• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /బాక్సాఫీస్ దగ్గర నాని ఊర మాస్ ఊచకోత.. ఫస్ట్ డే ‘ప్యారడైజ్’ రికార్డుల జాతర..

బాక్సాఫీస్ దగ్గర నాని ఊర మాస్ ఊచకోత.. ఫస్ట్ డే ‘ప్యారడైజ్’ రికార్డుల జాతర..

The Paradise Movie First Day Box Office Collections: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసిన ‘ది ప్యారడైజ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తుంది. అంతేకాదు ఫస్ట్ డే పలు రికార్డులను తన పేరున నమోదు చేసుకునే పనిలో పడింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Sep 24, 2026, 12:20 PM IST|Updated: Sep 24, 2026, 12:27 PM IST
joinshare
బాక్సాఫీస్ దగ్గర నాని ఊర మాస్ ఊచకోత.. ఫస్ట్ డే ‘ప్యారడైజ్’ రికార్డుల జాతర..
Image Credit: Nani The Paradise 1st Day Gross

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

The Paradise Movie Box office Predictions: అవును నాని.. బాక్సాఫీస్ దగ్గర మాయ చేస్తున్నాడనే చెప్పాలి. గతంలో ఆయన హీరోగా నటించిన పలు చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నింటిని ఒక్క రోజులోనే రాబట్టే పనిలో పడ్డాడు. రిలీజ్ కు ముందు బుక్ మై షో ఓపెన్ చేయగానే ‘ది ప్యారడైజ్’ మూవీ ఊహించని రేంజ్‌లో ఊచకోత కోసిందనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. అంతేకాదు నాని కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ‘ది ప్యారడైజ్’ మూవీ రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా దాదాపు రూ. 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే మాములు విషయం కాదు. టైర్ 2 హీరోల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.  

ప్రపంచ వ్యాప్తంగా 2 వేల స్క్రీన్స్‌లో విడుదల.. 

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 900 స్క్రీన్స్‌లో విడుదలైంది. కర్ణాటక, భారత్‌లోని ఇతర ప్రాంతాల్లో 500 వరకు స్క్రీన్స్ , ప్రపంచ వ్యాప్తంగా కలుపుకుంటే 2 వేల స్క్రీన్స్‌లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్‌తో రూ. 10 కోట్ల గ్రాస్ రచ్చ చేసిన ‘ది ప్యారడైజ్’ మూవీ.. ఓవర్సీస్‌లో $1.5 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టనుంది. అంతేకాదు అక్కడ ఎంత లేదన్నా.. రూ. 15 కోట్ల నుంచి రూ. 16 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశాలున్నాయి.

ప్రీమియర్స్ తో కలిపి రూ. 50 కోట్ల గ్రాస్.. 

డే వన్ ప్రీమియర్స్ అన్ని కలిపి దాదాపు రూ. 50 కోట్ల గ్రాస్ దాటడం పక్కా అని చెబుతున్నారు. చాలా మటుకు మీడియం రేంజ్ సినిమాలు డబుల్ డిజిట్ షేర్.. గ్రాస్ కోసం కష్టపడుతుంటూ.. నాని ‘ది ప్యారడైజ్’ మాత్రం ఏకంగా మొదటి రోజు రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్ల షేర్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్ల వరకు షేర్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ సినిమాకు వచ్చిన మిక్స్‌డ్ టాక్ నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి మరి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News