SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Mamitha Baiju: మమితా మైథాలజీ ఎంట్రీ.. ఆ సీక్వెల్ మూవీతో తెలుగు డెబ్యూ..!

Mamitha Baiju: మమితా బైజు కెరీర్‌లో మరో ఆసక్తికరమైన అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఆమె కొత్త ప్రాజెక్ట్‌లో కనిపించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

Written By Vishnu Priya
Published: Oct 08, 2026, 01:06 PM IST | Updated: Oct 08, 2026, 01:11 PM IST
Join

Mamitha Baiju: మలయాళీ హీరోయిన్ మమితా బైజు ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. ముఖ్యంగా ‘ప్రేమలు’ సినిమాతో ఆమెకు వచ్చిన గుర్తింపు ఒక్కసారిగా పెరిగింది. ఆ తర్వాత తమిళంలో ‘డ్యూడ్’, తెలుగులో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకు దర్శకుడు వెంకీ అట్లూరి తెలుగువాడే అయినప్పటికీ, ఇది తమిళ సినిమా అని ఆయన స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. దీంతో మమితా బైజు పూర్తి స్థాయి తెలుగు హీరోయిన్‌గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అనే ఆసక్తి చాలాకాలంగా ఉంది.

ఇప్పుడు ఆమెకు అలాంటి అవకాశం భారీ ప్రాజెక్ట్ రూపంలో వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మమితా బైజు త్వరలో టాలీవుడ్‌లోకి అధికారికంగా అడుగుపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అది కూడా సాధారణ సినిమా కాకుండా భారీ అంచనాలు ఉన్న మైథాలజీ ఫాంటసీ మూవీ కావడం విశేషం.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా ‘జై హనుమాన్’ తెరకెక్కుతోంది.

‘జై హనుమాన్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు మమితా బైజు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మమితా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె పాత్ర ఏంటి? సినిమాలో ఎంతసేపు కనిపిస్తుంది? అనే విషయాలపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. మేకర్స్ కూడా ఇప్పటివరకు మమితా ఎంపికపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఒకవేళ ఈ వార్త నిజమైతే మమితా బైజు కెరీర్‌కు ఇది చాలా పెద్ద అవకాశం అవుతుంది. ఇప్పటివరకు లవ్ స్టోరీస్, యూత్‌ఫుల్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్‌ను మైథాలజీ ఫాంటసీ ప్రపంచంలో చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వొచ్చు. ఈ సినిమా తర్వాత మమితాకు తెలుగులో మరిన్ని భారీ అవకాశాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది.

Read More: Bigg Boss Telugu Wild Card Entry: ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్..హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..లిస్ట్ వచ్చేసింది!

 

Read More: బిగ్‌బాస్‌కు బిగ్ షాక్ .. నాగార్జునకు పోటీగా తేజ సజ్జ..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES