Prabhas Fauzi Glimpse Review: హను రాఘవపూడి పేరు చెప్పగానే చాలామందికి ‘సీతారామం’ సినిమా గుర్తుకొస్తుంది. అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆయన, ఇప్పుడు ప్రభాస్‌తో పూర్తిగా భిన్నమైన సినిమాను తీసుకొస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో ప్రేమకథ కంటే యాక్షన్, దేశభక్తి, సాహసం, మాస్ ఎలివేషన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లు కనిపిస్తోంది.
సుభాష్ చంద్రబోస్, హిట్లర్ మధ్య ఆసక్తికర సంభాషణ
‘ఫౌజీ’ గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మనీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే సంభాషణ ఆసక్తిని పెంచుతోంది. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు జర్మనీ సహాయం కావాలని సుభాష్ చంద్రబోస్ కోరుతారు. అయితే భారతీయుల గురించి హిట్లర్ తక్కువ చేసి మాట్లాడతాడు.
— Hanu Raghavapudi (@hanurpudi) October 23, 2026
దీనికి నేతాజీ ధైర్యంగా సమాధానం చెబుతారు. తన దేశానికి స్వాతంత్య్రం సాధించడానికి ఇతరుల సహాయం ఉన్నా లేకపోయినా పోరాడతానని స్పష్టం చేస్తారు. ఈ సన్నివేశాలు దేశభక్తి భావనను పెంచేలా ఉన్నాయి.
అదే సమయంలో బ్రిటిష్ సైన్యానికి సవాల్‌గా నిలిచిన ఒక భారతీయ సైనికుడి గురించి నేతాజీ వివరిస్తారు. అతను సైనికుడే కాదు, మంచి వ్యూహకర్త, గూఢచారి కూడా. భగవద్గీత ఆధారంగా రహస్య కోడ్‌ను రూపొందించి బ్రిటిష్ వారి సమాచార వ్యవస్థను దెబ్బతీస్తాడని చెబుతారు. ఆ సైనికుడినే బ్రిటిష్ వాళ్లు ‘ఫౌజీ’ అని పిలుస్తారు.
ప్రభాస్ మాస్ ఎంట్రీ అదిరింది!
గ్లింప్స్ చివర్లో ప్రభాస్ ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన కనిపించే సమయంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశానికి మరింత బలాన్ని ఇస్తోంది. దేశం కోసం పోరాడే యోధుడిగా ప్రభాస్‌ను చూపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.