• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /Bandi Sanjay: కాంగ్రెస్‌ పార్టీకి కొత్త పేరు పెట్టిన బండి సంజయ్‌.. ఏమిటో తెలుసా?

Bandi Sanjay: కాంగ్రెస్‌ పార్టీకి కొత్త పేరు పెట్టిన బండి సంజయ్‌.. ఏమిటో తెలుసా?

Bandi Sanjay Slams To Revanth Reddy Comments On Sri Ram And Shiva: కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కొత్త పేరు పెట్టారు. ఐఎన్‌సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్‌గా అభివర్ణించారు. ఈ సందర్భంగా దేవుళ్లను విభజిస్తూ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్‌ ఖండించారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 02, 2026, 23:17 IST|Updated: Oct 02, 2026, 23:21 IST
joinshare
Bandi Sanjay: కాంగ్రెస్‌ పార్టీకి కొత్త పేరు పెట్టిన బండి సంజయ్‌.. ఏమిటో తెలుసా?
Image Credit: Bandi Sanjay

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jammikunta: 'ఇటలీ నేషనల్ కాంగ్రెస్ డూప్లికేట్ గాంధీ కుటుంబానిదే. కాంగ్రెస్ నేతల్లారా గాంధీ సంపన్నుడు కాబట్టే రాముడిని కొలిచారా? గాంధీ నోట నిత్యం రామ నామమే. జీవితాంతం హిందూ సనాతన ధర్మాన్ని ఆచరించిన మహానీయుడు గాంధీ. కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకి' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. చిట్టచివరి పేదలకు సైతం ప్రభుత్వ ఫలాలు అందించాలని ఆరాటపడిన నాయకుడు గాంధీ అని కొనియాడారు. గాంధీ అసలు సిసలైన వారసుడు  మోదీ, బీజేపీ అని బండి సంజయ్‌ ప్రకటించారు.

'కుటుంబ వారసత్వం, అవినీతి, హిందుత్వ ద్వేషం పుణికి పుచ్చుకున్న పార్టీ. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు కారణం ముమ్మాటికీ కాంగ్రెస్సే. ముస్లిం ఓట్లతో కాంగ్రెస్ గెలవాలనుకుంటోంది. హిందూ ఓట్లను ఏకం చేస్తాం' అని బండి సంజయ్‌ తెలిపారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి ఘన నివాళి అర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

‘గాంధీ నిత్యం పూజించిన రాముడు సంపన్నుల దేవుడా? లేక ప్రజలంతా నిత్యం తలచి కొలిచి ఆచరించాల్సిన  ఆరాధ్య దైవమా?’ అని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్‌ ఇచ్చారు. పదవులను కాంక్షించిన మహనీయుడు గాంధీజీ కుటుంబ వారసత్వ, అవినీతిమయ రాజకీయాలకు పూర్తి వ్యతిరేకమని తెలిపారు. డూప్లికేట్ గాంధీ కుటుంబం మాత్రం దానికి భిన్నంగా వారసత్వ, అవినీతిమయ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. గాంధీ హిందుధర్మాన్ని ఆచరించారని, ప్రస్తుతమున్న ఇటలీ నేషనల్ కాంగ్రెస్ మాత్రం.. హిందువులను చీల్చేందుకు కుట్రలు చేస్తోందని బండి సంజయ్‌ ఆరోపించారు.

'గాంధీ పేరు చెప్పుకుని రూ.వేల కోట్లు సంపాదించి స్టార్ హోటల్ సౌకర్యాలను అనుభవిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు గాంధీ వారసులేనా?' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. మూమ్మాటికీ డూప్లికేట్ గాంధీ వారుసులేనని.. నిజమైన గాంధీకి పుట్టిన వాళ్లెవరూ అధికారాన్ని పంచుకోలేదని తెలిపారు. 'గాంధీ పేరును తగిలించుకున్న ఈ డూప్లికేట్ గాంధీ కుటుంబం మాత్రం గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అధికారాన్ని చెలాయిస్తూ కుటుంబ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. కాంగ్రెస్ పార్టీని చెప్పుచేతల్లో తీసుకుని నడిపిస్తోంది' అని విమర్శించారు.

'గాంధీజీ కలలు కన్న రామరాజ్యాన్ని ఆచరణలో చూపుతోంది ఎవరు? అవినీతికి తావులేని, రాజు పేద అనే తేడా లేని పాలన అందిస్తున్నదెవరు? అట్టడుగునున్న పేదవాడికి కూడా సంక్షేమ ఫలాలు అందిస్తున్నదెవరు? ముమ్మాటికీ బీజేపీయే, నరేంద్రమోదీయే' అని బండి సంజయ్‌ వివరించారు. 'రోడ్డు మీద చెత్త, మనసులో ద్వేషం, రాజకీయాల్లో అవినీతి ఉండకూడదు అని గాంధీ చెప్పారని తెలిపారు. స్వార్ధం, కోపం, ద్వేషం, అహంకారాన్ని శుభ్రం చేసుకోవడమే గాంధీకి నిజమైన నివాళి అని కేంద్ర మంత్రి ్రకటించారు.

'హిందువులను చీల్చేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో కుట్ర చేస్తున్నాడు' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. తెలంగాణ మార్పు రావాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. 'ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు ముమ్మాటికీ కారణం కాంగ్రెస్‌ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాల్సిందే' అని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

Add Zee News as a Preferred Source
TAGS:
BJP
Karimnagar
Telugu News
Telangana News
Politics