డిఫరెంట్ థ్రిల్లర్ గా ‘మయూఖ’.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం పక్కా డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్.కే..
Mayookha Director Sri Tej SK: పాయల్ చెంగప్ప లీడ్ రోల్లో యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘మయూఖ’. శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ నుంచి మిగతా కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
Mayookha Director About movie: సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీకాంత్ కాండ్రేగుల.. శ్రీతేజ్ ఎస్.కె. గా స్క్రీన్ నేమ్ మార్చుకుని ఈ చిత్రానికి డైరెక్ట్ చేయడం విశేషం. "మయూఖ" సినిమా ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని హైలైట్స్ ను వివరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘మయూఖ’ సినిమాకు ఇటీవల న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ మిస్టరీ మూవీగా అవార్డ్ వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. థ్రిల్లర్ కేటగిరిలో సెకండ్ బెస్ట్ వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ అవార్డ్ వస్తుందని మేము ఊహించలేదు. మా మూవీ అవార్డ్ కు సెలెక్ట్ అయ్యిందని తెలిసి టీమ్ అంతా సంతోషించాము. అంతేకాదు త్వరలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు కూడా మా మూవీని స్క్రీనింగ్ కోసం అప్లై చేశాం. మీరు మా మూవీ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే కొరియన్, హాలీవుడ్ మూవీ తరహా స్టోరీ టెల్లింగ్, కలర్ గ్రేడింగ్ కనిపిస్తుంటుందని చెప్పుకొచ్చారు. స్టోరి కొద్ది కొద్దిగా రివీల్ అవుతూ సెకండాఫ్ వచ్చేసరికి పీక్స్ కు వెళుతుందన్నారు. రీసెంట్‌గా మన ప్రేక్షకులు ఓటీటీల్లో థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు, సినిమాలు బాగా చూస్తూ వస్తున్నారు. సో వాళ్లకు నచ్చేలా మన కంటెంట్ ఉండాలంటే కొత్తగా, క్వాలిటీగా ప్రయత్నించాలి. మయూఖ చిత్రానికి మేము అలాంటి ప్రయత్నమే చేశాము. ఇప్పటికే ఈ సినిమా ఇంట గెలవకుండానే రచ్చ గెలిచింది. మన ప్రేక్షకుల దేవుళ్లు ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.
ఈ స్టోరీని మొదట నటి మహేశ్వరి (గులాబీ ఫేమ్) కి చెప్పాం. ఆమె మేము చెప్పిన రెండు కథలు విన్నారు. ఈ స్టోరీతో పాటు మరొక కథ ఆమెకు బాగా నచ్చింది. ఆ కథకు ఆమె లాక్ అయిపోయారు. పాయల్ కన్నడలో మంచి ఎంటర్ టైనింగ్ మూవీస్ చేశారు. ఆమె మా కథలోని క్యారెక్టర్ కు బాగా సరిపోతారని అనిపించింది. ఆమె చేసిన వెబ్ సిరీస్ లతో ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ కు రీచ్ అయ్యారు. ఈ కథలో ఆమె పాత్రను మన ఆడియెన్స్ బాగా రిలేట్ చేసుకుంటారని చెప్పుకొచ్చారు. ఆమె క్యారెక్టర్ పడే స్ట్రగుల్స్ కు రెస్పాండ్ అవుతారని నమ్మాం. మయూఖగా పాయల్ చెంగప్ప అద్భుతంగా నటించారు. ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కుతుంది.
థ్రిల్లర్ మూవీస్‌లో ప్రత్యేకం..
ఇలాంటి తరహా థ్రిల్లర్స్ గతంలో వచ్చినా మా మూవీలో స్క్రీన్ ప్లే, సినిమా స్టోరీని ప్రెజెంట్ చేసే విధానం కొత్తగా ఉంటుందనే కాన్ఫిడెన్స్‌గా చెప్పారు. ప్రెజెంటేషన్ కొత్తగా ఉంది కాబట్టే న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ థ్రిల్లర్ గా అవార్డ్ దక్కిందని చెప్పుకొచ్చారు. ఇక్కడే మా ప్రయత్నం సక్సెస్ అయ్యిందనే నమ్మకం మొదలైంది. ఎక్కడో స్మశానంలో దెయ్యాలు ఉన్నాయంటే ముందే మనసు ప్రిపేర్ అవుతుము. కానీ మనం నివసించే చోట, రోజు ఉండే చోట ఎవరో అపరిచిత వ్యక్తి ఉన్నారంటే ఇంకా ఎక్కువ భయపడతాం. మయూఖ హారర్ సినిమా కాదు థ్రిల్లర్ మూవీ. హీరోయిన్ ఉండే ఫ్లాట్ లోకి ఒక అపరిచిత వ్యక్తి ఎందుకు వచ్చాడు, అతను ఏం చేశాడు. హీరోయిన్ క్యారెక్టర్ తో అతనికి సంబంధం ఏంటి ..ఇలాంటి అంశాలతో కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంటుంది. మా సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు ఉంటుంది.
మయూఖ అంటే ఆశాకిరణం. మా సినిమా చూస్తూ చివరకు వచ్చేసరికి మీకు మా మూవీ టైటిల్ కు తగ్గట్టు ఉందని హ్యాపీగా పీలవుతారు. నేను రూపొందించిన చివరి షార్ట్ ఫిలిం పేరు మయూఖ. ఆ షార్ట్ ఫిలిం కంప్లీట్ చేయకుండానే యూఎస్ వెళ్లాను. అప్పుడు రాజమౌళి ఒక పాపను దత్తత తీసుకుని ఆమెకు మయూఖ అనే పేరు పెట్టారు. నా ప్రొఫెషనల్ కెరీర్ లో కొనసాగుతున్న టైమ్ లో ప్రొడ్యూసర్ కు ఈ మయూఖ కథ చెబితే బాగుంది చేద్దామని అన్నారు. మనం ఎంత మంచి కథ రాసినా దాన్ని విజువల్ గా, ఆడియో పరంగా అందంగా తెరకెక్కించాలి అప్పుడే సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకు విజువల్, సౌండ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. క్వాలిటీలో ఎక్కడా రాజీ పడలేదు. శిబి మాత్యూ అలెక్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.
మన ప్రేక్షకులు కొరియన్, హాలీవుడ్ థ్రిల్లర్స్ చూసి మన వాళ్లు ఇలా ఎందుకు తీయరు అనుకుంటూ ఉంటారు. మనం అలాంటి ప్రాడక్ట్ ఇస్తే తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాము. మా సినిమాలో ఎమోషన్ కంటే ఎక్కువగా ఎక్సిపీరియన్స్ ప్రేక్షకులు ఇవ్వబోతున్నట్టు చెప్పుకొచ్చారు. సినిమా మేకింగ్ లో మా ప్రొడ్యూసర్ శశిధర్ నల్ల నుంచి కంప్లీట్ సపోర్ట్ లభించిన విషయాన్ని ప్రస్తావించారు.
నేను దాదాపు ఇరవై ఏళ్ల క్రితం షార్ట్ ఫిలింస్ తీసాను. ఆ తర్వాత యూఎస్ వెళ్లాను అక్కడ న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో డైరెక్షన్ కోర్స్ చేశాను. దర్శకత్వం చేయాలనేది నా డ్రీమ్. అయితే సినిమా మేకింగ్ లో అనుభవం కోసం ప్రొడక్షన్ విషయాలపై కూడా అవగాహన పెంచుకున్నాను. తంత్రం, సూత్రవాక్యం అనే సినిమాలను తెలుగులో రిలీజ్ చేశాము. మా సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇప్పటిదాకా రెండు చిత్రాలు చేశాం. మరికొన్ని ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇవన్నీ కొత్త టీమ్ తో చేసినవే. మంచి కథలు ఉంటే తప్పకుండా న్యూ టాలెంట్ కు సపోర్ట్ చేస్తామని చెప్పారు ఒక సినిమా హిట్ అయితే అదే జానర్ లో మూవీస్ వస్తుంటాయి. మనం ఆ జానర్ లో మూవీ చేసేలోపు ట్రెండ్ మారిపోతుంది. నేను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయొచ్చు. కానీ కొత్తగా ప్రయత్నిద్దామని మయూఖ రూపొందించిన విషయాన్ని ప్రస్తావింాచారు. ఉపేంద్ర, రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, జొనాథన్ నోలన్ వంటి దర్శకులను ఇష్టపడతాను. నెక్ట్స్ నా దర్శకత్వంలో ఒక ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. అది క్లీన్ యు సర్టిఫికెట్ సినిమా అవుతుంది