SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బుక్ మై షోలో నాని ‘ది ప్యారడైజ్’ మరో రికార్డు.. బడా స్టార్స్‌ను వెనక్కి నెట్టి..

The Paradise Book My Show Final Pre Sales: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్‌ను నిన్న ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ఈ నేపథ్యంలో ఈ సినిమాతో బుక్ మై షోలో మరో రికార్డు నమోదు చేసింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Sep 24, 2026, 03:58 PM IST | Updated: Sep 24, 2026, 04:01 PM IST
Image Credit: book my show Nani Record
Join

book my Show New Record the Paradise : నాని హీరోగా ఒక్కో మెట్టు పై కెక్కుతున్నాడు. ఇప్పటి వరకు నానిని అందరు టైర్ 2 హీరోగా పిలిచేవారు. ఇక నుంచి ఇతను టైర్ 2 హీరో అనకూడదేమే. ‘ది ప్యారడైజ్’ మూవీతో నాని టైర్ 1 హీరోస్ లిస్టులోకి చేరిపోయినట్టే. బడా స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా నాని ‘ది ప్యారడైజ్’ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర  కుమ్మేస్తోంది. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లో ఈ సినిమా రికార్డు సేల్స్ నమోడు చేసింది. మొత్తంగా ప్రీమియర్స్ పడే వరకు ఈ సినిమా బుక్ మై షోలో  941 K టికెట్స్ బుక్కై సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

ఓ రకంగా టాలీవుడ్‌లో ప్రీ సేల్స్ పరంగా ఆరో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కంటే ముందు ఆర్ఆర్ఆర్ మినహాయిస్తే..  పుష్ప 3 మిలియన్ ప్రీ సేల్స్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. కల్కి 2898 ఏడీ సినిమా 1.72 మిలియన్స్‌తో రెండో ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత సలార్ మూవీ 1.67 మిలియన్స్ ప్రీ సేల్స్‌తో మూడు స్థానంలో నిలిచింది. ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ 1.32 మిలియన్ ప్రీ సేల్స్ సాధించింది.  పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ మూవీ 950 Kతో ఐదో ప్లేస్‌లో నిలిచింది.

ఆ తర్వాత ఆరో స్థానంలో ‘ది ప్యారడైజ్’  మూవీ ఉంది. ‘ది ప్యారడైజ్’ మూవీ కంటే ముందు పెద్ది..875K, గేమ్ ఛేంజర్ మూవీ.. 815 Kతో 8వ స్థానంలో .. గుంటూరు కారం 739 Kతో 9 స్థానంలో నిలిచింది. 530 Kతో బ్రో మూవీ పదో ప్లేస్‌లో ఉంది. మొత్తంగా టాప్ స్టార్స్ కు ఉండే ప్రీ సేల్స్ ను నాని ‘ది ప్యారడైజ్’ మూవీ క్రాస్ చేయడం విశేషం.

ఈ సినిమా ప్రీ సేల్స్ , మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 60 కోట్ల గ్రాస వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్‌తో పాటు బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లో సేల్స్ అయిన టికెట్స్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మరోవైపు నాని, మోహన్ బాబుల మధ్య సీన్స్ అంతగా పండలేదనే టాక్ కూడా వినిపిస్తుంది. మొత్తంగా రూ.100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘ది ప్యారడైజ్’ మొత్తంగా ఎంత రాబడుతుందో చూడాలి మరి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES