• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘రూపాయనమ:’ డబ్బు నేపథ్యంలో సాగే ఎంగేజింగ్ మనీ డ్రామా..

‘రూపాయనమ:’ డబ్బు నేపథ్యంలో సాగే ఎంగేజింగ్ మనీ డ్రామా..

Rupayanamaha Review:డబ్బు ఇతివృత్తంలో తెలుగు సహా వివిధ భాషల్లో పలు చిత్రాలు తెరకెక్కాయి. ఈ రూట్లో వస్తోన్న చిత్రం ‘రూపాయనమ:’. రీసెంట్‌గా హిందీలో వచ్చిన ‘ధమాల్ 4’ మూవీ కూడా ఈ నేపథ్యంలో వచ్చి ప్రేక్షకులను అలరించింది. . చిత్రవేద ప్రొడక్షన్స్ బ్యానర్ పై పావని సాగి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాను అరవింద్ రెడ్డి డైరెక్ట్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 02, 2026, 08:07 AM IST|Updated: Oct 02, 2026, 08:12 PM IST
joinshare
‘రూపాయనమ:’ డబ్బు నేపథ్యంలో సాగే ఎంగేజింగ్ మనీ డ్రామా..
Image Credit: rupayanamaha review (x/source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Auto Charges Hike: ఆటో ఛార్జీల పెంపుపై కార్మికుల ఆగ్రహం.. 3 రోజుల నిరసనలు

Auto Charges Hike: ఆటో ఛార్జీల పెంపుపై కార్మికుల ఆగ్రహం.. 3 రోజుల నిరసనలు

2

Bandi Sanjay: కాంగ్రెస్‌ పార్టీకి కొత్త పేరు పెట్టిన బండి సంజయ్‌.. ఏమిటో తెలుసా?

3

Vande Bharat Sleeper: ఏపీకి భారీ శుభవార్త.. రెండు ప్రధాన నగరాల మధ్య వందే భారత్‌ స్లీపర్‌ రైలు

4

Sitara Ghattamaneni: సితార మాటల్లో పక్కా తెలంగాణ స్లాంగ్.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు కొత్త ట్రీట్!

5

Fahadh Faasil: నేను వేసుకున్న బంగారం మొత్తం నా భార్యవే.. ఫహాద్ ఫాజిల్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

రివ్యూ:రూపాయనమ: (Rupayanamaha)
నటీనటులు: అరవింద్ పండ్రాతే, వేణు పోల్సాని, క్రాక్ శ్రీమణి, డి. అనుదీప్, శ్రావణి మల్కాని, విషన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి తదితరులు
సినిమాటోగ్రఫీ: జింకా వరుణ్ నాయుడు
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
సంగీతం: రిషి ఎం
బ్యానర్: చిత్ర వేద ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్: పావని సాగి
డైరెక్షన్: అరవింద్ రెడ్డి

కథ విషయానికొస్తే..

హరి నారాయణ తన తల్లి, భార్య, కూతురితో కలిసి గ్రామంలో నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు.  ఆర్ధికంగా చితికిపోయిన అతనికి ఏకంగా కోటి రూపాయల లాటరీ రూపంలో అదృష్టం తలుపుతడుతుంది. దీంతో తమ సమస్యలన్ని తీరిపోతాయనుకున్న వారి జీవితంలో అనుకోని ట్విస్ట్ వచ్చి పడుతుంది. వారు కొన్న లాటరీ టికెట్ కనిపించకుండా పోతుంది. ఇల్లు మొత్తం వెతుకుతున్న సమయంలో ఓ అజ్ఞాతవ్యక్తి  నుంచి కాల్ వస్తుంది. మీరు వెతుకుతున్న లాటరీ టికెట్ తన దగ్గర ఉందన్నారు. రూ. 10 లక్షలు ఇస్తే ఆ లాటరీ టికెట్ ఇస్తానని చెబుతాడు. ఈ నేపథ్యంలో హరి నారాయణ ఏం చేశాడు. చివరకు హరి నారాయణ ఏం చేశాడు. చివరికి  అతనికి లాటరీ టికెట్ చేతికి అందిందా లేదా ఈ నేపథ్యంలో జరిగిన డ్రామానే మిగతా స్టోరీ.


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

తెలుగులో డబ్బు నేపథ్యంలో సాగే చిత్రాలు తెరకెక్కి ప్రేక్షకులను అలరించాయి. డబ్బు అంటేనే అందరికీ ఓ రకమైన పేరాశ. దర్శకుడు అరవింద్ రెడ్డి స్టోరీని పూర్తి గ్రామీన నేపథ్యంలో సహజసిద్ధంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా ఊర్లో ఒక కుటుంబానికి మరో కుటుంబంతో అప్యాయత, అనురాగాలలను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఊర్లో ప్రజలు అమాయకత్వం, ఎలాంటి కపటత్వం లేకుండా స్వచ్ఛంగా సాగడం వంటివి అత్యంత సహజసిద్ధంగా ఉన్నాయి. అంతా కొత్తవాళ్లే అయిన ఎంతో నాచురల్‌గా యాక్ట్ చేశారు. కుటుంబ సమస్యలతో బాధపడే ఓ కామన్ మ్యాన్ పాతర్లో అరవింద్ పండ్రాతే తెరపై చక్కటి నటనను కనబరిచాడు. ముఖ్యంగా లాటరీ తగలడం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లాటరీ లేదు.కొన్ని దశాబ్దాల క్రితమే వీటిని మన రాష్ట్ర ప్రభుత్వ నిషేధించింది.  కేరళం, గోవా వంటి కొన్ని రాష్ట్రాల్లోనే ఈ లాటరీ అనేది ఉంది. ముఖ్యంగా కోటి రూపాయల లాటరీని ఎవరో దొంగతనం చేయడం.. అది వారికి ఇవ్వాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసే సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఎత్తుకు పై ఎత్తులతో సాగే డ్రామా కామన్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. అంతా కొత్తవాళ్లే కావడం ఈ సినిమాకు మైనస్. సినిమా ప్రథమార్ధం స్లో నేరేషన్.. ఇంట్లో లాటరీ టికెట్ కోసం ఇంట్లో వాళ్లు వెతకడం వంటి సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. లో బడ్జెట్‌లో ఉన్న పరిమితులతో తీసిన ఈ సినిమా మెప్పిస్తుంది.

జింకా వరుణ్ నాయుడు కెమెరా పనితనం గ్రామీణ లొకేషన్ల సహజ సిద్ధంగా ఉన్నాయి. రిషి ఎం అందించిన నేపథ్య సంగీతం కథలో భావోద్దేగాన్ని తెలిపేలా ఉంది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ కథను సూటిగా నడిపించడంలో సహాయ పడింది.

మొత్తంగా రూపాయనమ: అనేది డబ్బు చుట్టూ తిరిగే స్టోరీ. పల్లెటూరి స్వచ్ఛమైన హాస్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా ఉండటం ప్రేక్షకులకు ఉన్నంతలో కాస్త ఊరట అని చెప్పాలి.

పంచ్ లైన్: ‘రూపాయనమ:’ మెప్పించే మనీ క్రైమ్ డ్రామా..

రేటింగ్: 2.75/5

Add Zee News as a Preferred Source
TAGS:
Movie Review
Tollywood
Telugu Movie
Telugu News