SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నిర్మాతగా నిహారిక కొణిదెల దూకుడు.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీ..

Niharika Konidela Another Movie As Producer: నిహారిక కొణిదెల గురించి చెప్పాలంటే ఈమె మెగా కుటుంబం నుంచి తొలి కథానాయికగా సంచలనం రేపింది. ప్రస్తుతం సినీ నిర్మాతగా రాణిస్తోంది. తాజాగా రెండు సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించిన నిహారిక.. తన అన్న వరుణ్ తేజ్‌తో ‘బరి’ అనే సినిమా నిర్మిస్తోంది. అది సెట్స్ పై ఉండగానే మరో చిత్రానికి శ్రీకారం చుట్టింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 29, 2026, 11:38 AM IST | Updated: Oct 29, 2026, 11:42 AM IST
Join

Niharika Production Another Movie Pocket Rockkets: నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం  ‘పాకెట్ రాకెట్స్’ . రుద్ర అత్రి డైరెక్ట్ చేస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ చిత్రంలో  త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా నటిస్తున్నారు. శ్రియా కొంతం (శుభం ఫేమ్) కథానాయికగా యాక్ట్ చేస్తోంది.   జేడీ చక్రవర్తి మరో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌‌ని, కాన్సెప్ట్ పోస్టర్‌ని విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

విదేశాల్లో చదువుకోవాలనుకునే  ఓ కుర్రాడు, ఆ కలను సాకారం చేసుకునేందుకు గ్యాబ్లింగ్‌లోకి దిగడం, ఆ తర్వాత ఆ కుర్రాడి జీవితంలో ఎదురైన పరిస్థితుల్ని ‘పాకెట్ రాకెట్స్’లో చిత్రంలో ఎంతో ఆసక్తికరంగా చూపించబోతోన్నట్టు మేకర్స్ తెలిపారు. అంతేకాదు రీసెంట్‌గా  ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. అంతేకాదు చిత్రానికి గుమ్మడికాయ కొట్టేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో టీజర్, ట్రైలర్‌తో పాటు  రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

ఈ చిత్రానికి ఎదురోలు రాజు కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు.  అన్వల్ అలీ ఎడిటర్‌గా..గ్యానీ సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాల్ని మూవీ టీమ్ అనౌన్స్ చేయనుంది. మరోవైపు నిహారిక తన అన్న వరుణ్ తేజ్‌తో ‘బరి’ అనే స్పోర్ట్స్ డ్రామా  నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో వరుణ్ తేజ్ గాయాల పాలు కావడంతో  ఈ సినిమా డిలే అయంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మరోవైపు నిహారిక మరో రెండు ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతోంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES