• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ దర్శకులు వీళ్లే..

బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ దర్శకులు వీళ్లే..

Indian Top Directors: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి 2’తో భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్ల మార్క్ అనే మైలు రాయిని అందుకుంది. ఆ తర్వాత జక్కన్న బాటలో పలువురు దర్శకులు ఈ ఫీట్ ను అందుకున్నారు. తాజాగా నితీష్ తివారీ.. దంగల్ తర్వాత ‘రామాయణ’తో మరోసారి ఈ క్లబ్బులో ప్రవేశించారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 13, 2026, 05:08 AM IST|Updated: Nov 13, 2026, 05:09 AM IST
joinshare
బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ దర్శకులు వీళ్లే..
Image Credit: 1000 Crore club (Source/File)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Nandamuri Tejaswini Debut Film: బాలకృష్ణ కుమార్తె తేజస్విని కొత్త ప్రయోగం.. తొలి సినిమా ఎవరితో?

Nandamuri Tejaswini Debut Film: బాలకృష్ణ కుమార్తె తేజస్విని కొత్త ప్రయోగం.. తొలి సినిమా ఎవరితో?

2

Sabarimala 54 Special Trains: అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్‌న్యూస్.. శబరిమలకు 54 స్పెషల్ రైళ్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

3

‘రామాయణ’ సహా రూ. 1000 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన భారతీయ చిత్రాలు ఇవే..

4

బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ దర్శకులు వీళ్లే..

5

VC Sajjanar: గుండెనిండా మధుర జ్ఞాపకాలతో ఇక సెలవు.. సజ్జనార్‌ భావోద్వేగ సందేశం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

రాజమౌళి..
బాహుబలి 2 మూవీతో తొలిసారి వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించాడు రాజమౌళి. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1810 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

బాహుబలి 2 తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ కూడా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1310 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

నితీష్ తివారీ.. 
దంగల్ మూవీతో  దర్శకుడు నితీష్ తివారీ భారతీయ బాక్సాఫీస్ తో పాటు చైనా బాక్సాఫీస్ దగ్గర కలిపి రూ.1958 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. తాజాగా రణ్‌బీర్ కపూర్, యశ్‌ రాముడిగా, రావణాసురుడిగా నటించిన ‘రామాయణ’ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. మొత్తంగా రాజమౌళి తర్వాత రెండు వెయ్యి కోట్ల గ్రాస్ రాబట్టిన దర్శకుడిగా రికార్డు క్రియేట్ చేశారు.

ప్రశాంత్ నీల్..
యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ 2’ మూవీతో దర్శకుడు ప్రశాంత్ నీల్ వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస దగ్గర రూ. 1233 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

అట్లీ..
షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ మూవీతో తొలిసారి వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1160 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి.  

సిద్ధార్థ్ ఆనంద్..
షారుఖ్ హీరోగా తెరకెక్కిన ‘పఠాన్’ మూవీతో ఫస్ట్ టైమ్ రూ. వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు సిద్ధార్ధ్ ఆనంద్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1055 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

నాగ్ అశ్విన్ ..
నాగ్ అశ్విన్ .. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ మూవీతో ఫస్ట్ టైమ్ వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి  వరకు రూ. 1111 కోట్ల వరకు రాబట్టినట్టు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. 

ఆదిత్యధర్.. 

ఆదిత్యధర్ ‘దురంధర్’, దురంధర్ 2 రెండు చిత్రాలతో వరుసగా రూ. 1000 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన దర్శకుడిగా రికార్డు క్రియేట్ చేశారు. ఈ రెండు చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Bollywood
Tollywood
Telugu News