• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /దీపావళి ధమాకా.. కేవలం రూ.100కే 10 రకాల కూరగాయలు.. రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్..!!

దీపావళి ధమాకా.. కేవలం రూ.100కే 10 రకాల కూరగాయలు.. రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్..!!

Deepavali Bonanza: దీపావళి పండగ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. కేవలం రూ. 100 కే 10 రకాల కూరగాయల ప్యాక్ ను నవంబర్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అందిస్తున్నట్లు తెలిపింది.

Written ByBhoomi
Published: Nov 06, 2026, 10:02 AM IST|Updated: Nov 06, 2026, 10:04 AM IST
joinshare
దీపావళి ధమాకా.. కేవలం రూ.100కే 10 రకాల కూరగాయలు.. రాష్ట్ర  ప్రభుత్వం బంపర్ ఆఫర్..!!
Image Credit: Deepavali Bonanza:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
బెంగళూరులో ఘోరం.. భార్యతోపాటు ఏడుగురిని గ్రైండింగ్ రాయితో కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్! సహకరించిన కూతురు?

బెంగళూరులో ఘోరం.. భార్యతోపాటు ఏడుగురిని గ్రైండింగ్ రాయితో కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్! సహకరించిన కూతురు?

2

ధనత్రయోదశి రోజే శుక్రుడి సంచారం.. ఈ 4 రాశుల వారికి బంపర్‌ గుడ్‌న్యూస్‌!

3

దీపావళి ధమాకా.. కేవలం రూ.100కే 10 రకాల కూరగాయలు.. రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్..!!

4

నవంబర్ 12 వరకు ఈ 4 రాశులకు కుజుడి అనుగ్రహం.. ఉద్యోగం, వ్యాపారాల్లో భారీ లాభాలు!

5

Video: టిక్కెట్‌ లేకుండానే ఏసీ కోచ్‌లోకి ప్రవేశం.. చిర్రెత్తుకొచ్చి రిజర్వ్‌డ్‌ ప్యాసింజర్లు ఏం చేశారంటే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Deepavali Bonanza: దీపావళి పండగను పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం సామాన్యులకు అదిరిపోయే స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పెరుగుతున్న కూరగాయల ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తక్కువ ధరకే కూరగాయలను అందించేందుకు రూ. 100కే 10 రకాల కూరగయల ప్యాక్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వెట్రి స్పెషల్ వెజిటెబుల్ ప్యాక్ పేరుతో ఈ ప్రత్యేక విక్రయాలను చేపట్టింది.

తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక కూరగాయల ప్యాక్ విక్రయాలను నవంబర్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 218 సహకార దుకాణాల ద్వారా ఈ కూరగాయలను పంపిణీ చేయనున్నారు. దీపావళి పండగ సమయంలో ఇలా వంటింటికి అవసరమైన కూరగాయలను ఒకే ప్యాకేజీలో తక్కువ ధఱకు అందించడం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం. మార్కెట్ ధరలతో పోల్చితే ప్రజలకు కొంత ఆర్థిక ఊరట కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు.


ఈ ప్రత్యేక ప్యాకేజీలో 500 గ్రాముల ఉల్లిపాయలు, టమాటా500 గ్రాములు, వంకాయలు 500 గ్రాములు, బంగాళాదుంపలు 250గ్రాములు, క్యారెట్లు 200 గ్రాములు, బీన్స్ 200 గ్రాములు, పచ్చిమిర్చి 100 గ్రాములు, నిమ్మకాయలు 100 గ్రాములు, అల్లం 50 గ్రాములు, కొబ్బరి కాయ ఒకటి  ఉంటాయి. ఒక వ్యక్తికి ఒక ప్యాకేజీ మాత్రమే అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

దీపావళి సమయంలో ఇంట్లో ప్రత్యేక వంటకాలు తయారు చేసుకునేందుకు కూరగాయలు ఎక్కువగా అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలోనే 10 రకాల కూరగాయలను ఒకే ప్యాక్ లో 100కే అందించడం వల్ల వినియోగదారులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. ఎంపిక చేసిన సహకార దుకాణాల ద్వారా ఈ ప్యాక్ లను అందుబాటులో ఉంచడంతో ప్రజలు ఒకే చోట అవసరమైన కూరగాయలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Also Read: 

ఇన్‌సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్-2 మాక్ టెస్టులు.. ఆన్‌లైన్‌లో ప్రాక్టీస్‌కు లింక్ రిలీజ్..!

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News