Venu Swamy About The Paradise Movie : హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా వినాయక నిమజ్జనం సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా.. ఈ టాక్‌తో ఈ సినిమా బాక్పాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా లో ధూమావతి అమ్మవారిపై ఆరాధన పై వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
అమ్మవారితో ఆటలొద్దు..
దమ్ముదైర్యం ఉంటే...దేవతలతో పెట్టుకోవద్దన్నారు. దశమహా విద్యల్లోనే అత్యంత శక్తివంతమైన ధూమావతి అమ్మవారి ప్రస్తావన, కాకి ప్రతీకలు, తంత్ర మంత్రోచ్ఛారణలతో ఉన్న BGMపై వేణు స్వామి తీవ్ర హెచ్చరికలు చేశారు. "తంత్ర సంప్రదాయాల్లో ఇంత పవర్ ఫుల్ దేవతా శక్తులతో ఆడుకోవాలంటే మామూలు విషయం కాదు.. చాలా జాగ్రత్తగా ఉండాలి" అంటూ కామెంట్స్ చేశారు. దీంతో వేణు స్వామి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మంత్రోఛ్చారణల విషయంలో జాగ్రత్త..
అయినా చెప్పిన దాంట్లో తప్పులేదని చాలా మంది చెబుతున్నారు. అమ్మవారి మంత్రాలను ఎలాంటి ఉచ్ఛారణ దోషాలు లేకుండా వల్లెవేయాలి. అందులో ఏదైనా తప్పులు చేస్తే దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మన గ్రంథాల్లో ఉంది. ఆ సంగతి పక్కన పెడితే.. నాని ‘ది ప్యారడైజ్’ తొలి రోజు రికార్డు వసూళ్లను రాబట్టింది. తొలి రోజు రూ. 88 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజు భారీ డ్రాప్స్‌ను సొంతం చేసుకుంది. ఏకంగా రెండో రోజు రూ. 28 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా రెండో రోజు రూ. 114 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఇప్పటి వరకు రూ. 60 కోట్ల షేర్ వరకు రాబట్టింది. మొత్తంగా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌లో 50 శాతాన్ని రికవరీ చేసింది. ఇక నాని ఇది వరుసగా మూడో రూ. 100 కోట్ల గ్రాస్ చిత్రం. మొత్తంగా ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి మరి.