• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /నార్త్ అమెరికాలో రామాయణం దెబ్బకు బాహుబలి రికార్డులు ఫసక్.. నెక్ట్స్ టార్గెట్ దురంధర్ 2..!!

నార్త్ అమెరికాలో రామాయణం దెబ్బకు బాహుబలి రికార్డులు ఫసక్.. నెక్ట్స్ టార్గెట్ దురంధర్ 2..!!

Ramayana North America Record: భారతీయ బాక్సాఫీస్ దగ్గర ‘రామాయణ’ మేనియా నడుస్తోంది. తొలి రోజు స్లోగా స్టార్ట్ అయిన ఈ చిత్రం ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కోస్తోంది. ఇప్పటికే వెయ్యి కోట్ల రికార్డుతో పాటు నార్త్ అమెరికాలో ‘బాహుబలి 2’ లైఫ్ టైమ్ వసూళ్లను క్రాస్ చేసిన ‘రామాయణ’ మూవీ త్వరలో ‘దురంధర్ 2’ రికార్డులపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 17, 2026, 12:17 IST|Updated: Nov 17, 2026, 12:25 IST
joinshare
నార్త్ అమెరికాలో రామాయణం దెబ్బకు  బాహుబలి రికార్డులు ఫసక్.. నెక్ట్స్ టార్గెట్ దురంధర్ 2..!!
Image Credit: Ramayana Record (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ramayana Records: ‘రామాయణ’ పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. అంతేకాదు పలు రికార్డులను ఊచకోత కోస్తోంది.  కేవలం 8 రోజుల్లోనే రూ 1000 కోట్ల క్లబ్‌లో చేరిన మూడో భారతీయ చిత్రంగా సంచలనం రేపింది.మొత్తంగా  హిందీలో  వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన 6వ చిత్రం. ఓవరాల్‌గా ఇండియన్ సినిమాలలో 11వది.

బాక్సాఫీస్ దగ్గర జైత్రయాత్ర.. 

రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర జైత్రయాత్ర కొనసాగిస్తోంది. నార్త్ అమెరికాలో కేవలం 12 రోజుల్లోనే 24.1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా  20.77 మిలియన్లతో ఉన్న బాహుబలి 2 ఆల్ టైమ్ రికార్డును క్రాస్ చేసింది. ప్రస్తుతం నార్త్ అమెరికా ఆల్ టైమ్ టాప్ ఇండియన్ గ్రాసర్స్ లిస్టులో రామాయణ పార్ట్ 1  ప్రస్తుతం సెకండ్ ప్లేస్‌లో ఉంది.

నార్త్ అమెరికాలో బాహుబలి 2 క్రియేట్ చేసిన 20 మిలియన్ డాలర్ల వసూళ్ల రికార్డును క్రాస్ చేయడానికి ‘ధురంధర్ 2’ సినిమాకు తొమ్మిదేళ్లు సమయం పట్టింది. దురంధర్ ది రివేంజ్ ‘ధురంధర్ ది రివెంజ్’ 28.64 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో ఆ రికార్డును బద్దలు కొట్టి నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. కానీ ఆ సినిమా రిలీజైన ఆరు నెలల్లోనే ఇప్పుడు ‘రామాయణ పార్ట్ 1’ వచ్చి 24 మిలియన్ల మార్క్‌ను దాటేసి తన బాక్సాఫీస్ పవర్ ఏంటో చూపించింది.

నార్త్ అమెరికాలో నెంబర్ 2లో ఉన్న ‘రామాయణ పార్ట్ 1’..

నార్త్ అమెరికా ఆల్‌టైమ్ టాప్ 10 గ్రాసర్స్ లిస్ట్ చూస్తే బాహుబలి 2 తర్వాత ధురంధర్ 20.65 మిలియన్లతో నాలుగో స్థానంలో ఉంది.  కల్కి 2898 AD $ 18.57 మిలియన్ డాలర్స్ రాబట్టింది.  పఠాన్ $17.49 మిలియన్స్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక RRR $15.34 మిలియన్లు, పుష్ప 2 సినిమా $ 15.28 మిలియన్లు, జవాన్ $15.23 మిలియన్లు, యానిమల్ $ 15.01 మిలియన్ డాలర్లతో టాప్ 10 లిస్టులో ఉన్నాయి.

కేవలం 10 రోజుల్లోనే రామాయణ $ 22 మిలియన్లు.. 12 రోజుల్లో $24.1 మిలియన్ డాలర్స్ వసూలు చేయడంతో.. ఫుల్ రన్‌లో ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందనేది చూడాలి. ఫస్ట్ పార్ట్‌కే ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి ఇంతటి రెస్పాన్స్ వస్తుంటే.. ఇక రాబోయే సెకండ్ పార్ట్‌పై అంచనాలు రెండింతలు  అయ్యాయి. ఈ జోరు చూస్తుంటే రామాయణ పార్ట్ 2 నార్త్ అమెరికాలో కచ్చితంగా $ 30 మిలియన్ డాలర్ల మార్క్‌ను టచ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.ఫస్ట్ పార్ట్ అంచనాలకు మించి భారీ సక్సెస్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ సీక్వెల్ పైనే పడింది.మొత్తంగా నిన్నటి వరకు రూ. 1440 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మరో రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుంది.

రామాయణ పార్ట్ 2 పై అంచనాలు..

ఈ సెన్సేషనల్ హిట్ తర్వాత రామాయణ పార్ట్ 2పై ఇండస్ట్రీలోనూ, ఆడియన్స్‌లోనూ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రణ్‌బీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సీక్వెల్ షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయినట్లు సినిమాటోగ్రాఫర్ పంకజ్ కుమార్ చెప్పుకొచ్చారు. మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో పార్ట్ 2 విషయంలో మేకర్స్ మరింత కేర్ తీసుకుంటున్నారు.

నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యంగా సెకండ్ పార్ట్‌లో వచ్చే హనుమంతుడు, వానర సైన్యం ఎపిసోడ్స్ కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడుతున్నారట. వీటితో పాటు భారీ స్థాయిలో VFX వర్క్స్ ‌ను చేస్తున్నారు. విజువల్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయని టీమ్ చెబుతోంది.

అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ‘రామాయణ సెకండ్ పార్ట్..

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అత్యున్నత ప్రమాణాలతో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం బ్యాలెన్స్ ఉన్న షూట్ కంప్లీట్ చేస్తూనే, సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనా చిత్ర యూనిట్  ఫోకస్ పెట్టింది. ఫస్ట్ పార్ట్ సక్సెస్‌తో వచ్చిన జోష్‌తో, పార్ట్ 2ను ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దే పనిలో రామాయణ మేకర్స్ బిజీగా ఉన్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie