కొత్త నిర్మాతలకు అండగా మెగాబ్రదర్.. ‘మైలురాయి’ టైటిల్ లాంచ్ చేసిన నాగబాబు..
Mailu Rayi Title Lauch: మెగా బ్రదర్ ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు కొత్త సినిమాలకు అండగా నిలుస్తున్నారు. తాజాగా కొత్త నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా ‘మైలు రాయి’ చిత్రానికి అండగా నిలవడంతో పాటు ఆ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను లాంచ్ చేశారు.
Nagababu Launch Mailu Rayi Title Logo: హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి ‘మైలు రాయి’ అనే చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తోంది. తవిటిరాజు తలచింతల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ రఘువర్ధన్ కోట్ల డైరెక్ట్ చేశారు. యువ నటీనటులు జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు దేవీ ప్రసాద్ కీ రోల్ పోషిస్తున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.
నాగబాబు చేతుల మీదుగా టైటిల్ లాంఛ్..
తాజాగా ఈ చిత్ర టైటిల్ లాంచ్ పోస్టర్‌ను సీనియర్ నటుడు కమ్ నిర్మాత, ఏపీ ఎమ్మెల్సీ ,ఆంధ్ర ప్రదేశ్ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు విడుదల చేయడం విశేషం. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా టైటిల్ ‘మైలురాయి’ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నిర్మాత హన్సిక మంచి సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఔత్సాహిక దర్శకుడు, యువ హీరోతో ఈ చిత్రాన్ని రూపొందించడం గొప్ప విషయం. ఫిల్మ్ మేకింగ్‌లో మహిళలకు ఉండే బాధ్యత, క్రమశిక్షణ ఎంతో గొప్పవి. ఇప్పటికే అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్, నా కుమార్తె నిహారిక, సుప్రియ యార్లగడ్డ వంటి వారు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు.
నాగబాబు అండ దండా..
హన్సిక కూడా వారి బాటలోనే పయనిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. . ఈ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ బెస్ట్ విషెస్ తెలియజేశారు. నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా రూపొందుతున్న ‘మైలురాయి’ టైటిల్ లాంచ్ పోస్టర్‌ను నాగబాబు విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్, పాటలను త్వరలో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు.
సహ నిర్మాత తవిటిరాజు తలచింతల మాట్లాడుతూ.. ‘మైలురాయి’ చిత్రాన్ని లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన నాగబాబుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
హీరో జగన్ యోగిరాజు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో కథానాయకుడిగా నటించడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయింది. నాగబాబు విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే టీజర్, పాటలు, ట్రైలర్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు.
దర్శకుడు రఘువర్ధన్ కోట్ల మాట్లాడుతూ.. ‘‘హన్సి ప్రొడక్షన్స్ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండటం చాలా హ్యాపీగా ఉంది. ‘మైలురాయి’ భావోద్వేగాలతో కూడిన లవ్ స్టోరీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.