Love & War Ranbir First look:తొలి సినిమా ‘సావరియా’ తర్వాత చాలా యేళ్ల తర్వాత మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో ‘లవ్ అండ్ వార్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో మరోసారి తన జీవిత భాగస్వామి ఆలియా తో కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రణ్‌బీర్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ సినిమాల్లో కనిపించే గ్రాండ్ విజువల్స్, రిచ్‌నెస్ ఈ పోస్టర్‌లో కనిపిస్తుంది. రణ్‌బీర్ ఇప్పటివరకు కనిపించని కొత్తగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. పోస్టర్‌కు జత చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా విజువల్స్‌కు అద్భుతంగా సరిపోయింది. సంగీతం విషయంలో భన్సాలీ మార్క్ మరోసారి కనిపించనుంది.
ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన మేకర్స్ “వోహ్ రుత్బా, వోహ్ రౌబ్, వోహ్ జునూన్!” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ‘లవ్ & వార్’ చిత్రం 2027 జనవరి 21న ప్రపంచ వ్యాప్తంగా రపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఒకే సారి విడుదల చేయనున్నారు.