• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /ఆసక్తిరేకిస్తోన్న‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’ ట్రైలర్.. 2027 ఫిబ్రవరి 12న విడుదల..

ఆసక్తిరేకిస్తోన్న‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’ ట్రైలర్.. 2027 ఫిబ్రవరి 12న విడుదల..

Narnia: The Magicians Nephew Trailer Talk: హాలీవుడ్ లేడీ డైరెక్టర్ గ్రెటా గెర్విగ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’. పూర్తి ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. సీ.ఎస్. లూయిస్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 16, 2026, 12:56 PM IST|Updated: Oct 16, 2026, 04:05 PM IST
joinshare
ఆసక్తిరేకిస్తోన్న‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’ ట్రైలర్.. 2027 ఫిబ్రవరి 12న విడుదల..
Image Credit: Narnia (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఉడకబెట్టిన గుడ్లను ఎంతసేపట్లో తినాలి? ఫ్రిజ్‌లో ఇలా నిల్వ చేస్తున్నారా?  తీవ్రమైన రోగాల బారిన పడే ప్రమాదం!

ఉడకబెట్టిన గుడ్లను ఎంతసేపట్లో తినాలి? ఫ్రిజ్‌లో ఇలా నిల్వ చేస్తున్నారా? తీవ్రమైన రోగాల బారిన పడే ప్రమాదం!

2

Tirumala Rain: బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో అకస్మాత్తుగా భారీ వర్షం.. తడిసి ముద్దయిన లక్షలాది భక్తులు

3

మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారిపోతున్నాయా? ఈ ఒక్క చిట్కాతో మళ్లీ పచ్చగా కళకళలాడుతాయి!

4

16 ఏళ్ల శరణ్య ఖేరుకా అద్భుత ఘనత.. పారాలింపియన్ల జీవితాలపై రాసిన పుస్తకానికి ప్రశంసలు!

5

ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని 5 ఆహారాలు ఇవే! పెడితే రుచి, పోషకాలు అన్నీ మాయం..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

లు చిత్రాలు తెరకెక్కాయి. ‘హ్యారీ పోర్టర్’ కూడా ఈ తరహా నేపథ్యంలోనే తెరకెక్కి ప్రేక్షకుల మెప్పు పొందింది.  తాజాగా అదే మాయాజాలం, ఉత్కంఠ, భరితమైన పాత్రలతో ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ‘నార్నియా: ది మేజిషియన్స్  చిత్రం తెరకెక్కుతోంది.  ఈ సినిమా 2027 ఫిబ్రవరి 12న భారతదేశ వ్యాప్తంగా  థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది.  

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌లో నార్నియా అనే అద్భుత ప్రపంచాన్ని పరిచయం చేశారు. డేవిడ్ మెక్‌కెన్నా డిగరీ కిర్క్ పాత్రలో, బీట్రైస్ క్యాంప్‌బెల్ పాలీ ప్లమ్మర్ పాత్రలో నటించారు.  వీరిద్దరి ప్రయాణం నార్నియా అనే మాయా ప్రపంచంలోకి తీసుకెళుతుంది.  ఎమ్మా మాకీ యువ జాడిస్ పాత్రలో, డేనియల్ క్రెయిగ్ అంకుల్ ఆండ్రూ క్యారెక్టర్స్‌లో యాక్ట్ చేస్తున్నారు.  కేరీ ముల్లిగన్, కోబ్నా హోల్డ్‌బ్రూక్-స్మిత్, మెరిల్ స్ట్రీప్ తదితరులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘బార్బీ’ వంటి ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన చిత్రాన్ని తెరకెక్కించిన గ్రెటా గెర్విగ్ ఈ సినిమాకు డైరెక్ట్ చేస్తున్నారు.  గతంలో విడుదలైన ఫస్ట్‌లుక్‌లో జాడిస్‌తో పాటు డిగరీ, పాలీ పాత్రలను ప్రేక్షకుల పరిచయం చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమాలోని పాత్రలు, కథా ప్రపంచంపై ప్రేక్షకులకు మరింత క్లారిటీ ఇచ్చినట్టైంది. తాజాగా తెలుగు ట్రైలర్ ఆసక్తిరేకిస్తోంది. 

సీ.ఎస్. లూయిస్ రాసిన ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’ పుస్తకాల ప్రచురణ క్రమంలో ‘ది మెజీషియన్స్ నెఫ్యూ’ ఆరో పుస్తకం. అయితే కథాక్రమం ప్రకారం ఇది ‘ది లయన్, ది విచ్ అండ్ ది వార్డ్‌రోబ్’కు ముందు జరిగే సంఘటనలను వివరిస్తుంది. నార్నియా ప్రపంచం ఎలా ఆవిర్భవించిందనే విషయాన్ని ఈ కథను  చూపిస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ రీలీజింగ్ ఇంటర్నేషనల్ పంపిణీ చేస్తోంది. ‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’ 2027 ఫిబ్రవరి 12న భారతదేశంలో థియేటర్లలో రాబోతుంది. 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie