• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘కిక్’,‘ఆర్య’ సహా ప్రభాస్ ఇన్ని బ్లాక్ బస్టర్స్ మూవీస్‌ను రిజెక్ట్ చేసాడా..!

‘కిక్’,‘ఆర్య’ సహా ప్రభాస్ ఇన్ని బ్లాక్ బస్టర్స్ మూవీస్‌ను రిజెక్ట్ చేసాడా..!

Prabhas Rejected Movies: గింజ గింజ మీద తినే వారి పేరు రాసినట్టే.. సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక కథానాయకుడు చేయాల్సిన సినిమా వేరే హీరోల దగ్గరకు వెళ్లి వాళ్లు స్టార్స్ అయిన సందర్భాలున్నాయి. కొన్ని డేట్స్ కుదరకనో.. మరికొన్ని ఆ టైమ్ లో స్టోరీల నచ్చక రిజెక్ట్ చేసిన సందర్భాలుంటాయి. అలా ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటే మీరు ఓ లుక్కేయండి..

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 26, 2026, 07:48 AM IST|Updated: Oct 26, 2026, 07:49 AM IST
joinshare
‘కిక్’,‘ఆర్య’ సహా ప్రభాస్  ఇన్ని బ్లాక్ బస్టర్స్ మూవీస్‌ను  రిజెక్ట్ చేసాడా..!
Image Credit: Prabhas Reject (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
‘కిక్’,‘ఆర్య’ సహా ప్రభాస్  ఇన్ని బ్లాక్ బస్టర్స్ మూవీస్‌ను  రిజెక్ట్ చేసాడా..!

‘కిక్’,‘ఆర్య’ సహా ప్రభాస్ ఇన్ని బ్లాక్ బస్టర్స్ మూవీస్‌ను రిజెక్ట్ చేసాడా..!

2

School Holiday Tomorrow: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..తెలంగాణలో ఈ స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు!

3

Nominations: ఏపీలో 'పరిషత్‌' ఎన్నికలకు భారీగా నామినేషన్లు.. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య హోరాహోరీ

4

అక్టోబర్ 30న రైతు ఖాతాల్లో రూ.2000 జమ.. డబ్బులు పడాలంటే ఈ పనులు వెంటనే చేయండి!

5

Anand Mahindra On Vizag Beach: "వైజాగ్‌లో ఇంతటి అందమైన బీచ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు?" ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Prabhas Rejected Stories : కొన్ని సందర్బాల్లో ప్రభాస్.. కథ నచ్చక తిరస్కరించిన సందర్భాలున్నాయి.  కొన్ని స్టోరీలు నచ్చినా.. అప్పటికే కమిటైన సినిమాల వల్ల చేయలేకపోయాడు. అలా కమిట్స్ మెంట్స్ కారణంగా ఒదులుకున్న చిత్రాల విషయానికొస్తే..

సింహాద్రి: 'సింహాద్రి'ఈ స్టోరీని ముందు బాలయ్యతో చేద్దామనుకున్నారు రాజమౌళి. ఆ తర్వాత ఈ కథను రాజమౌళి ప్రభాస్‌కు వినిపించాడని టాక్. అయితే ఈ రేంజ్ మాస్ స్టోరీకి తనకు వర్కౌట్ కాదేమో అనే అనుమానంతో ఈ కథను ఒదిలేసినట్టు సమాచారం.

ఒక్కడు: సూపర్ స్టార్ మహేష్ బాబును తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టిన చితరం ‘ఒక్కడు’. గుణశేఖర్ ముందు ఈ చిత్ర కథను  ప్రభాస్‌తో చేయాలనుకున్నాడట. ప్రభాస్, కృష్ణంరాజులకు స్టోరీ కూడా వినిపించాడట. ఆ తర్వాత స్క్రిప్ట్ పై డౌట్ వచ్చి రిస్క్ ఎందుకో అని ఈ స్టోరీని రిజెక్ట్ చేసారట.

ఆర్య: దర్శకుడు సుకుమార్‌కు హీరో ప్రభాస్ కు మంచి రిలేషనే ఉంది. ఆ తర్వాత ఆర్య కథను  ప్రభాస్‌కు వినిపిస్తే తన ఇమేజ్‌కు ఈ సినిమా సెట్ అవ్వదని వదిలేసాడట.

దిల్: ఆది లాంటి పవర్ ఫుల్ సక్సెస్ తర్వాత వి.వి. వినాయక్ తెరకెక్కించిన ‘దిల్’ చిత్రం స్టోరీని ముందుగా ప్రభాస్ కు వినిపించాడట. ఈ సినిమా స్టోరీ చేద్దామనుకున్నాడు. కానీ అప్పటికే రెబల్ స్టార్ వేరే సినిమాతో బిజీగా ఉండటంతో దిల్ సినిమా చేయలేకపోయాడు.

బృందావనం: 'మున్నా' లాంటి ఫ్లాప్  సినిమా  ఇచ్చానని దర్శకుడు వంశీ పైడిపల్లి ఆ తర్వాత బృందావనం సినిమా కథను ప్రభాస్ కు వినిపించాడట. అప్పటికే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు దిల్ రాజుతో మరో సినిమా చేస్తానని కమిట్ అవ్వడంతో ఈ కథను ఎన్టీఆర్‌లో  తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు.  

నాయక్: వినాయక్‌తో ‘యోగి’ సినిమా చేసాడు ప్రభాస్. కానీ అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయింది. ఆ తర్వాత ప్రభాస్ ‌ను కలిసి ‘నాయక్’ కథను వినిపించాడట. ఆ సినిమా కథ నచ్చినా.. అప్పటికే కమిటైన మిర్చి, బాహుబలి సినిమాల వల్ల ‘నాయక్’ చేయలేకపోయాడు ప్రభాస్.  

డాన్ శీను: గోపీచంద్ మలినేని ఫస్ట్ ఈ స్టోరీని  ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాడు. అయితే అప్పటికే ‘బుజ్జిగాడు’ సినిమా చేసాడు ప్రభాస్. 'డాన్ శీను' కథ అదే తరహాలో ఉండటంతో ఈ స్టోరీని రిజెక్ట్ చేసాడట.  

కిక్: రవితేజ మార్కెట్ రెండింతలు చేసిన చిత్రం ‘కిక్’. సురేందర్ రెడ్డి ఈ సినిమా కథ కూడా ముందు ప్రభాస్ కు వినిపించాడట. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా ఈ స్టోరీని రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా చివరకు  రవితేజ దగ్గరకు వెళ్లి అతనికి ఊహించని బ్లాక్ బస్టర్‌ను అందించింది.

ఊసరవెల్లి: ఊసరవెల్లి సినిమా కథ ముందుగా సురేందర్ రెడ్డి ప్రభాస్ కు వినిపించాడట. ఎందుకో తెలియదు కానీ అప్పుడున్న పరిస్థితుల కారణంగా ప్రభాస్ ఈ స్టోరీని ఒదిలేసుకున్నాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

జిల్: జిల్ సినిమాను రాధాకృష్ణ ముందుగా ప్రభాస్ కోసమే రాసుకున్నాడు. కానీ'బాహుబలి'చిత్రంతో  బిజీగా ఉన్న కారణంగానే ఈ చిత్రాన్ని ప్రభాస్ చేయలేకపోయాడు. కానీ కథ నచ్చి గోపీచంద్‌కు రెఫర్ చేసాడు. ఆ తర్వాత దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌తో రాధే శ్యామ్ సినిమా చేసాడు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News