో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ‘లోక’ మూవీ సాధించిన రికార్డును ఈ చిత్రం బ్రేక్ చేసింది.ముఖ్యంగా ఈ సినిమాల్లో మమిత చేసిన పాత్రలు, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి చర్చకు వచ్చాయి. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో హీరోతో ఉన్న వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఆ పాత్రలో మమిత చాలా సహజసిద్ధంగా ఒదిగిపోయింది. అలాగే ‘బెత్లహాం కుటుంబ యూనిట్’లో కూడా వయసు తేడా ఉన్న పాత్రల మధ్య రిలేషన్‌షిప్ కథలో ఆమె పాత్ర ఆసక్తి రేకెత్తించింది.  డిఫరెంట్ కాన్సెప్ట్స్ రాసే దర్శకులకు మమిత బెస్ట ఆప్షన్‌గా మారింది.

రాజమౌళి వంటి ప్రముఖుల ప్రశంసలు.. 
ఇక మమితా బైజు నటనను మెచ్చుకుంటూ రాజమౌళి వంటి ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు రావడంతో ఇక టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తాయని చాలామంది భావించారు. కానీ ఇప్పటివరకు పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగానే కనిపిస్తోంది. ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకుంటున్న మమిత బైజు చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.  ఆమె టార్గెట్ మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపే ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇంత క్రేజ్ ఉన్నా ఆమె చేతిలో ఇప్పటివరకు ఒక్క తెలుగు స్ట్రెయిట్ మూవీ కూడా లేకపోవడం.

టాలీవుడ్‌లో మేకర్స్ ఆమె విషయంలో ఒక విషయంపై ఆలోచిస్తున్నారనే టాక్ ఉంది. అదే స్టార్ హీరోల పక్కన మమిత ఎంతవరకు సెట్ అవుతుందనే ప్రశ్న. మలయాళ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మమితను, భారీ కమర్షియల్ తెలుగు సినిమాలో హీరోయిన్‌గా ప్రెజెంట్ చేస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆలోచన కొంతమంది మేకర్స్‌లో భయం నెలకొంది.

మమితా ప్లస్ పాయింట్స్ ..
మమిత ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఆమెను కేవలం గ్లామర్ హీరోయిన్‌గా కాకుండా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా చాలా ఈజీగా చూపించవచ్చు.  లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాస్, యూత్ ఓరియెంటెడ్ సినిమాలు, అలాగే హీరో క్యారెక్టర్‌కు సమానమైన ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో ఆమెకు మంచి స్కోప్ ఉంటుంది. అందుకే సరైన కథ, సరైన క్యారెక్టర్ దొరికితే టాలీవుడ్‌లో కూడా మమిత బైజు తన మార్క్ చూపించగలదనే అంచనాలు ఉన్నాయి. ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా మమిత ఇప్పుడు తన మార్కెట్‌ను బట్టి ముందుకు వెళ్లాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

మమిత పారితోషికం.. 
మలయాళంలో ఆమెకు వచ్చే పారితోషికం సాధారణంగా కోటి లోపే ఉంటుందని, కానీ తెలుగులో మంచి బ్యానర్, మంచి హీరో, మంచి ప్రాజెక్ట్‌తో అవకాశం వస్తే రెండు కోట్లకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. రెమ్యునరేషన్ పెంచాలంటే ముందుగా ఆఫర్ రావాలి కదా.  ప్రస్తుతం మమిత పరిస్థితి కూడా ఇలాగే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇతర భాషల్లో అవకాశాలు వస్తున్నాయి, సినిమాలు హిట్ అవుతున్నాయి, తన మార్కెట్ కూడా పెరుగుతోంది. కానీ మరోవైపు తెలుగులో మాత్రం ఇప్పటివరకు సరైన ప్రాజెక్ట్ ఆమె ఖాతాలో పడలేదు. ‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తర్వాత కూడా ఒక తెలుగు దర్శకుడు లేదా నిర్మాత ఆమెను మెయిన్ హీరోయిన్‌గా తీసుకోకపోవడం విచిత్రం.

టాలీవుడ్‌లో ఆపర్ కోసం ఎదురు చూస్తున్న మమిత.. 
అయితే సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం. ఒకే ఒక్క సినిమా, ఒకే ఒక్క కాంబినేషన్ మమిత కెరీర్‌ను టాలీవుడ్‌లో పూర్తిగా మార్చడం ఖాయం అని చెప్పొచ్చు. స్టార్ హీరోతో ఒక మంచి సినిమా పడితే ఆమెకు ఇక్కడ కూడా భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇతర భాషల్లో తన నటనతో ప్రూవ్ చేసుకున్న మమితకు ఇప్పుడు కావాల్సింది ఒక్కటే.. తన టాలెంట్‌కు సరిపోయే సరైన తెలుగు స్టోరీ.  అందుకు తగ్గ ఫర్పెక్ట్ రోల్. అది ఎప్పుడు వస్తుందో చూడాలి. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయమైన ఈ హీరోయిన్‌కు ఇంతవరకు ఒక్క స్ట్రెయిట్ తెలుగు సినిమా కూడా లేకపోవడం మాత్రం నిజంగానే ఆసక్తికరమైన విషయంగా మారింది. మరి మమిత బైజు టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? ఏ హీరో పక్కన ఆమెను చూడబోతున్నాం? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News