SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Rajamouli: రాజమౌళి బయట సూపర్ స్టార్.. కానీ స్టేజ్‌పై రమా రాజమౌళి ఏం చేసిందో చూడండి!

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా.. ఇంట్లో మాత్రం రమా రాజమౌళి ముందు సాధారణ భర్తే! ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈవెంట్‌లో రమా రాజమౌళి చేసిన చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Written By Vishnu Priya
Published: Sep 30, 2026, 03:12 PM IST | Updated: Sep 30, 2026, 03:17 PM IST
Join

Rajamouli: దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ సినీ పరిశ్రమలో ఆయనకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమా అంటే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉంటాయి. అయితే బయట ఎంత పెద్ద దర్శకుడైనా.. ఇంట్లో మాత్రం భార్య రమా రాజమౌళితో సాధారణ భర్తగానే ఉంటారు. తాజాగా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయం మరోసారి కనిపించింది.

రమా రాజమౌళి గతంలో వివాహం చేసుకున్నారు. ఆమెకు అప్పటికే కార్తికేయ అనే కుమారుడు ఉన్నారు. ఆ తర్వాత రమా రాజమౌళిని వివాహం చేసుకున్న ఎస్‌ఎస్ రాజమౌళి.. కార్తికేయను తన సొంత కొడుకులాగే చూసుకున్నారు. రాజమౌళి కుటుంబంతో కార్తికేయకు ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు కార్తికేయ నిర్మాతగా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా దాదాపు రాజమౌళి కుటుంబ వేడుకలా కనిపించింది. రాజమౌళి, రమా రాజమౌళితో పాటు కీరవాణి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చి కార్తికేయతో తన అనుబంధం గురించి, రాజమౌళి కుటుంబం గురించి మాట్లాడారు.


అయితే ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో చిన్న సంఘటన ఉంది. రాజమౌళిని స్టేజ్‌పైకి రావాలని పిలిచిన సమయంలో ఆయన వెనుక రమా రాజమౌళి కూడా ఉన్నారు. రాజమౌళి స్టేజ్ వైపు వెళ్లబోతుండగా.. రమా రాజమౌళి సరదాగా తన చేత్తో ఆయన్ను ముందుకు తోశారు.

ఆ చిన్న క్షణం అక్కడున్నవారిని మాత్రమే కాకుండా సోషల్ మీడియా ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళి ఎంత పెద్ద దర్శకుడైనా భార్య ముందు మాత్రం సాధారణ భర్తేనంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

ఫిల్మ్ సెట్స్‌పై రాజమౌళి బాస్ అయితే.. ఇంట్లో మాత్రం రమా రాజమౌళినే ‘హోమ్ మినిస్టర్’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఉండే సరదా అనుబంధం ఈ చిన్న వీడియోలో కనిపించిందని మరికొందరు అంటున్నారు.

కార్తికేయ కొత్త ప్రయాణానికి కుటుంబం మొత్తం ఒక్కటైన ఈ వేడుకలో.. రాజమౌళి, రమా రాజమౌళి మధ్య కనిపించిన ఈ చిన్న క్షణం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read More: Movie News: మంచు తెరల నడుమ గుండెను తాకే రాగం.. మ్యూజిక్ లవర్స్‌కు మెలోడీ ట్రీట్..!

 

Read More: Junior NTR: కుటుంబం కాదు.. ఎన్టీఆర్‌కు ఎప్పుడూ అండగా నిలిచిన వ్యక్తి ఎవరో తెలుసా..?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES