• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Nani On Chiru Srikanth Odela: మెగాస్టార్ చిరంజీవి, 'ది ప్యారడైజ్' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమా ఉందా? ఇప్పట్లో కష్టమే అంటున్న హీరో నాని!

Nani On Chiru Srikanth Odela: మెగాస్టార్ చిరంజీవి, 'ది ప్యారడైజ్' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమా ఉందా? ఇప్పట్లో కష్టమే అంటున్న హీరో నాని!

Nani On Chiru Srikanth Odela Movie: మెగాస్టార్ చిరంజీవి, 'దసరా' ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో ప్రకటించిన క్రేజీ ప్రాజెక్ట్‌పై ఆ చిత్ర నిర్మాత, హీరో నాని క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే 'ది ప్యారడైజ్' సినిమా విడుదలైన తర్వాత తన తర్వాతి మెగా ప్రాజెక్ట్‌పై ఒక్కసారిగా ప్రశ్నలు మొదలయ్యాయి. ఏడాదికి ముందే ప్రకటించిన ఈ సినిమాపై తాజాగా నాని క్లారిటీ ఇచ్చారు.

Written ByHarish Darla
Published: Oct 08, 2026, 06:55 AM IST|Updated: Oct 08, 2026, 06:58 AM IST
joinshare
Nani On Chiru Srikanth Odela: మెగాస్టార్ చిరంజీవి, 'ది ప్యారడైజ్' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమా ఉందా? ఇప్పట్లో కష్టమే అంటున్న హీరో నాని!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Nana Patekar: బాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు నానా పాటేకర్ కన్నుమూత..

Nana Patekar: బాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు నానా పాటేకర్ కన్నుమూత..

2

EPF Instant Withdrawal: యూపీఐ నుంచి పీఎఫ్ విత్‌డ్రా ఆప్షన్ రెడీ? ఒకేసారి ఏకంగా 75 శాతం డబ్బులు డ్రా చేయోచ్చు!

3

సినిమాలకు ఓకే.. పెళ్లికి నో..!.. టాలీవుడ్ బ్యాచిలర్ హీరోలు..!

4

Nani On Chiru Srikanth Odela: మెగాస్టార్ చిరంజీవి, 'ది ప్యారడైజ్' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమా ఉందా? ఇప్పట్లో కష్టమే అంటున్న హీరో నాని!

5

విశ్వంభర రిలీజ్ డేట్ అంతు చిక్కని మెగా సస్పెన్స్.. ? సినిమాకు మోక్షం ఎపుడో..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nani On Chiru Srikanth Odela Movie: తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి, 'దసరా', 'ది ప్యారడైజ్' సినిమాలతో అలరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలయికలో రానున్న చిత్రంపై ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా, అలాగే నిర్మాతగా వ్యవహరించనున్నారు. అయితే ఈ సినిమా గురించి ప్రకటించి దాదాపుగా ఏడాది కావొస్తున్నా.. దీని అప్‌డేట్ ఇంకా రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ ఏమైఉంటుందని చర్చించుకుంటున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదని, ఆ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవ్వొచ్చని నిర్మాత నాని వెల్లడించారు.

ఈ సినిమా ఆలస్యానికి గల ప్రధాన కారణాలను ఇటీవల 'ది ప్యారడైజ్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో నాని వివరించారు. తాను నటించిన 'ది ప్యారడైజ్' సినిమా షూటింగ్ కావడానికి అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం తీసుకుందని నాని వెల్లడించారు. దాంతో ఆ ప్రభావం చిరంజీవి సినిమాపై పడిందని, ఆ విధంగా ఆ సినిమా షెడ్యూల్ అటకెక్కిందని ఆయన పేర్కొన్నారు.

అయితే తమ ముందు ప్లానింగ్ ప్రకారం.. ఈపాటికే ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండాల్సిందని, కానీ 'ది ప్యారడైజ్' చిత్రం ఆలస్యం వల్ల అది సాధ్యపడలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్ గురించి తాము ఇంకా కూర్చుని చర్చించుకోలేదని, నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ గ్యాప్‌లో చిరంజీవి గారు కూడా తమ ఇతర సినిమాల చిత్రీకరణలను పూర్తి చేశారని ఆయన తెలియజేశారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2024 డిసెంబర్‌లో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చిరంజీవి సుదీర్ఘ సినీ ప్రయాణంలోనే ఇది 'అత్యంత హింసాత్మక చిత్రం'గా రాబోతుందని ఓ పోస్టర్‌ ద్వారా చిత్రబృందం తెలియజేసింది. దీంతో మెగాస్టార్ - శ్రీకాంత్ ఓదెల సినిమాపై ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగాయి. 

అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇద్దరి డేట్లు తిరిగి సర్దుబాటు అయిన తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్ట్‌పై తదుపరి అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. సినిమా నిర్మాణం కొంత ఆలస్యమైనప్పటికీ, ఈ ప్రతిష్టాత్మక కాంబినేషన్ కోసం మెగా అభిమానులు, సాధారణ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Movie