• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /లవ్ & వార్ మూవీలో కెవ్వు కేక పుట్టిస్తున్న ఆలియా భట్ ఫస్ట్ లుక్..

లవ్ & వార్ మూవీలో కెవ్వు కేక పుట్టిస్తున్న ఆలియా భట్ ఫస్ట్ లుక్..

Love & War Alia Bhatt Look Goes Viral: బాలీవుడ్‌లో సున్నితమైన ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించడంలో సంజయ్ లీలా భన్సాలీకి ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ఈయన నిజ జీవిత భార్యాభర్తలైన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్‌కు సంబంధించిన లుక్‌ను విడుదల చేసి ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఆలియా భట్‌ లుక్‌ను విడుదల చేశారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Sep 25, 2026, 03:11 PM IST|Updated: Sep 25, 2026, 03:13 PM IST
joinshare
లవ్ & వార్ మూవీలో కెవ్వు కేక పుట్టిస్తున్న ఆలియా భట్ ఫస్ట్ లుక్..
Image Credit: Alia Look (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Love & War Alia Look: రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్  చేసిన ఒక రోజు గ్యాప్‌లోనే తాజాగా ‘లవ్ అండ్ వార్’ మూవీ నుంచి  ఆలియా భట్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అలియా ఇంతకుముందెన్నడూ కనిపించని గ్లామరస్ లుక్‌లో మెరిసింది. 2027లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘లవ్ & వార్’ ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో  సంజయ్ లీలా భన్సాలీ తన గత చిత్రాలకు భిన్నమైన డిఫరెంట్ ప్రపంచాన్ని చూపించబోతున్నట్టు తెలుస్తుంది.

మేకర్స్ సామాజిక మాధ్యమాల్లో  అలియా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ పోస్టర్‌లో అలియా స్లిట్ స్కర్ట్, ప్రత్యేకమైన హెడ్‌పీస్‌తో కుర్చీలో కూర్చుని కాస్త వెరైటీగా కనిపిస్తోంది. ఆలియా లుక్, స్టైలింగ్, హావభావాలు రెట్రో ఫీల్‌ను అందించబోతున్నాయి.  ఈ పాత్రలో అలియా పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో  తెరకెక్కుతున్న ‘లవ్ & వార్’లో రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం 2027 జనవరి 21న రిపబ్లిక్ వీకెండ్‌లో విడుదల చేశారు. ఈ సినిమాను  హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో  తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఆలియా భట్ విషయానికొస్తే.. పెళ్లి తర్వాత కూడా వరుసగా చిత్రాలు చేస్తోంది. పెళ్లి కి ముందు వీళ్లిద్దరు కలిసి ‘బ్రహ్మాస్త్ర’లో కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తోన్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. ఈ సినిమాలో మరో హీరోగా బాలీవుడ్ న్యూ సెన్సేషన్ విక్కీ కౌశల్ కూడా నటిస్తున్నాడు. మొత్తంగా ముక్కోణపు ప్రేమ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. 

Add Zee News as a Preferred Source
TAGS:
Bollywood
OTT Movies
Telugu Movie