SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రొటిన్ వద్దు.. సీనియర్స్ నుంచి జూనియర్స్ దాకా సమ్‌థింగ్ స్పెషల్ కోరుకుంటున్న హీరోలు..

Mystirious Thrillers: ఒకప్పుడు రొటీన్ ఫైట్లు, డ్యూయెట్లతో సరిపెట్టుకున్న మన కథానాయకులు.. ఇప్పుడు రూట్ ఛేంజ్ చేశారు. అంతేకాదు సరికొత్గా సస్పెన్స్, అడ్వెంచర్‌తో కూడిన మిస్టికల్ వరల్డ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమాలు చేస్తున్నారు. పురాతన రహస్యాలు ఛేదించడానికి, కొత్త ప్రపంచాలను ఆవిష్కరించడానికి మన స్టార్స్ అంతా సరికొత్త థ్రిల్లర్ బాట పట్టారు. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అందరిదీ అదే రూట్లో వెళుతున్నారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 16, 2026, 03:38 PM IST | Updated: Oct 16, 2026, 03:40 PM IST
Image Credit: Mystic Thriller (X/Source)
Join

Tollywood New Trend: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు మిస్టరీ నేపథ్యంలో కాస్త థ్రిల్లింగ్ అంశాలతో కూడిన సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ‘విరూపాక్ష’తో సంచలనం సృష్టించిన కార్తీక్ దండు.. నాగ చైతన్యతో  ‘వృషకర్మ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా  పూర్తిగా మిస్టికల్ థ్రిల్లర్‌. ఈ కథలో దేవుడి చుట్టూ తిరిగే అంశాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక  ‘శంబాలా’లో దేవుడి చుట్టూ తిరిగే కథతో హిట్ కొట్టాడ ఆది సాయికుమార్. ఆ తరవ్ాత అలాంటి మిస్టిక్ థ్రిల్లరే చేయబోతున్నారు. నవరసన్ దీనికి దర్శకుడు.

క ఫేమ్ సుజీత్-సందీప్ దర్శక ద్వయంతో సాయిధరమ్ తేజ్ చేయబోయే సినిమా కూడా మైండ్ బ్లాక్ అయ్యే మిస్టికల్ థ్రిల్లర్ అనే తెలుస్తుంది. ఇందులో తేజు ఒక డీప్ మిస్టరీని ఛేదించే ఫాంటసీ రోల్‌లో కనిపించబోతున్నారు. చిరంజీవి హీరోగా నటించిన ‘విశ్వంభర’ సైతం సోషియో ఫాంటసీకి మైథాలజీ టచ్ యాడ్ చేసిన భారీ మిస్టికల్ అడ్వెంచరే. 14 లోకాల మిస్టరీ ఈ సినిమాలో ఉంది.

రామ్ చరణ్ నిర్మాణంలో నిఖిల్ హీరోగా వస్తున్న ది ఇండియా హౌజ్ కూడా ఇదే తరహా థ్రిల్లర్ జోనర్‌లోనే వస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా వస్తున్న ఈ హిస్టారికల్ థ్రిల్లర్‌లో.. నిఖిల్ చేయబోయే అన్వేషణ ఆడియన్స్‌కు పూనకాలు పుట్టించేలా ఉండబోతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. మొత్తంగా సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకు అందరు మిస్టిక్ థ్రిల్లర్ వైపు అడుగులు వేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES