book my Show New Record the Paradise : నాని హీరోగా ఒక్కో మెట్టు పై కెక్కుతున్నాడు. ఇప్పటి వరకు నానిని అందరు టైర్ 2 హీరోగా పిలిచేవారు. ఇక నుంచి ఇతను టైర్ 2 హీరో అనకూడదేమే. ‘ది ప్యారడైజ్’ మూవీతో నాని టైర్ 1 హీరోస్ లిస్టులోకి చేరిపోయినట్టే. బడా స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా నాని ‘ది ప్యారడైజ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర కుమ్మేస్తోంది. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లో ఈ సినిమా రికార్డు సేల్స్ నమోడు చేసింది. మొత్తంగా ప్రీమియర్స్ పడే వరకు ఈ సినిమా బుక్ మై షోలో 941 K టికెట్స్ బుక్కై సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
ఓ రకంగా టాలీవుడ్‌లో ప్రీ సేల్స్ పరంగా ఆరో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కంటే ముందు ఆర్ఆర్ఆర్ మినహాయిస్తే.. పుష్ప 3 మిలియన్ ప్రీ సేల్స్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. కల్కి 2898 ఏడీ సినిమా 1.72 మిలియన్స్‌తో రెండో ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత సలార్ మూవీ 1.67 మిలియన్స్ ప్రీ సేల్స్‌తో మూడు స్థానంలో నిలిచింది. ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ 1.32 మిలియన్ ప్రీ సేల్స్ సాధించింది. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ మూవీ 950 Kతో ఐదో ప్లేస్‌లో నిలిచింది.
ఆ తర్వాత ఆరో స్థానంలో ‘ది ప్యారడైజ్’ మూవీ ఉంది. ‘ది ప్యారడైజ్’ మూవీ కంటే ముందు పెద్ది..875K, గేమ్ ఛేంజర్ మూవీ.. 815 Kతో 8వ స్థానంలో .. గుంటూరు కారం 739 Kతో 9 స్థానంలో నిలిచింది. 530 Kతో బ్రో మూవీ పదో ప్లేస్‌లో ఉంది. మొత్తంగా టాప్ స్టార్స్ కు ఉండే ప్రీ సేల్స్ ను నాని ‘ది ప్యారడైజ్’ మూవీ క్రాస్ చేయడం విశేషం.
ఈ సినిమా ప్రీ సేల్స్ , మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 60 కోట్ల గ్రాస వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్‌తో పాటు బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లో సేల్స్ అయిన టికెట్స్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మరోవైపు నాని, మోహన్ బాబుల మధ్య సీన్స్ అంతగా పండలేదనే టాక్ కూడా వినిపిస్తుంది. మొత్తంగా రూ.100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘ది ప్యారడైజ్’ మొత్తంగా ఎంత రాబడుతుందో చూడాలి మరి.