SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

సమంత ప్రెగ్నెన్సీ శృతి హాసన్ ఫుల్ ఖుషీ..

Samantha Pregnecy Shruti Haasan Happy: సమంత ప్రెగ్నెన్సీతో శృతి హాసన్ ఎగిరి గంతేస్తుంది. సామ్ కు కడుపు పండటంతో శృతి హాసన్ ఉబ్బి తబ్బిబ్బు అవుతుంది. ఇంతకీ సమంత ప్రెగ్నేసీకి శృతి హాసన్‌కు ఎందకంత ఖుషీనో తెలుసుకోవాలనుందా..

Reported By TA Kiran Kumar Sharma Written By TA Kiran Kumar Sharma
Published: Sep 22, 2026, 02:18 PM IST | Updated: Sep 22, 2026, 02:22 PM IST
Image Credit: సమంత హాలీవుడ్ ప్రాజెక్ట్‌లోకి శృతి హాసన్
Join

Shruti Haasan Got Sam Offer: అవును సమంత ప్రెగ్నెన్సీ ఇపుడు శృతి హాసన్‌కు ఏకంగా హాలీవుడ్ ఆఫర్ వచ్చేలా చేసింది. 12 యేళ్ల  క్రితం ఓ సినిమాలో ఇలాగే స్యామ్ ఆఫర్ తీసుకుని హిట్ అందుకున్న శృతి హాసన్.. పుష్కరం తర్వాత మరోసారి ఆ సీన్ రిపీట్ చేస్తుందనే వార్త హల్ చల్ చేస్తుంది.  అసలు సమంత చేయాల్సిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ శృతి చేతికి ఎలా వచ్చిందనేది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా సమంత..హిందూ మత విశ్వాసాల ప్రకారం సీమంతం చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అంతేకాదు క్రిస్టియన్‌గా పుట్టిన సామ్.. జగ్గీ వాసుదేవ్ గురువు కారణంగా హిందూ మతంపై విశ్వాసం పెరిగేలా చేసింది.

సామ్ ఆఫర్ శృతి హాసన్.. 

పెద్ది సినిమాతో తెలుగులో మరోసారి ట్రెండ్ అయింది శృతి హాసన్. ప్రెగ్నెన్సీ వల్ల సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో.. ఆమె చేయాల్సిన ‘చెన్నై స్టోరీ’  అనే ఇండో యూకే ఫిల్మ్ శృతి చేతికి వచ్చిన్నట్టు చెన్నై మీడియా చెబుతుంది.  బాఫ్టా అవార్డు విన్నర్ ఫిలిప్ జాన్ తెరకెక్కిస్తున్న ఈ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌కు టైమేరి ఎన్ మురారి రాసిన ‘ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ నవలకు మూలం.

సమంత ప్లేస్‌లో శృతి హాసన్.. 

సమంత స్థానాన్ని శృతి తీసుకోవడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. అప్పట్లో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘ఎవడు’  సినిమాలో ముందు సమంతనే హీరోయిన్‌గా తీసుకుని ఓ షెడ్యూల్ కూడా చేసారు నిర్మాతలు . కానీ స్కిన్ ప్రాబ్లమ్స్‌తో స్యామ్ ఆ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకుంది. ఆ ప్లేస్‌లో శృతి హాసన్ ఎంట్రీ ఇచ్చింది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత శృతి కెరీర్‌కు ‘ఎవడు’ సినిమా బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి.

పుష్కరం తర్వాత సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ‘చెన్నై స్టోరీ’లో శృతి హాసన్ సరసన వివేక్ కల్రా లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు. కెవిన్ హార్ట్, విన్సెంట్ లాంటి హాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో భాగస్వామిగా ఉన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో చెన్నై స్టోరీ భారీ బజ్ క్రియేట్ చేస్తుంది. అన్నట్లు మూడేళ్ళ కింద ‘ది ఐ’ సినిమాతో ఆల్రెడీ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్.  ఇప్పుడు సమంత చేయాల్సిన హాలీవుడ్ మూవీ ‘చెన్నై స్టోరీ’ ఆఫర్ అందుకోవడం విశేషం.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES