• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /10వ రోజు రామాయణ మూవీ మరో రికార్డు.. బుక్ మై షోలో ఏకంగా 1 మిలియన్ టికెట్ సేల్స్..

10వ రోజు రామాయణ మూవీ మరో రికార్డు.. బుక్ మై షోలో ఏకంగా 1 మిలియన్ టికెట్ సేల్స్..

Ramayana 10 Days Box Office Collection: ‘రామాయణ’ సినిమా ముందు నుంచి అంతా అనుకున్నట్టే మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. రామాయణంలో కొంత మేర వక్రీకరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన పదో రోజు కూడా ఈ సినిమా మరో రికార్డును బుక్ మై షోలో సరికొత్త క్రియేట్ చేసింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 15, 2026, 10:41 AM IST|Updated: Nov 15, 2026, 10:43 AM IST
joinshare
10వ రోజు  రామాయణ మూవీ మరో రికార్డు.. బుక్ మై షోలో ఏకంగా 1 మిలియన్ టికెట్ సేల్స్..
Image Credit: Ramayana 10 Days Box Office Report (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

2

కార్తీక మాసంలో దీపదానం ఎలా చేయాలి? ఎవరికి దానం చేస్తే పుణ్యఫలం కలుగుతుంది?

3

తెలంగాణకు తుఫాన్ ఎఫెక్ట్.. నవంబర్ 20 నుంచి 22 వరకు భారీ వర్షాలు.. ఈ 6 జిల్లాలకు అలర్ట్!

4

కార్తీక మాసంలో తులసి ముందు నెయ్యి దీపం ఎందుకు వెలిగిస్తారు? అసలు రహస్యం ఇదే!

5

పుతిన్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ramayana Another Record: నమిత్ మల్హోత్ర, యశ్ నిర్మాతలుగా నితీష్ తివారీ  డైరెక్షన్‌లో దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతుంది. తొలి రోజు నార్మల్‌గా స్టార్ట్ అయినా ఆ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపిస్తోంది. విడుదలైన 10వ రోజు కూడా ఈ సినిమా బుక్ మై షోలో ఏకంగా 10.1 లక్షల టికెట్స్ సేల్ అయ్యాయి. 1.01 మిలియన్ టికెట్స్ తెగాయి. మరోవైపు ఆఫ్‌లైన్ లెక్కలు వేసుకుంటే తెగిన టికెట్స్ ఇంకా ఎక్కువే ఉంటాయి. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ సినిమా వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తోంది. మొత్తంగా రాముడి పేరుతో ‘రామాయణ’ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమంలో సరికొత్త రికార్డులను చెరిపేస్తూ పోతుంది.

ఇప్పటి వరకు 12 మిలియన్ టికెట్ సేల్.. 
‘రామాయణ’ తొలి రోజు రూ. 10.2 లక్షల టికెట్స్ అమ్ముడు పోయాయి. అంటే 1.02 మిలియన్ టికెట్స్ సేల్ అయ్యాయి. 10వ రోజు దాదాపు అంతే స్థాయిలో టికెట్స్ తెగడం అంటే మామలు విషయం కాదు. ఇదంత రామానామ మహిమ అని చెప్పక తప్పదు. మొత్తంగా 10 రోజుల్లో బుక్ మై షోలో 1 కోటి 20 లక్షల టికెట్స్ అమ్ముడు పోయాయి. అంటే 12 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోవడం అంటే మాములు విషయం కాదు. ఈ సినిమాకు ఎక్కడా టికెట్ రేట్స్ హైక్ లేవు. మొత్తంగా నిన్న హిందీలో రూ. 53.75 కోట్ల నెట్ .. కన్నడలో 5.40 కోట్లు.. మలయాళంలో 4.75 కోట్లు.. తమిళంలో కూడా రూ. 4.75 కోట్లు.. తెలుగులోరూ. 4.25 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ప్లస్ డొమెస్టిక్ కలిపితే $130 మిలియన్ డాలర్స్ రాబట్టింది..

మొత్తంగా ఇప్పటి వరకు రూ. 1228 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా డొమెస్టిక్ ప్లస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కలిపితే $130 మిలియన్ డాలర్స్ రాబట్టింది. అందులో భారత్‌లో నిన్నటి వరకు 819.50  కోట్ల గ్రాస్.. నెట్ వసూళ్లు.. 685.60 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ. 408.50 కోట్లు రాబట్టింది. పదవ రోజు శనివారం.. రూ. 72.90 కోట్ల నెట్ వసూళ్లను కొల్లగొట్టింది. మొత్తంగా శుక్రవారంతో పోల్చితే 51.6 శాతం వృద్దిని నమోదు చేసింది. 

కొండంత టార్గెట్..

ప్రపంచ వ్యాప్తంగా రామాయణ పార్ట్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 800 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే కనీసం రూ. 1600 కోట్ల గ్రాస్ (రూ. 800 కోట్ల షేర్ ) రాబట్టాలి. నిన్నటి వరకు రూ. 1228 కోట్లు రాబట్టింది. ఇంకా రూ. 372 కోట్ల గ్రాస్ రాబటితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నట్టే. ఈ రోజు కూడా ఎంత లేదన్న రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిస్తున్నాయి. మొత్తంగా కొండంత టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఒక్కో రోజు అవలీలగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబడుతూ దూసుకుపోతుంది. ఇదే ట్రెండ్ మరో వారం రోజుల కొనసాగితే మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని థియేట్రికల్‌గా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి మరి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Bollywood
Telugu Movie