SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రామాయణం తర్వాత ‘లవ్ & వార్’ తో రాబోతున్న రణ్‌బీర్ కపూర్.. చాక్లెట్ బాయ్ న్యూ అవతార్..

Ranbir Kapoor Love & War: ‘యానిమల్’ మూవీ తర్వాత రణ్‌బీర్ కపూర్ ఇమేజ్ పూర్తి మారిపోయింది. ఆ సినిమా తర్వాత మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడి వేషంలో ‘రామాయణ’ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ దీపావళి కానుకగా విడుదల కానుంది. రెండో భాగం వచ్చే యేడాది దీపావళి కానుకగా రాబోతుంది. ఈ రెండు సినిమాల మధ్య ‘లవ్ అండ్ వార్’ మూవీతో పలకరించబోతున్నాడు.

Written By TA Kiran Kumar Sharma
Published: Sep 24, 2026, 03:44 PM IST | Updated: Sep 24, 2026, 03:46 PM IST
Image Credit: Ranbir Kapoor New Look
Join

Love & War Ranbir First look:తొలి సినిమా ‘సావరియా’ తర్వాత చాలా యేళ్ల తర్వాత మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో ‘లవ్ అండ్ వార్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో మరోసారి తన జీవిత భాగస్వామి ఆలియా తో కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి  రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రణ్‌బీర్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ సినిమాల్లో కనిపించే గ్రాండ్ విజువల్స్, రిచ్‌నెస్ ఈ పోస్టర్‌లో కనిపిస్తుంది.  రణ్‌బీర్ ఇప్పటివరకు కనిపించని కొత్తగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.  పోస్టర్‌కు జత చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా విజువల్స్‌కు అద్భుతంగా సరిపోయింది. సంగీతం విషయంలో భన్సాలీ మార్క్ మరోసారి కనిపించనుంది.

ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన మేకర్స్ “వోహ్ రుత్బా, వోహ్ రౌబ్, వోహ్ జునూన్!” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ‘లవ్ & వార్’ చిత్రం 2027 జనవరి 21న ప్రపంచ వ్యాప్తంగా రపబ్లిక్ డే కానుకగా  ప్రేక్షకుల ముందుకు రానుంది.

రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఒకే సారి విడుదల చేయనున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES