‘కిక్’,‘ఆర్య’ సహా ప్రభాస్ ఇన్ని బ్లాక్ బస్టర్స్ మూవీస్‌ను రిజెక్ట్ చేసాడా..!
Prabhas Rejected Movies: గింజ గింజ మీద తినే వారి పేరు రాసినట్టే.. సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక కథానాయకుడు చేయాల్సిన సినిమా వేరే హీరోల దగ్గరకు వెళ్లి వాళ్లు స్టార్స్ అయిన సందర్భాలున్నాయి. కొన్ని డేట్స్ కుదరకనో.. మరికొన్ని ఆ టైమ్ లో స్టోరీల నచ్చక రిజెక్ట్ చేసిన సందర్భాలుంటాయి. అలా ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటే మీరు ఓ లుక్కేయండి..
Prabhas Rejected Stories : కొన్ని సందర్బాల్లో ప్రభాస్.. కథ నచ్చక తిరస్కరించిన సందర్భాలున్నాయి. కొన్ని స్టోరీలు నచ్చినా.. అప్పటికే కమిటైన సినిమాల వల్ల చేయలేకపోయాడు. అలా కమిట్స్ మెంట్స్ కారణంగా ఒదులుకున్న చిత్రాల విషయానికొస్తే..
సింహాద్రి: 'సింహాద్రి'ఈ స్టోరీని ముందు బాలయ్యతో చేద్దామనుకున్నారు రాజమౌళి. ఆ తర్వాత ఈ కథను రాజమౌళి ప్రభాస్‌కు వినిపించాడని టాక్. అయితే ఈ రేంజ్ మాస్ స్టోరీకి తనకు వర్కౌట్ కాదేమో అనే అనుమానంతో ఈ కథను ఒదిలేసినట్టు సమాచారం.
ఒక్కడు: సూపర్ స్టార్ మహేష్ బాబును తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టిన చితరం ‘ఒక్కడు’. గుణశేఖర్ ముందు ఈ చిత్ర కథను ప్రభాస్‌తో చేయాలనుకున్నాడట. ప్రభాస్, కృష్ణంరాజులకు స్టోరీ కూడా వినిపించాడట. ఆ తర్వాత స్క్రిప్ట్ పై డౌట్ వచ్చి రిస్క్ ఎందుకో అని ఈ స్టోరీని రిజెక్ట్ చేసారట.
ఆర్య: దర్శకుడు సుకుమార్‌కు హీరో ప్రభాస్ కు మంచి రిలేషనే ఉంది. ఆ తర్వాత ఆర్య కథను ప్రభాస్‌కు వినిపిస్తే తన ఇమేజ్‌కు ఈ సినిమా సెట్ అవ్వదని వదిలేసాడట.
దిల్: ఆది లాంటి పవర్ ఫుల్ సక్సెస్ తర్వాత వి.వి. వినాయక్ తెరకెక్కించిన ‘దిల్’ చిత్రం స్టోరీని ముందుగా ప్రభాస్ కు వినిపించాడట. ఈ సినిమా స్టోరీ చేద్దామనుకున్నాడు. కానీ అప్పటికే రెబల్ స్టార్ వేరే సినిమాతో బిజీగా ఉండటంతో దిల్ సినిమా చేయలేకపోయాడు.
బృందావనం: 'మున్నా' లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చానని దర్శకుడు వంశీ పైడిపల్లి ఆ తర్వాత బృందావనం సినిమా కథను ప్రభాస్ కు వినిపించాడట. అప్పటికే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు దిల్ రాజుతో మరో సినిమా చేస్తానని కమిట్ అవ్వడంతో ఈ కథను ఎన్టీఆర్‌లో తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు.
నాయక్: వినాయక్‌తో ‘యోగి’ సినిమా చేసాడు ప్రభాస్. కానీ అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయింది. ఆ తర్వాత ప్రభాస్ ను కలిసి ‘నాయక్’ కథను వినిపించాడట. ఆ సినిమా కథ నచ్చినా.. అప్పటికే కమిటైన మిర్చి, బాహుబలి సినిమాల వల్ల ‘నాయక్’ చేయలేకపోయాడు ప్రభాస్.
డాన్ శీను: గోపీచంద్ మలినేని ఫస్ట్ ఈ స్టోరీని ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాడు. అయితే అప్పటికే ‘బుజ్జిగాడు’ సినిమా చేసాడు ప్రభాస్. 'డాన్ శీను' కథ అదే తరహాలో ఉండటంతో ఈ స్టోరీని రిజెక్ట్ చేసాడట.
కిక్: రవితేజ మార్కెట్ రెండింతలు చేసిన చిత్రం ‘కిక్’. సురేందర్ రెడ్డి ఈ సినిమా కథ కూడా ముందు ప్రభాస్ కు వినిపించాడట. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా ఈ స్టోరీని రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా చివరకు రవితేజ దగ్గరకు వెళ్లి అతనికి ఊహించని బ్లాక్ బస్టర్‌ను అందించింది.
ఊసరవెల్లి: ఊసరవెల్లి సినిమా కథ ముందుగా సురేందర్ రెడ్డి ప్రభాస్ కు వినిపించాడట. ఎందుకో తెలియదు కానీ అప్పుడున్న పరిస్థితుల కారణంగా ప్రభాస్ ఈ స్టోరీని ఒదిలేసుకున్నాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు.
జిల్: జిల్ సినిమాను రాధాకృష్ణ ముందుగా ప్రభాస్ కోసమే రాసుకున్నాడు. కానీ'బాహుబలి'చిత్రంతో బిజీగా ఉన్న కారణంగానే ఈ చిత్రాన్ని ప్రభాస్ చేయలేకపోయాడు. కానీ కథ నచ్చి గోపీచంద్‌కు రెఫర్ చేసాడు. ఆ తర్వాత దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌తో రాధే శ్యామ్ సినిమా చేసాడు.