Maya Lady Movie Review: ‘మాయ లేడి’ మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా..!!
Maya Lady Movie Review: రాకేష్ వర్రే హీరోగా విలన్‌గా నటిస్తూనే హీరోగా లక్ పరీక్షించకుంటున్నాడు. గతంలో జితేందర్ రెడ్డి అనే బయోపిక్ మూవీలో సీరియస్ యాక్షన్ చేసిన ఈయన తాజాగా ఈయన నిర్మాతగా ప్రిశంకర్ దర్శకత్వంలో చేసిన చిత్రం ‘మాయలేడి’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..
Maya Lady Public Talk Review: ‘మాయ లేడి’ ఈ టైటిల్‌తోనే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
క్రిష్ (రాకేష్ వర్రె) అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్పించే ట్రైయినర్. ఈ క్రమంలో అతను ఆశా (మధుమిత సర్కార్) అనే అమ్మాయి ఇతరులకు హెల్ప్ చేసే విధానాన్ని ఇంప్రెస్ అయి ఆమె ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో క్రిష్.. ఆశాకు దగ్గరవుతాడు. ఈ క్రమంలో ఆశా అతనికి దగ్గరవుతుంది. ఈ క్రమంలో అతనికో నిజం తెలుస్తుంది. ఆశా పేరుతో తన దగ్గరైంది ఆశా కాదు.. ఆమె ట్విన్ సిస్టర్ రూప అని తెలిసి ఆశ్యర్యపోతాడు. ఆశా కామ్ గోయింగ్ పర్సన్ అయితే.. రూప రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్. ఈ క్రమంలో క్రిష్ తాను ప్రేమించిన ఆశకు దగ్గరవుతాడా..? తనను ప్రేమించే రూపను పెళ్లి చేసుకున్నాడా..? ఈ క్రమంలో ఏం జరిగింది. చివరకు ఈ ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ‘మాయలేడి’ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఒకే రూపంలో ఉన్న ఇద్దరు ట్విన్స్ అని ట్విస్ట్ ఇచ్చినా.. ఇది ‘అపరిచితుడు’ సినిమాకు లేడీ వెర్షన్ అని చెప్పాలి. ఒక మన మేకర్స్ ఒక సినిమాను ఇన్‌స్ప్రేషన్‌గా తీసుకొని వేరే సినిమాలు తెరకెక్కించడం మనకు కొత్త కాదు.. దర్శకుడు శంకర్ ఈ కథను ..అపరిచితుడు, చంద్రముఖి సినిమాలను ఇన్‌స్ప్రేషన్‌గా సరికొత్త ప్రేమకథను అల్లుకున్నాడు. అందులో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. అందులో దాదాపు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మధ్యలో కొన్ని లాజిక్ లేని సీన్స్ ఉన్నా.. కథానాయికలో ఈ మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ రావడానికి గత కారణాలను చూపించాడు. అపరిమితుడులో మాదిరి చిన్నపుడు జరిగిన ఓ యాక్సిడెంట్‌లో తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమెలోని మరో మనిసి రూప మాదిరి బయటకు వచ్చి తనను ఆడిపోసుకున్న వారిపై ఎదురు తిరిగే క్యారెక్టర్. సినిమాలో ట్విస్టులో ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది. మధ్యలో రెండు ఫైట్స్ మాస్ ఆడియన్స్‌ను అలరించేలా ఉన్నాయి.
ఫస్ట్ హాఫ్ అంతా సరద సరదాగా సాగిపోతుంది. రూప, ఆశా ఒకరనే విషయం హీరోకు తెలయడంతో ఇంటర్వెల్ ట్విస్ట్ ఇచ్చారు. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ రొటీన్ అనిపించినా.. అందులో పండించిన భావోద్వేగాలు బాగున్నాయి. ఇలాంటి కథ ప్రేక్షకులకు తెలిసినా.. దర్శకుడు సీట్ ఎడ్జ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను దాదాపు మాయ చేశాడు. అంతేకాదు మాయలేడీ అనే టైటిల్‌కు న్యాయం చేశాడు. సత్య కామెడీ ఫస్ట్ హాఫ్ వర్కౌట్ అయినా.. సెకండాఫ్ తేలిపోయింది. సెకండాఫ్ స్లో నేరేషన్‌గా సాగడం ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టుంటే బాగుండేది. ఓవరాల్‌గా ఈ వీకెండ్ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చు.
నటీనటుల విషయానికొస్తే..
బాహుబలి సినిమాలో తళుక్కున మెరిసన రాకేష్ వర్రె.. ఆ తర్వాత జితేందర్ రెడ్డి సినిమాలో సీరియస్ క్యారెక్టర్‌లో మెప్పించిన రాకేష్.. ఈ సినిమాలో లవర్ బాయ్ క్యారెక్టర్‌లో మంచి ఈజ్ చూపించాడు. నటుడిగా మేకోవర్ చూపించాడు. భావోద్వేగాలు బాగా పండించాడు. క్లైమాక్స్‌లో నటన బాగుంది. మధుమిత సర్కార్.. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న లేడీ పాత్రలో ఒదిగిపోయింది. తన పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్ విషయంలో ఆకట్టుకుంది. సత్య మరోసారి తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు. సురేశ్ తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్ కేర్ టేకర్‌గా డాక్టర్ పాత్రలో ఇంద్రజ తన యాక్టింగ్‌తో మెప్పించింది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. ‘మాయ లేడి’.. ప్రేక్షకులను మెప్పించే అపరిచితురాలు..
రేటింగ్: 3/5