• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Nana Patekar Death: రజినీకాంత్ విలన్ కన్నుమూత..విలక్షణ నటుడు నానా పటేకర్ సినీ ప్రయాణం ఎలా సాగిందంటే?

Nana Patekar Death: రజినీకాంత్ విలన్ కన్నుమూత..విలక్షణ నటుడు నానా పటేకర్ సినీ ప్రయాణం ఎలా సాగిందంటే?

Nana Patekar Biography: ప్రముఖ మరాఠీ, బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (75) తుదిశ్వాస విడిచారు. గోవాలో ఈ రోజు అనగా అక్టోబరు 8 తెల్లవారుజామున గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నటుడిగా, దర్శకుడిగా చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన నానా పటేకర్.. వ్యక్తిగత జీవితం నుంచి సినీ ప్రయాణం వరకు కొన్ని కీలక మైలురాళ్ల గురించి తెలుసుకుందాం.

Written ByHarish Darla
Published: Oct 08, 2026, 08:36 AM IST|Updated: Oct 08, 2026, 08:39 AM IST
joinshare
Nana Patekar Death: రజినీకాంత్ విలన్ కన్నుమూత..విలక్షణ నటుడు నానా పటేకర్ సినీ ప్రయాణం ఎలా సాగిందంటే?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
PMAY అర్బన్-1.0పై కేంద్రం బిగ్ అప్‌డేట్.. ఏపీలో 3.71 లక్షల ఇళ్లు రద్దు.. కారణం ఇదే!

PMAY అర్బన్-1.0పై కేంద్రం బిగ్ అప్‌డేట్.. ఏపీలో 3.71 లక్షల ఇళ్లు రద్దు.. కారణం ఇదే!

2

మహిళలకు బతుకమ్మ కానుకగా రూ.2500?.. వైరల్ వార్తలపై అసలు నిజం ఇదేనంటూ తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ!

3

Donald Trump: గొప్పలు కాదు.. నిజాలే చేప్తున్నా.!. నోబెల్ శాంతి బహుమతిపై మరోసారి రెచ్చిపోయిన డొనాల్డ్ ట్రంప్.!.

4

టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వ్యాపించిన ఉద్యమం.. పాఠశాలల సమస్యలపై రోడ్డెక్కిన విద్యార్థులు!

5

ఈరోజు బంగారం కొంటున్నారా?.. హైదరాబాద్, విజయవాడల్లో నేటి పసిడి ధరలు ఇవే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nana Patekar Biography: ప్రముఖ బాలీవుడ్, మరాఠీ నటుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గోవాలోని ఆయన నివాసంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. గురువారం తెల్లవారుజామున ఆయన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండగా వెంటనే మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు CPR చేసినప్పటికీ ఆయన ప్రాణాన్ని కాపాడలేకపోయారు. దీంతో గురువారం తెల్లవారుజామున 5:20 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై మెడికో లీగల్ కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సమాచారం.

అసలు పేరు ఏంటి?
నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. ఆయన 1951 జనవరి 1న మహారాష్ట్రలోని మురుడ్ - జంజీరాలో జన్మించారు. ముంబైలోని సర్ జె.జె. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్‌ పట్టా పొందారు. రంగస్థలం నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నానా పటేకర్.. 1978లో వచ్చిన 'గమన్' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు.

'పరిందా'తో వచ్చిన భారీ గుర్తింపు
నానా పటేకర్ కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించినా 1988లో వచ్చిన 'సలామ్ బాంబే!' చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 1989లో విడుదలైన 'పరిందా' ఆయన కెరీర్‌ను మరింత మలుపు తిప్పింది. ఈ చిత్రంలోని నటనకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు.

'క్రాంతివీర్' చిత్రంతో జాతీయ అవార్డు
1994లో విడుదలైన 'క్రాంతివీర్' నానా పటేకర్ కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో ఆయన పోషించిన పాత్రకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది. 'అగ్నిసాక్షి', 'ఖామోషీ: ది మ్యూజికల్', 'అబ్ తక్ ఛప్పన్', 'అపహరణ్', 'రాజ్‌నీతి', 'వెల్‌కమ్', 'నటసమ్రాట్' వంటి చిత్రాల్లోనూ ఆయన తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన 'కాలా' సినిమాలోనూ నానా పటేకర్ నటించి మెప్పించారు. ఈ సినిమాలో తెలుగులో డబ్బింగ్ వెర్షన్ విడుదలైంది.

నటుడిగానే కాదు.. దర్శకుడిగానూ
నానా పటేకర్ నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ మంచి గుర్తింపు పొందారు. 1991లో విడుదలైన 'ప్రహార్: ది ఫైనల్ అటాక్' చిత్రానికి దర్శకత్వం వహించారు. తన కెరీర్‌లో మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, పలు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం 2013లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

నానా పటేకర్ నటనలో సహజత్వం, బలమైన డైలాగ్ డెలివరీ, పాత్రకు తగ్గ భావోద్వేగాలను అద్భుతంగా పలికించడం ఆయన ప్రత్యేకతగా నిలిచాయి. సీరియస్ పాత్రలతో పాటు కామెడీ, విలన్, పోలీస్, సామాజిక నేపథ్య పాత్రల్లోనూ ఆయన తనదైన శైలిని చూపించారు. దశాబ్దాల పాటు హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో ప్రేక్షకులను అలరించిన నానా పటేకర్ మరణం సినీ ప్రపంచానికి తీరని లోటుగా మిగలనుంది. ఆయన నటించిన పాత్రలు, సినిమాలు మాత్రం ప్రేక్షకుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Movie
Telugu News