SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Movie News: మంచు తెరల నడుమ గుండెను తాకే రాగం.. మ్యూజిక్ లవర్స్‌కు మెలోడీ ట్రీట్..!

Movie News: కొన్ని ప్రేమకథలు చూడగానే కళ్లల్లో మెరుస్తాయి.. కొన్ని పాటలు వినగానే మనసు లోతుల్లోకి దూసుకెళ్తాయి. అచ్చం అలాంటి మధురానుభూతినే పంచుతూ.. మూవీ లవర్స్‌లో ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసిన ‘జై హింద్, జై సింధ్: ఎ లవ్ స్టోరీ’ మూవీ తన సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ మూవీ నుంచి తొలి మెలోడీ ‘రుబారు’ తాజాగా విడుదలై.. ప్రేక్షకులను అలరిస్తోంది.

Written By Ashok Krindinti
Published: Sep 30, 2026, 02:34 PM IST | Updated: Sep 30, 2026, 02:36 PM IST
Image Credit: Movie News
Join

Movie News: డిఫరెంట్ స్టోరీతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది ‘జై హింద్, జై సింధ్: ఎ లవ్ స్టోరీ’ మూవీ టీమ్. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయింది. మొదటి సాంగ్‌ ‘రుబారు’ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మెలోడీలో హీరో గౌరవ్ ధింగ్రా, హీరోయిన్ అకైషా వాత్స్ మధ్య కెమిస్ట్రీ, స్వచ్ఛమైన ప్రేమ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. మంచు దుప్పటి కప్పుకున్న అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేసిన ‘రుబారు’ సాంగ్.. తొలి చూపు ప్రేమ తాలూకు అమాయకత్వాన్ని, మధురమైన అనుభూతులను కళ్లకు కడుతోంది. రచయిత కుమార్ అందించిన సాహిత్యానికి, జె.అనూప్ సీలిన్ అందించిన ట్యూన్స్ తోడై పాటకు ప్రాణం పోశాయి. ఎండీ ఇర్ఫాన్, శివానీ శర్మల మధుర గానం సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తోంది.

తమ సరికొత్త లేబుల్ ‘సామీస్ మ్యూజిక్’ ద్వారా విడుదలైన తొలి పాట ‘రుబారు’ కావడం పట్ల నిర్మాత సామీ నాన్వానీ సంతోషం వ్యక్తం చేశారు. కేవలం సంగీతం మాత్రమే కాకుండా, బలమైన భావోద్వేగాలు, గుర్తుండిపోయే కథలకు వేదికగా ఈ లేబుల్‌ను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా నిర్మాత సామీ నాన్వానీ మాట్లాడుతూ.. ‘రుబారు’ పాట విడుదల తమ కొత్త మ్యూజిక్ లేబుల్ ‘సామీస్ మ్యూజిక్’ నుంచి వచ్చిన తొలి మ్యూజికల్ ఆఫరింగ్ అని తెలిపారు. మెలోడీ, భావోద్వేగం, ఎప్పటికీ గుర్తుండిపోయే కథలను ప్రోత్సహించే ఉద్దేశంతో తమ లేబుల్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 

దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన జై హింద్, జై సింధ్ మూవీ.. కేవలం ప్రేమకు మాత్రమే పరిమితం కాకుండా.. మూలాలు, కుటుంబ అనుబంధాలు, వ్యక్తిత్వ విలువల నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రంగా రూపొందింది. ఈ సినిమా ద్వారా గౌరవ్ ధింగ్రా, అకైషా వాత్స్ వెండితెరకు పరిచయం కానున్నారు. జయప్రద, మహేశ్ మంజ్రేకర్, రాహుల్ దేవ్, ఛాయా కదమ్, జరీనా వహాబ్, విక్రమ్ కొచర్, అమిత్ బెహల్, ఇంద్రా తివారీ, ఉపాసనా సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాన్‌ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు.  


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES