Kaaka Release Date: మెగా ఫ్యాన్స్ మరోసారి సంక్రాంతి ట్రీట్ ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘కాకా’పై తాజాగా వచ్చిన అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా పనులు మరో కీలక దశలోకి అడుగుపెట్టాయి. తాజాగా ‘కాకా’ డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
చిరంజీవి, బాబీ కాంబినేషన్ అంటేనే మెగా అభిమానుల్లో ప్రత్యేకమైన బజ్ ఉంటుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. పైగా చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్‌లో సంక్రాంతి సీజన్ మాత్రమే కలిసొచ్చింది. ఈ సీజన్‌లో విడుదలైన ‘ఖైదీ నంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’, తాజాగా ‘మన శంకర వర ప్రసాద్’ చిత్రాలు పొంగల్ బరిలో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. మిగిలిన సినిమాలేని పెద్దగా ఆడలేదు. అందుకే తనకు సెకండ్ ఇన్నింగ్స్‌లో కలిసొచ్చిన సంక్రాంతి సీజన్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒదులుకోవడం లేదు చిరంజీవి.
ఇక ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమా పై అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అనస్వర రాజేష్ ఈ సినిమాలో చిరంజీవి కూతురు పాత్రలో నటిస్తోంది. స్నేహ ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కోల్‌కత్తా బ్యాక్ డ్రాప్‌లో నటుస్తుందట. ఇందులో చిరు మరోసారి డాన్ పాత్రలో కనువిందు చేయనున్నట్టు వార్తలు వస్తున్ాయి.
శరవేగంగా ‘కాకా’ షూటింగ్..
ప్రస్తుతం ‘కాకా’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్‌కు సంబంధించిన కార్యక్రమాలను కూడా చిత్రబృందం వేగంగా ముందుకు తీసుకెళుతుంది. అందులో భాగంగానే తాజాగా డబ్బింగ్ పనులను ప్రారంభించారు. అంటే సినిమా నిర్మాణం ఇప్పుడు మరింత కీలకమైన దశకు చేరుకుంది. హీరోతో పాటు మిగిలిన ప్రధాన నటీనటుల డైలాగ్స్, సన్నివేశాలకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తిచేసే దిశగా టీమ్ అడుగులు వేస్తోంది.
డబ్బింగ్‌తో పాటు ప్రమోషన్స్..
డబ్బింగ్ ప్రారంభించిన విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా మరోవైపు ప్రమోషన్స్ జోరు పెంచారు. అంతేకాదు ‘కాకా’ను జనవరి 13, 2027న సంక్రాంతి కానుకగా ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇక్కడే ఇప్పుడు మెగా అభిమానులకు మరో కీలక క్లారిటీ వచ్చినట్టైంది. ఎందుకంటే గత కొంతకాలంగా ‘కాకా’ విడుదల విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి నటించిన మరో భారీ చిత్రం ‘విశ్వంభర’తో రిలీజ్ ప్లాన్‌లపై కూడా చర్చ జరిగింది.
డిసెంబర్‌లో ‘విశ్వంభర’..
ఒక దశలో ‘కాకా’ విడుదలను మార్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు చిత్రబృందం స్వయంగా సంక్రాంతి రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించడంతో.. ప్రస్తుతానికి ‘కాకా’ టీమ్ తన ప్లాన్‌లో ఎలాంటి మార్పు చేయడం లేదనే సంకేతం ఇచ్చింది.
మరోవైపు విశ్వంభరను డిసెంబర్ మొదటి వారంలో ‘ఫౌజీ’ రిలీజ్ డేట్‌లో రావాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే జనవరి 13న ‘కాకా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే నిర్ణయం ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.ఇక సినిమా కంటెంట్ విషయానికి వస్తే.. ‘కాకా’ను యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న నేపథ్యంలో చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, బాబీ మార్క్ మాస్ ట్రీట్‌మెంట్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి.