SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

‘రామాయణ’ ఫస్ట్ డే కలెక్షన్స్ .. మొదటి రోజు ఎంత రాబట్టచ్చంటే..

Ramayana 1st Day Collections: రామాయణ నిన్న ప్రపంచ వ్యాప్తంగా దీపావళి కానుకగా విడుదలైంది. ఈ సినిమా విజువల్ వండర్‌గా పేరు తెచ్చుకుంది కానీ ఎమోషన్స్ విషయంలో వెనకబడిందనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఈ సినిమా బుకింగ్స్ కూడా జోరు జోరుమీదున్నాయి. ముఖ్యంగా హిందీ ఏరియాల్లోనే మంచి వసూళ్లు దక్కుతున్నట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్న మాట. మొత్తంగా ‘రామాయణ’ ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా ఎంత రాబట్టే అవకాశాలున్నాయంటే..

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 06, 2026, 08:14 AM IST | Updated: Nov 06, 2026, 08:17 AM IST
Image Credit: Ramayana 1st Day Collections (Source/X)
Join

Ramayana Box Office Report: ‘రామాయణ’ బుకింగ్స్‌పైనే కాదు దాని ఫస్ట్ డే వసూళ్లపైనా చర్చలు జోరుగా జరుగుతున్నాయిప్పుడు. బాలీవుడ్‌లో ఫస్ట్ డే రూ. 200 కోట్లు వసూలు చేసిన రికార్డ్ కేవలం ధురంధర్ 2కి మాత్రమే సొంతం అయింది. ఆ రికార్డ్ రామాయణ సొంతం అవుతుందా అనే లెక్కలేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. మరి ఈ పౌరాణిక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్.. నిన్న సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ సహా పలు అంశాలు ఈ సినిమా ఫస్ట్ డే వసూళ్లను ప్రభావితం చేసేలా ఉన్నాయి.


రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ విడుదలకు 2 వారాల ముందే ఓపెన్ అయ్యాయి.. డే 1 కోసం ఇండియా వైడ్‌గా ఇప్పటివరకు 36 కోట్ల గ్రాస్ రాబట్టింది ఈ సినిమా. ఇప్పటి వరకు ముందు రోజు వరకు 6 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై సాలిడ్ స్టార్ట్ అందుకుంది. నిన్నటి వరకు 25.26 కోట్ల టికెట్లు బుక్ మై షో సహా ఇతర యాప్స్‌లో  అమ్ముడు పోయినట్టు సమాచారం.  ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి 4.58 కోట్లు, కర్ణాటక నుంచి 4.36 కోట్లు, ఢిల్లీ నుంచి 3.58 కోట్లు రామాయణ ఖాతాలో పడ్డాయి. నిన్న ఓవరాల్‌గా హిందీలో రూ. 50 కోట్ల .. కన్నడలో 8 కోట్లు.. తెలుగు వెర్షన్ - 6 కోట్లు.. తమిళంలో రూ. 3 కోట్లు.. మలమాళంలో 1.50 కోటి దక్కించుకున్నట్టు ట్రేడ్ రిపోర్ట్స్ లెక్కలు చెబుతున్న మాట.

మొదటి రోజు రూ. 125 కోట్ల నుంచి రూ. 150 కోట్ల గ్రాస్.. 

మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 125 కోట్ల గ్రాస్ నుంచి రూ. 150 కోట్ల గ్రాస్ మధ్య వసూళ్లను రాబట్టే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. ఈ విజువల్ వండర్‌ను ప్రీమియం ఫార్మాట్స్‌లో చూసేందుకు ఆడియన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా రావణుడిగా మొదటి అరగంట యశ్ నటన హైలెట్. చివర్లో జటాయువు ఫైట్ సీన్ ప్రేక్షకులతో పాటు చిన్నారులను అలరించేలా ఉన్నాయి.

‘రామాయణ’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా ఐమాక్స్, 4DX, డాల్బీ సినిమాస్ లాంటి షోల నుంచే ఎక్కువ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది.  టాక్ బాగుంది కాబట్టి  దివాళి వీకెండ్ అంతా దుమ్ము దులిపేయడం అయితే పక్కా అని చెబుతున్నారు.

ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ రామాయణ మేనియా గట్టిగానే కనిపిస్తోంది. నిన్న గంటకు 60 వేల టికెట్స్ బుక్ మై షోలో అమ్ముడైపోయాయి.  కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్స్ నుంచే 2 మిలియన్ రాబట్టే అవకాశాలున్నాయి.  ఓవరాల్ ఓవర్సీస్ అడ్వాన్స్ 5 మిలియన్లకు చేరింది. ఓపెనింగ్ వీకెండ్‌లో ఓవర్సీస్ నుంచే రామాయణ 20 మిలియన్ డాలర్స్ వస్తాయనే టాక్ నడుస్తుంది.

రెండు భాగాలుగా రామాయణ.. 

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ కోసం మేకర్స్ ఏకంగారూ.  4000 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు ప్రకటించారు. ఫస్ట్ డే రూ. 200 కోట్ల ఓపెనింగ్ తెచ్చి.. ధురంధర్ 2 తర్వాత ఆ రికార్డ్ అందుకున్న సినిమాగా రామాయణ లిస్ట్‌లో నిలుస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అదంత ఈజీ అయితే కాదు.. అలాగని అసాధ్యం కూడా కాదు. మరి చూడాలిక.. రామాయణ ఏం చేస్తుందనేది మరికాసేట్లో క్లారిటీ రానుంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES