• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని 5 ఆహారాలు ఇవే! పెడితే రుచి, పోషకాలు అన్నీ మాయం..!

ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని 5 ఆహారాలు ఇవే! పెడితే రుచి, పోషకాలు అన్నీ మాయం..!

మనం మార్కెట్ నుండి తెచ్చిన పండ్లు, కూరగాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటాము. అంతేకాకుండా, వండిన వంటకాలు మిగిలిపోతే వాటిని కూడా ఫ్రిజ్‌లో పెట్టడం మనకు అలవాటు. అయితే, ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని 5 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి ఆహారంగా కాకుండా విషంగా మారిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి పొరపాటున కూడా వాటిని అక్కడ పెట్టకండి. ఆ జాబితా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 16, 2026, 05:18 PM IST|Updated: Oct 16, 2026, 05:23 PM IST
joinshare
ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని 5 ఆహారాలు ఇవే! పెడితే రుచి, పోషకాలు అన్నీ మాయం..!
Image Credit: Never Keep in the Refrigerator

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Crazy Kalyanam Movie Review Telugu: నవ్వులు, కన్నీళ్లతో అనుపమ సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకుందా?

Crazy Kalyanam Movie Review Telugu: నవ్వులు, కన్నీళ్లతో అనుపమ సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకుందా?

2

ఉడకబెట్టిన గుడ్లను ఎంతసేపట్లో తినాలి? ఫ్రిజ్‌లో ఇలా నిల్వ చేస్తున్నారా? తీవ్రమైన రోగాల బారిన పడే ప్రమాదం!

3

Tirumala Rain: బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో అకస్మాత్తుగా భారీ వర్షం.. తడిసి ముద్దయిన లక్షలాది భక్తులు

4

మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారిపోతున్నాయా? ఈ ఒక్క చిట్కాతో మళ్లీ పచ్చగా కళకళలాడుతాయి!

5

16 ఏళ్ల శరణ్య ఖేరుకా అద్భుత ఘనత.. పారాలింపియన్ల జీవితాలపై రాసిన పుస్తకానికి ప్రశంసలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Never Keep in the Refrigerator: ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. త్వరగా పాడైపోయే ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో స్టోర్ చేయడం వల్ల వాటి నిల్వ కాలం పెరుగుతుందని మనం అనుకుంటాం. పాలు, పెరుగు, గుడ్లతో పాటు మనం వండిన ఆహారం, మార్కెట్ నుండి తెచ్చిన పండ్లు, కూరగాయలు, మసాలా దినుసులను కూడా ఫ్రిజ్‌లో పెడుతుంటాము. దీనివల్ల అవి త్వరగా పాడవకుండా ఉంటాయి. కానీ, ప్రతి వస్తువును నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. కొన్ని పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి తాజాగా ఉండటానికి బదులుగా విషపూరితంగా మారే అవకాశం ఉంది.

టమాటాలు:
టమాటాలను ఫ్రిజ్‌లో అస్సలు నిల్వ చేయకూడదు. భారతీయ వంటకాల్లో టమాటా లేని వంటకం ఉండదు, ఇది వంటకు మంచి రుచిని ఇస్తుంది. టమాటాలు త్వరగా పండిపోతుంటాయి, కానీ వాటిని ఫ్రిజ్‌లో పెడితే రుచి మారిపోతుంది. వీటిని గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ చేయడం మంచిది. నేరుగా సూర్యరశ్మి తగలకుండా, వంటగదిలో చీకటిగా ఉండే ప్రదేశంలో ఉంచితే సరిపోతుంది.

బంగాళదుంపలు:
బంగాళదుంపలను కూడా పొరపాటున ఫ్రిజ్‌లో పెట్టకూడదు. వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. బంగాళదుంపలకు మొలకలు వస్తాయని భయపడి చాలామంది వాటిని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. దీనివల్ల అందులోని చక్కెర శాతం పెరిగిపోతుంది. బంగాళదుంపలను కేవలం గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే స్టోర్ చేసుకోవాలి.

ఉల్లి గడ్డలు:
టమాటాలు, బంగాళదుంపల మాదిరిగానే ఉల్లి గడ్డలు కూడా ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. వీటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అలా చేస్తే అవి మెత్తబడిపోతాయి. ఉల్లిపాయలను పొడిగా ఉండే ప్రదేశంలో మాత్రమే నిల్వ చేయాలి. అలాగే, వీటిని బంగాళదుంపలకు దూరంగా ఉంచాలి, తద్వారా అవి త్వరగా పాడవకుండా ఉంటాయి. ఉల్లిపాయను కట్ చేసిన తర్వాత వెంటనే ఉపయోగించడం మంచిది. కాసేపటి తర్వాత వాడితే అవి విషపూరితంగా మారే అవకాశం ఉంది.

వెల్లుల్లి:
వెల్లుల్లికి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అయితే, ఉల్లిపాయల మాదిరిగానే వెల్లుల్లిని కూడా ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. దీనిని పొడిగా ఉన్న ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. వెల్లుల్లిని నేరుగా సూర్యరశ్మి తగిలే చోట పెడితే పాడైపోయే అవకాశం ఉంది.

Read Also: షుగర్ ఉన్నవారికి కొత్త ముప్పు! 'డబుల్ డయాబెటిస్' వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? అలర్ట్ లేకపోతే అంతే!
Read Also: సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!

తేనె:
తేనెను సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకుంటే సరిపోతుంది. దీనిని ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. తేనెలో తడి తగలకుండా చూసుకుంటే అది చాలా కాలం పాటు పాడవకుండా ఉంటుంది. తేనెలో పుష్కలంగా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఇది త్వరగా పాడవుదు.(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు, సూచనలు కేవలం పాఠకుల అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే అందించాం. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ వైద్యుల సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కానేరదు. ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్నా లేదా కొత్త జీవనశైలి మార్పులు పాటించాలన్నా ముందుగా సంబంధిత వైద్యులను సంప్రదించండి).

Add Zee News as a Preferred Source
TAGS:
Home Remedies