SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

OM Movie Review: ‘ఓం’ మూవీ రివ్యూ.. మమ్ముట్టి, ధనుశ్‌ల మూవీ మెప్పించిందా..!!

OM Movie Review: జాతీయ ఉత్తమ నటులుగా ముమ్ముట్టి, ధనుశ్ హీరోలుగా నసీరుద్దీన్ షా మరో కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఓం (ఆపరేషన్ మోల్). సాయి పల్లవి, శ్రీలీల, రేణు దేశాయ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అమరన్ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న రాజ్ కుమార్ పెరియాస్వామి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ రోజు విడుదలైన ‘ఓం’ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 20, 2026, 12:00 IST | Updated: Nov 20, 2026, 13:55 IST
Image Credit: Operation Mole Review (X/Source)
Join

మూవీ రివ్యూ: ఓం (ఆపరేషన్ మోల్)(OM: Operation Mole)
నటీనటులు: ముమ్ముట్టి, ధనుశ్, సాయి పల్లవి, శ్రీలీల, రేణు దేశాయ్, నసీరుద్దీన్ షా, శివాజీ రాజా, ఇంద్రాన్స్ తదితరులు
సంగీతం: సాయి అభయంకర్ 
సినిమాటోగ్రఫీ: ఎజిల్ అరసు
ఎడిటర్: కలైవానన్ 
బ్యానర్స్: వండర్ బార్ ఫిల్మ్స్, Rటేక్ స్టూడియోస్ 
నిర్మాత: ధనుశ్, శ్రద్ధ అగర్వాల్, అజమత్ జగ్‌మత్ 
రచన, దర్శకత్వం: రాజ్ కుమార్ పెరియాసామి 
నిడివి:178 నిమిషాలు (2 గంటల 58 నిమిషాలు)
విడుదల తేది:20-11-2026

మమ్ముట్టి, ధనుశ్ మలయాళ, తమిళ హీరోల మల్టీస్టారర్ మూవీ ‘ఓం’. రాజ్ కుమార్ పెరియాసామి  దర్శకుడు. డాన్సింగ్ క్వీన్స్‌గా పేరు పొందిన సాయి పల్లవి, శ్రీలీల నటనకు ప్రాధన్యాత ఉన్న పాత్రల్లో నటించడంతో ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. మరి ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం.

కథ విషయానికొస్తే..

తమిళనాడు తిరువణ్ణామలైకు చెందిన తిరుకుమరన్  (ధనుశ్) ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన పోలీస్ అధికారిణి నిత్యా రెడ్డి(సాయి పల్లవి) ఏర్పాటు చేసిన పోలీస్  స్పెషల్ ఏజెంట్. ఇతను  ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో అక్రమ ఎర్రచందనం వ్యాపారం చేసే కార్తికేయన్ (మమ్ముట్టి) దగ్గర నమ్మకస్తుడుగా చేరతాడు. అంతేకాదు అక్కడ కార్తికేయన్ చేసే పనులకు పోలీసులకు  ఎప్పటికప్పుడు చేరవేస్తుంటాడు. అయితే ఈ అక్రమ ఎర్ర చందనం ముఠా వెనక దుబాయ్‌లో ఉన్న అబ్దుల్ హమీద్ (నసీరుద్దీన్ షా) మెయిన్ బాస్. అతని కనుసన్నల్లోనే అక్రమ ఎర్ర చందనం రవాణా జరగుతూ ఉంటుంది. అయితే పోలీసులు, నేవి, కస్టమ్స్ నిఘా వల్ల కొన్నేళ్లుగా స్థబ్దుగా ఉన్న అక్రమ ఎర్ర చందనాన్ని ధనుశ్ పోలీసులు సహాయంతో  ముందుగా 300 టన్నులు ఎర్ర చందనాన్ని స్మగుల్  చేసి కార్తికేయన్‌కు విశ్వాస పాత్రుడవుతాడు. అంతేకాదు అతనికి దుబాయ్‌లో ఉన్న అబ్దుల్ హమీద్‌ను కలిసే అవకాశం వస్తుంది.   ఈ క్రమంలో  వాళ్ల దగ్గరున్నమిగిలిన 700 టన్నుల ఎర్ర చందనాన్ని విదేశాలకు తిరుకుమరన్ సాయంతో స్మగుల్ చేయాలనుకుంటారు. అయితే ఈ ఇన్‌ఫర్మేషన్ ను పోలీసులకు తిరుకుమరన్  చేరవేయడంతో పోలీసులు  ఈ అక్రమ ఎర్ర చందనాన్ని తరలిస్తున్న వారిని నిత్యా రెడ్డి టీమ్  పట్టుకుంటారు. ఈ క్రమంలో కార్తికేయన్ అతని కొంత మంది సహచరులు  తప్పించుకుంటారు. మరోవైపు ఎర్ర చందనం రవాణా చేసే ఓ డ్రైవర్‌గా తిరుకుమారన్ తండ్రి (ఇంద్రాన్స) ఇంట్లో డబ్బు కోసం ఈ పనికి ఒప్పుకుంటాడు. అయితే పోలీసులకు ఎర్ర చందనం కట్ చేయడానికి వచ్చిన కూలీలను ఎన్‌కౌంటర్ చేస్తారు. అందులో హీరో తండ్రి కూడా ఉంటారు. ఈ క్రమంలో సీక్రెట్ పోలీసు‌గా పనిచేస్తోన్న తిరుకుమరన్ అలియాన్ పళని ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తోన్న బిగ్ పిన్‌ను పోలీసులకు పట్టించాడా..? తనను ఎంతో నమ్మిన కార్తికేయన్‌కు ఈ విషయం తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు..? చివరకు ఏం జరిగిందనేదే ‘ఓం’ సినిమా స్టోరీ.


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

తెలుగు, హిందీ, తమిళంలో ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ చేసే దురంధర్ తరహా స్టోరీలతో ఎన్నో సినిమాలొచ్చాయి.  ఎన్ని వచ్చిన దర్శకుడు ఏ కథను చెప్పే విధానాన్ని బట్టి సినిమా జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఈ సినిమాలో ధనుశ్‌ను కూడా పోలీస్ ఆఫీసర్ అయిన సాయి పల్లవి ఏజెంట్‌గా నియమిస్తుంది. అతను విలన్ గ్యాంగ్‌లో జరిగే సమాచారాన్ని అంతా చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో అక్రమ ఎర్ర చందనం రవాణాను అడ్డుకునే క్రమంలో ఎంతో మంది పోలీసులు ఈ స్మగ్లర్స్ బారిన పడి చనిపోయిన సంఘటనలు కోకొల్లలు. అది చూపెడుతూనే ఏదో ఎక్కువ డబ్బుల వస్తాయనే ఆశతో అడవిలో ఎర్ర చందనాన్ని నరకడానికి వెళ్లే వాళ్లు .. ఎలా పోలీసులు బారిన పడటం.. ఈ సందర్భంగా పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేసి మానసికంగా సంతృప్తి చెందే సీన్స్ రాసుకున్న విధానం కన్విన్సింగ్‌గా ఉంది. మిగతా ఎవరు స్మగ్లింగ్ వైపు రాకూడదనే ఉద్దేశ్యంతో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అందులో పెద్ద తలకాయలను విడిచిపెట్టి కూలీ కోసం వచ్చిన వాళ్లను ఎన్‌కౌంటర్ చేయడం.. దీని వల్ల ఆయా కూలీల కుటుంబాలు ఎలాంటి మానసిక క్షోభ అనుభవిస్తారనే విషయాన్ని చూపెట్టాడు. మొత్తంగా పోలీసులలోని పాజిటివ్, నెగిటివ్ యాంగిల్ రెండింటిని చూపించి బ్యాలెన్స్ చేశాడు. అటు కూలీల విషయాన్ని కూడా ఇదే యాంగిల్‌లో ప్రెజెంట్ చేశాడు.

ఈ క్రమంలో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తోన్న హీరో తండ్రి మాజీ బస్సు డ్రైవర్‌గా రిటైర్డ్ అయిన వ్యక్తి. తన మనవడికి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వడానికి ఎక్కువ డబ్బులు వస్తాయన్నాయనే ఆశతో ఆ లారీలో ఏముందో చూడకుండా డ్రైవర్‌‌గా వస్తాడు. ఈ క్రమంలో పోలీసులకు కూలీలతో పాటు చిక్కుతాడు. ఈ క్రమంలో అమాయకులైన  కూలీలతో  పాటు హీరో తండ్రిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం.. ఈ క్రమంలో హీరో ఎలాంటి మానసిక సంఘర్షణ అనుభవించడం సీన్స్ గుండెలను పిండేస్తాయి. మరోవైపు తను ఎవరి దగ్గరైతే పనికి కుదిరాడో ముమ్ముట్టి  మంచి వాడని తెలుసుకుంటాడు. పులిస్వారి ఈ వ్యాపారంలో కిందికి దిగితే పులి మింగేస్తుంది. ఈ క్రమంలో పోలీసులకు చిక్కిన కార్తికేయన్‌ అప్రూవర్ గా మారడంతో అదే జైల్లో పోలీసులకు చిక్కిన అబ్దుల్ హమీద్ జైల్లో ఖైదీలకు అతన్ని చంపమని చెప్పడం.. ఈ క్రమంలో జైలులో జరిగే క్లైమాక్స్ ఫైట్ బాగుంది.

అదే సమయంలో కార్తికేయన్ కోసం నిత్యారెడ్డితో పాటు తిరుకుమరన్ ఎలా ప్రాణాలకు తెగించి పోరాడే సన్నివేశాలు బాగున్నాయి. అయితే సినిమా మొత్తం సిరియస్ మోడ్‌లో సాగడం.. ఇలాంటి దురంధర్ తరహా కథలు చూసి ఉండటం మూలానా కొత్తగా కనిపించదు. పైగా పుష్పలో చూసిన ఎర్ర చందనం స్మగ్లింగ్ వంటి అంశాలు కూడా ప్రేక్షకులు పెద్దగా కిక్ ఇవ్వవు. కానీ ఎర్ర చందనం  రవాణా మూలంగా కూలీల ప్రాణాలు గాల్లో దీపంలా మారే అంశమే కొత్తగా ఉంది. ఓవరాల్‌గా ఇప్పటికే మనం చూసేసిన కథనే మళ్లీ కొత్త ఆర్టిస్టులతో తెరకెక్కించినట్టు ఉంది. మరోవైపు ఓ స్పై కుటుంబానికి దూరం కావడం.. ఈ క్రమంలో భార్య విడాకుల కోసం అప్లై చేయడం వంటి సీన్స్ బోరింగ్ అనిపిస్తాయి.

నటీనటుల విషయానికొస్తే.. 
మమ్ముట్టి కార్తికేయన్ పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్. తన స్థాయికి తగ్గట్టు ఈ పాత్రలో ఒదిగిపోయాడు. పరివర్తన చెందే క్రిమినల్ పాత్రలో ఒదిగిపోయాడు. ధనుశ్ కూడా స్పై పాత్రలో సహజ సిద్ధంగా ఒదిగిపోయాడు. ఓ సగటు భర్తగా.. తండ్రిగా .. ఓ కుమారుడిగా తన క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేశాడు పోలీసుల ఆపరేషన్ మోల్‌గా టైటిల్ పాత్రలో ఒదిగిపోయాడు. సాయి పల్లవి ‘నిత్యా రెడ్డి పాత్రలో తనదైన నటన కనబరించింది. రామాయణలో సీతమ్మ పాత్రలో అలరించిన ఈమె ఇందులో తొలిసారి పోలీస్ పాత్రలో ఒదిగిపోయింది. ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు బాగుంది. శ్రీలీల కూడా సగటు ఇల్లాలి పాత్రలో ఓ బిడ్డకు తల్లి పాత్రలో కనిపించింది. మొత్తంగా డాన్సర్స్‌గా పేరు తెచ్చుకున్న ధనుశ్, సాయి పల్లవి, శ్రీలీల ఒక్క సాంగ్ లేకపోవడం విశేషం. రేణు దేశాయ్ మంచి నటనే కనబరించింది. పెద్దగా యాక్ట్ చేసే స్కోప్ దక్కలేదు. మమ్ముట్టి లాంటి పెద్ద స్టార్ సరసన ఒదిగిపోయింది. టైగర్ నాగేశ్వరరావు తర్వాత ఈ సినిమాలో కనిపించింది. నసీరుద్దీన్ షా నటనకు వంక పెట్టాల్సిన పనిలేదు. ఆయన ఎలాంటి నటుడితో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివాజీ రాజాకు మంచి రోల్ దక్కింది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

బ్యాటమ్ లైన్ - ఓం ఆపరేష్ మోల్ .. రొటీన్ గా సాగే యాక్షన్ క్రైమ్ డ్రామా..

రేటింగ్: 2.5/5

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES