Indian 1000 Crore Movies: భారతీయ చిత్ర పరిశ్రమ సరికొత్త టార్గెట్ రూ. 1000 కోట్లు అని చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి 2’ తో తొలిసారి వెయ్యి కోట్ల క్లబ్ అనేది ప్రారంభం అయింది. ఆ తర్వాత ‘దంగల్’ సినిమా చైనాలో విడుదలైన అక్కడి వసూల్లతో ఈ ఫీట్ అందుకుంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, కల్కి 2898 AD, కేజీఎఫ్ 2, పుష్ప 2, జవాన్, పఠాన్, చిత్రాలు రూ. 1000 కోట్ల క్లబ్బులో ప్రవేశించడం విశేషం. మొత్తంగా హీరోల విషయానికొస్తే.. ప్రభాస్, షారుఖ్, రణ్‌వీర్ సింగ్, యశ్‌కు చెరో రెండు చిత్రాలు.. ఎన్టీఆర్, రామ్ చరణ్, రణ్‌బీర్ కపూర్, అల్లు అర్జున్, ఆమీర్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్ నటించిన ఒక్కో చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించాయి.
రామాయణ పార్ట్ 1..
రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా.. యశ్ రావణుడిగా నటించిన చిత్రం ‘రామాయణ పార్ట్ 1’. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్ర, యశర్ నిర్మాతలుగా తెరకెక్కిన చిత్రం ‘రామాయణ’ . ఈ సినిమా మొదటి భాగం రూ. 1000 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. ఈ నేపథ్యంలో వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన 11వ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. హిందీ విషయానికొస్తే.. 6 చిత్రం కావడం విశేషం.
ధురంధర్ ది రివేంజ్ ..
రామాయణ చిత్రం కంటే ముందు ‘దురంధర్’ సినిమాకు రెండో భాగంగా తెరకెక్కిన ‘దురంధర్ 2’ సినిమా భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో విడుదలై బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ వీక్ లోనే వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించడం విశేషం. మొత్తంగా రూ. 1863 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. మన దేశంలో రూ. 1000 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన 10వ చిత్రం. హిందీలో ఐదో చిత్రం కావడం విశేషం.
దురంధర్..
రణ్ వీర్ సింగ్ టైటిల్ రోల్లో సంజయ్ దత్, మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ లీడ్ రోల్స్ లో సారా అర్జున్ కథానాయికగా యాక్ట్ చేసిన చిత్రం ‘దురంధర్’. గతేడాది మన దేశంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓవరాల్ గా రూ. 1350 కోట్ల గ్రాస్ నుంచి రూ. 1400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. ఓవరాల్ గా మన దేశంలో రూ. 1000 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన 9వ చిత్రం ఇది.
పుష్ప 2..
సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమా విడుదలైన మొదటి వారంలోనే రూ. 1000 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించింది. అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ అందుకున్న చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. మొత్తంగా ఈ సినిమా రూ.1750 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో వెయ్యి కోట్ల రాబట్టిన నాల్గో చిత్రంగా నిలిచింది. మన దేశంలో 8వ చిత్రంగా నిలిచింది.
కల్కి 2898 AD..
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1101 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన మూడో తెలుగు సినిమాగా రికార్డులకు ఎక్కింది. మన దేశంలో వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన 7వ చిత్రం.
RRR..
రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గన్ కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం ‘RRR’. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 1400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. రూ. వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన రెండో తెలుగు సినిమాగా నిలిచింది.
కేజీఎఫ్ 2..
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్ 2’. ఈ చిత్రం రూ.1233 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. కన్నడ న నుంచి తొలి వెయ్యి కోట్ల రూపాయలను రాబట్టిన ఏకైక చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. దక్షిణాది నుంచి మూడో చిత్రం. ఓవరాల్‌గా నాల్గో చిత్రం ఇది.
బాహుబలి 2 ..
రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రానా దగ్గుబాటి విలన్ గా తెరకెక్కిన మూవీ ‘బాహుబలి 2’. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1810 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. తెలుగులో రూ. వెయ్యి కోట్ల రాబట్టిన ఫస్ట్ మూవీ గా నిలిచింది. ఓవరాల్ గా మన దేశంలో ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం.
దంగల్..
ఆమీర్ ఖాన్ హీరోగా నితిష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దంగల్’. ఈ మూవీ మన దేశంలో బాహుబలి తర్వాత వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఓవరాల్ గా మన దేశంతో పాటు చైనాతో కలిసి రూ. 1958 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట.
పఠాన్..
షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పఠాన్’. ఈ చిత్రం మన దేశంలో తొలి వెయ్యి కోట్లు రాబట్టిన హిందీ చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓవరాల్ గా రూ. 1051 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఓవరాల్ గా హిందీలో రెండో వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన చిత్రంగా నిలిచింది. ఓవరాల్‌గా నాల్గో భారతీయ చిత్రం ఇది.
జవాన్..
షారుఖ్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘జవాన్’. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 1160 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా హిందీలో మూడో వెయ్యి కోట్ల చిత్రంగా రికార్డులకు ఎక్కింది. మన దేశంలో 5వ వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన చిత్రంగా నిలిచింది.