SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'ఓస్కార్ మిస్సింగ్' టైటిల్‌తోనే సినిమాపై అంచనాలు..

Oskar Missing Movie Opening: తెలుగు సినీ ఇండస్ట్రీ అనేది ఓ పుష్పక విమానం వంటిది. ఇక్కడ ఎంత మంది వచ్చినా కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. ఈ కోవలో అంతా కొత్త వాళ్లతో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓస్కార్ మిస్సింగ్’. టైటిల్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 22, 2026, 14:37 IST | Updated: Oct 24, 2026, 14:43 IST
Image Credit: Movie Opening (X/Source)
Join

Oskar Missing Movie Pooja Ceremony: శ్రీమతి మాత రాజేశ్వరి సమర్పణలో భూమాత ఆర్ట్స్ బ్యానర్ట్ పై తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓస్కార్ మిస్సింగ్’. తెలుగులో ఇప్పటి వరకు రానటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుంది. రీసెంట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.  పసుపులేటి రాదా క్రిష్ణ, శివాని జంటగా తెరకెక్కుతోంది. చంద్రమౌళి పి.జి ఈ సినిమాతో మెగాఫోన్ పట్టుకుంటున్నారు. పవన్ మాత, నితిన్ మాత నిర్మాతలుగా  వ్యవహరిస్తున్నారు.

ఓస్కార్ మిస్సింగ్ చిత్ర ప్రారంభం సందర్భంగా ఈ సినిమా మేకర్స్ ఈ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  ఈ సినిమా ఆద్యంతం పూర్తి కామెడీ ఎంటర్టైనర్‌గా ఉండబోతున్నట్టు ప్రకటించారు.  ఇందులో కొన్ని నిజ జీవిత పాత్రలు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తాయని చెప్పుకొచ్చారు. మొత్తంగా హాస్యభరితంగా ప్రేక్షకులను కేవలం నవ్వించడమే ధ్యేయంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు  చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.

‘ఓస్కార్ మిస్సింగ్’ చిత్రాన్ని కేవలం  రెండు షెడ్యూల్స్ లో పూర్తి చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తైయినట్టు తెలిపారు. ఇక  డిసెంబర్   చివరికి షూటింగ్ ముగించుకుని త్వరగా విడుదల చేయనున్నట్టు  తెలిపారు. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో   అలీ, చిత్రం శ్రీను, రాము, దుర్గారావు, శోభ బిత్తిరి సత్తి, జబర్దస్త్ ఫణి నటిస్తున్నారు.  

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES