SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రెగ్యులర్ కథలకు నో చెబుతున్న మిడ్ రేంజ్ కథానాయికలు.. ఢిఫరెంట్ స్టోరీలతో ఇమేజ్ మేకోవర్..

Mid Range Heroes New Way: తెలుగులో మీడియం రేంజ్ హీరోల్లో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రొటీన్ కథలు కాకుండా సినిమా సినిమాకు సరికొత్త వేరియేషన్స్ ట్రై చేస్తున్నారు. నాని, రవితేజ, విజయ్ దేవరకొండ, శర్వానంద్ దగ్గర్నుంచి మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వరకు ఎవరూ కంఫర్ట్ జోన్‌లో ఉండడానికి ప్రయత్నించడం లేదు. విభిన్నమైన జోనర్స్‌ ఎందుకు ట్రై చేస్తున్నారు..? మన హీరోల నెక్ట్స్ ప్లానింగ్ ఏంటి?

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 25, 2026, 10:03 IST | Updated: Nov 25, 2026, 10:06 IST
Image Credit: Image Make over (X/Source)
Join

Heroes New Way: ఇరుముడితో ఎమోషనల్ బ్లాక్‌బస్టర్ కొట్టిన రవితేజ.. ఈ సారి తులాభారంతో క్రైమ్, కామెడీ, పొలిటికల్ యాంగిల్స్ అన్నీ అంశాలున్న కథతో రాబోతున్నాడు.  ఈ మధ్యే ప్యారడైజ్‌తో రక్తపాతం సృష్టించిన నాని.. ప్రస్తుతం సుజీత్‌తో బ్లడీ రోమియో అంటూ యాక్షన్ స్టైలిష్ డ్రామా చేస్తున్నాడు. ఇందులో చెఫ్ కమ్ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు న్యాచురల్ స్టార్. తర్వాత ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నాడు.

శర్వానంద్ మేకోవర్..

శర్వానంద్ కూడా  ఈ యేడాది ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘బైకర్’ మూవీతో పలకరించాడు. ఈ సినిమాకు టాక్ బాగున్నా.. అందకు తగ్గ వసూళ్లను రాబట్టలేదు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ సినిమాలో పూర్తిగా భిన్నమైన ‘రా’ రస్టిక్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

విజయ్ దేవరకొండ కొత్త రూట్.. 
పీరియాడిక్ రణబాలితో హిట్ కొట్టిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. నెక్ట్స్ ‘రౌడీ జనార్ధన’గా ఫుల్ మాస్ జాతర చూపించడానికి రెడీ అవుతున్నారు. దాని తర్వాత హాయ్ నాన్న ఫేమ్ శౌర్యుతో ఎమోషనల్ సినిమా చేయబోతున్నాడు. ఇలా ఒకే తరహా పాత్రలో కాకుండా  డిఫరెంట్ జానర్స్‌ను ట్రై చేస్తున్నాడు. మొత్తంగా సినిమా సినిమాకు వేరియేషన్ ఉండేలా చూస్తున్నారు విజయ్. దీని తర్వాత విక్రమ్ కే కుమార్‌తో సినిమా ఉంది.

ఇక సంబరాల ఏటిగట్టుతో యాక్షన్ డ్రామా చేస్తున్న సాయి ధరమ్ తేజ్.. క ఫేమ్ సుజీత్-సందీప్ ద్వయంతో మిస్టిక్ థ్రిల్లర్‌ ప్లాన్ చేయబోతున్నాడు. దానికంటే ముందే తేజ కాకమాను దర్శకత్వంలో ఓ డిఫరెంట్ సినిమా చేయబోతున్నాడు.

స్పోర్ట్స్ డ్రామాతో బరిలోకి.. 
వరుణ్ తేజ్ కూడా స్పోర్ట్స్ డ్రామాతో బరిలోకి దిగబోతున్నారు. ప్రతి సినిమాలో డిఫరెంట్ అటెంప్ట్ చేసే వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో బాగానే నవ్వించారు. ప్రస్తుతం ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ యధు వంశీ దర్శకత్వంలో ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డ్రామాతో గ్రౌండ్‌లోకి దిగిపోయారు. ఈ సినిమాకు ‘బరి’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు  మేకర్స్. నిహారిక కొణిదెల నిర్మిస్తోంది.  మొత్తానికి మిడ్ రేంజ్ హీరోలు మూస కథలకు గుడ్‌బై చెప్పేసి.. ఎప్పటికప్పుడు డిఫరెంట్  జోనర్స్ ‌ను ట్రై చేస్తున్నారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES